AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhurandhar 2: ధురంధర్ సినిమాపై ఫిన్లాండ్ అధ్యక్షుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. సీక్వెల్ పై ఏమన్నారంటే?

సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ధురంధర్ 2' సినిమా పెయిడ్ ప్రీమియర్ షోల ద్వారానే కోట్ల రూపాయల వసూళ్లు సాధిస్తోంది. ఇదే క్రేజ్ ఇలాగే కొనసాగితే, మొదటి వారాంతంలోనే ఈ సినిమా రికార్డు కలెక్షన్లు సాధించడం ఖాయమని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Dhurandhar 2: ధురంధర్ సినిమాపై ఫిన్లాండ్ అధ్యక్షుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. సీక్వెల్ పై ఏమన్నారంటే?
Ranveer Singh movie Dhurandhar 2
Basha Shek
|

Updated on: Mar 10, 2026 | 6:45 AM

Share

సాధారణంగా ఒక దేశాధినేత మరొక దేశాన్ని సందర్శించినప్పుడు, చర్చలు సాధారణంగా రక్షణ ఒప్పందాలు, సాంకేతికత, దౌత్ సంబంధాల చుట్టూ తిరుగుతాయి. కానీ ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ మాత్రం ఆసక్తికరంగా రణవీర్ సింగ్ చిత్రం ‘ధురంధర్’ గురించి మాట్లాడారు. భారతదేశాన్ని సందర్శించే ముందు తన కొడుకు చెప్పడంతో ‘ధురంధర్’ చూశానని స్టబ్ తెలిపాడు.అంతేకాకుండా, ఈ చిత్రం సీక్వెల్ చూసేందుకు తాను కూడా చాలా ఉత్సాహంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు. ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్స్ మార్చి 4 నుంచి 7 వరకు మన దేశంలో పర్యటించారు. ఈ సందర్భంగా, ప్రముఖ వార్తా సంస్థ ‘ANI’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ధురంధర్ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.. “భారతదేశానికి రాకముందు, నా కొడుకు ‘ధురంధర్’ సినిమా చూడమని అడగడంతో ఇంట్రెస్ట్ గా చూశాను. నాకు సినిమా బాగా నచ్చింది. ఉగ్రవాదంపై పోరాటం నేపథ్యంలో తెరకెక్కిన ఈ కథ నాకు నిజంగా నచ్చింది. మార్చి 19న విడుదల కానున్న ధురంధర్ సీక్వెల్ కోసం నేను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’ అని చెప్పుకొచ్చారు.

‘ధురంధర్ 2: ది రివెంజ్’ సినిమా ట్రైలర్ మార్చి 7న విడుదలైంది . ఈ ట్రైలర్‌లో జస్కిరత్ సింగ్ రంగి పాత్రలో రణ్‌వీర్ సింగ్ అదరగొట్టాడు. ముఖ్యంగా యాక్షన్ సీన్లలో దుమ్ము రేపాడు. జస్కిరత్ కరాచీ అండర్ వరల్డ్ నమ్మకాన్ని సంపాదించుకున్నాడని ల్యారీలో టెర్రరిజమ్ నెట్‌వర్క్‌ను నిర్మూలించడమే లక్ష్యంగా చేసుకున్నాని ఈ ట్రైలర్ చూపిస్తుంది. ఈ సీక్వెల్ మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. హిందీతో పాటు, ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో కూడా ఈ మూవీ రిలీజ్ కానుంది.

ఇవి కూడా చదవండి

 వీడియో ఇదిగో..

‘ధురంధర్’ మొదటి భాగంలో రణవీర్ సింగ్ హంజా అనే గూఢచారి పాత్రను పోషించాడు. అతనితో పాటు అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్. మాధవన్, రాకేష్ బేడి, సారా అర్జున్ కూడా విిధ పాత్రలు పోషించారు. ముఖ్యంగా రెహ్మాన్ డకైట్ పాత్రలో అక్షయ్ ఖన్నా నటన సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్‌ను పొందింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్ల మార్కును దాటింది. ఇప్పుడు ధురంధర్ సీక్వెల్ ఏ కొత్త రికార్డులను సృష్టిస్తుందో చూడాలి. ధురంధర్ 2′ సినిమా అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ పెరుగుతున్నాయి, ఈ సినిమా ప్రివ్యూల ద్వారానే రూ.30 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది. పివిఆర్ ఐనాక్స్, సినీపోలిస్ వంటి ప్రధాన మల్టీప్లెక్స్‌లలో ఇప్పటికే 1.60 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి.

ధురంధర్ 2 సినిమా తెలుగు ట్రైలర్ ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!
నాన్న చనిపోయాక జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్ అన్ని కష్టాలు పడ్డాడా?
నాన్న చనిపోయాక జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్ అన్ని కష్టాలు పడ్డాడా?
శ్రీరామ భక్తులకు అయోధ్య నుంచి శుభవార్త.. 70+ వయోవృద్ధులు..
శ్రీరామ భక్తులకు అయోధ్య నుంచి శుభవార్త.. 70+ వయోవృద్ధులు..