AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: కన్నీళ్లు తెప్పించే ప్రేమకథ.. ఓటీటీలోకి లేటెస్ట్ సూపర్ హిట్ సినిమా.. IMDB టాప్ రేటింగ్ మూవీ

ప్రేమికుల దినోత్సవం కానుకగా గత నెల 14న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. చిన్న సినిమా ట్యాగ్ తో రిలీజైనా సంచలన విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద మోస్తరు వసూళ్లు రాబట్టింది. విభిన్నమైన ప్రేమకథతో తెరకెక్కిన ఈ సినిమాకు యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. అలాగే ప్రభాస్ లాంటి స్టార్స్ సైతం ఈ మూవీపై ప్రశంసలు కురిపించారు.

OTT Movie: కన్నీళ్లు తెప్పించే ప్రేమకథ.. ఓటీటీలోకి లేటెస్ట్ సూపర్ హిట్ సినిమా.. IMDB టాప్ రేటింగ్ మూవీ
OTT Movie
Basha Shek
|

Updated on: Mar 11, 2026 | 8:29 AM

Share

చాలా గ్యాప్ తర్వాత టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్‌ శోభన్‌ నటించిన సినిమా కపుల్ ఫ్రెండ్లీ. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఫెమినా మిస్ ఇండియా మానస వారణాసి హీరోయిన్ గా చేసింది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ దాదాపు 15-20 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఇక కపుల్ ఫ్రెండ్లీ సినిమాను చూసి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సైతం ప్రశంసలు కురిపించారు. తనకు వర్షం సినిమా ఎంతో సంతోష్ శోభన్ కి ఈ కపుల్ ఫ్రెండ్లీ సినిమా అంతే అని అన్నాడు. థియేటర్లలో ఆడియెన్స్ ను కట్టిపడేసిన ఈ ప్రేమకథ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ కపుల్ ఫ్రెండ్లీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మార్చి 13 నుంచి ఈ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్ కు తీసుకురానున్నారు. తెలుగుతో పాటు తమిళ్ లోనూ ఈ లవ్ స్టోరీ స్ట్రీమింగ్ కు అందుబాటులో రానుంది.

ఇవి కూడా చదవండి

అశ్విన్ చంద్రశేఖర్ తెరకెక్కించిన కపుల్ ఫ్రెండ్లీ సినిమాలో సంతోష్ శోభన్, మానస వారణాసి, యోగి బాబు, రాజీవ్ కనకాల, గోపరాజు రమణ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకు ఆదిత్య రవీంద్రన్ సంగీతం సమకూర్చారు. దినేష్ పురుషోత్తమన్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. శివ (సంతోష్ శోభన్) ఒక ఇంటీరియర్ డిజైనర్ అవ్వాలనే లక్ష్యంతో చెన్నైలో అడుగు పెడతాడు. అయితే అవకాశాలు రాక సర్వైవల్ కోసం బైక్ టాక్సీ రైడర్‌గా పనిచేస్తుంటాడు. మరోవైపు మిత్ర (మానస వారణాసి) ఐటీ జాబ్ ఆఫర్ లెటర్ కోసం వెయిట్ చేస్తూ ఇబ్బందులు పడుతుంటుది. వీరిద్దరూ అనుకోని పరిస్థితుల్లో కలుస్తారు. ఆర్థిక కారణాలతో తప్పనిసరి పరిస్థితుల్లో ఒకే రూమ్‌లో ఉండాల్సి వస్తుంది. వేర్వేరు లక్ష్యాలతో ఉన్న వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది..? సమాజం నుంచి, పేరెంట్స్ నుంచి వీరికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి..? చివరికి వీరు ఒక్కటయ్యారా లేదా అనేది మిగతా కథ..

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us