AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: డ్రమ్ములో డెడ్‌ బాడీ.. ఓటీటీలోకి వచ్చిన ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్.. IMDBలోనూ టాప్ రేటింగ్

ప్రస్తుతం ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, సిరీస్ లకు మంచి ఆదరణ లభిస్తోంది. అలా ఈ వారం కూడా ఒక ఇంట్రెస్టింగ్ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ డైరెక్టుగా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. టీజర్, ట్రైలర్ తోనే ఆసక్తిని రేకెత్తించిన ఈ సిరీస్ థ్రిల్లర్ మూవీ లవర్స్ కు ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.

OTT Movie: డ్రమ్ములో డెడ్‌ బాడీ.. ఓటీటీలోకి వచ్చిన ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్.. IMDBలోనూ టాప్ రేటింగ్
OTT Movie
Basha Shek
|

Updated on: Mar 07, 2026 | 9:46 PM

Share

ఎప్పటిలాగే ఈ శుక్రవారం (మార్చి 06) కూడా ఓటీటీలోకి పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు వచ్చేశాయి. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లిష్ తదిరత భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ కూడా ఉంది. బిగ్ బాస్ విజేత నిఖిల్ మాలియక్కల్ ఇందులో హీరోగా నటించడం విశేషం. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT)లోని ఓ డిఫరెంట్ స్టైల్‌లో పని చేసే పోలీసు అధికారి విక్రమ్ వాసు పాత్రలో నిఖిల్ కనిపించాడు. అలాగే బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి మరో కీలక పాత్రలో మెరిసింది. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్ అభిమానులకు తెగ నచ్చేశాయి. బ్రహ్మ రుద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ ను . జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రవీణ, అనిల్ కడియాల సంయుక్తంగా నిర్మించారు. ఈ ఓటీటీ సిరీస్‌లో ఒక్కో ఎపిసోడ్‌లో ఒక్కో క్రైమ్‌ను చూపించనున్నారని తెలుస్తోంది. ఆ కేసులను విక్రమ్ ఎలా సాల్వ్ చేశాడనే కథగా ఈ సిరీస్ సాగనుందని అర్థమవుతోంది.

శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఓటీటీలోకి వచ్చిన ఈ సిరీస్ పేరు విక్రమ్ ఆన్ డ్యూటీ. సమాజంలో జరుగుతున్న నేరాలు, వాటి వెనక ఉన్న హంతకులు, రహస్యాలను విక్రమ్ ఎలా ఛేదించారన్న నేపథ్యంలో ఈ సిరీస్ సాగుతుంది. ఓటీటీలోకి వచ్చిన 24 గంటలు పూర్తి కాకముందే ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఓటీటీ టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. ఈ నేపథ్యంలో శనివారం (మార్చి 7) మేకర్స్ ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో మాట్లాడుతూ.. ‘ఇది నాకు చాలా కొత్త అనుభవం. విక్రమ్ వాసు పాత్రలో నేను చాలా ఎంజాయ్ చేశాను. ఒక్కో కేసు ఒక్కో రకంగా ఉంటుంది. ప్రేక్షకులు ఎప్పుడూ ఊహించని ట్విస్ట్‌లు ఈ సిరీస్ లో ఉంటాయి’ అని అన్నాడు. ఓటీటీలో మంచి క్రైమ్ థ్రిల్లర్ సినిమా లేదా సిరీస్ చూడాలనుకునేవారికి విక్రమ్ ఆన్ డ్యూటీ మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

జియో హాట్ స్టార్ లో విక్రమ్ ఆన్ డ్యూటీ వెబ్ సిరీస్..

Follow Us
నోకియా ఫీచర్‌‌ ఫోన్‌ చూశారా? కొత్త ఫీచర్ గురించి తెలిస్తే షాకే
నోకియా ఫీచర్‌‌ ఫోన్‌ చూశారా? కొత్త ఫీచర్ గురించి తెలిస్తే షాకే
ఆగస్టు 29 రాశిఫలాలు: వారికి ఉద్యోగ, ఆదాయ విషయాల్లో శుభవార్తలు
ఆగస్టు 29 రాశిఫలాలు: వారికి ఉద్యోగ, ఆదాయ విషయాల్లో శుభవార్తలు
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
సూర్యవంశీకి షాకిచ్చిన.. టీమ్‌ లిస్ట్‌లో బుడ్డోడి పేరు గల్లంతు
సూర్యవంశీకి షాకిచ్చిన.. టీమ్‌ లిస్ట్‌లో బుడ్డోడి పేరు గల్లంతు
క్రెడిట్ కార్డులు వాడుతున్నారా..? ఆర్బీఐ కొత్త రూల్..
క్రెడిట్ కార్డులు వాడుతున్నారా..? ఆర్బీఐ కొత్త రూల్..
ఓటీటీలో దుమ్మురేపుతోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ఓటీటీలో దుమ్మురేపుతోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
మన పూర్వికులు బలానికి 100ఏళ్ల రహస్యం ఇదే..
మన పూర్వికులు బలానికి 100ఏళ్ల రహస్యం ఇదే..
బాత్రూమ్ టైల్స్‌పై మొండి మరకలా? ఈ సింపుల్ చిట్కాలతో మెరిపించండి!
బాత్రూమ్ టైల్స్‌పై మొండి మరకలా? ఈ సింపుల్ చిట్కాలతో మెరిపించండి!
రూ.5 ట్రాక్టర్ ఫొటో నోటు మీ దగ్గర ఉందా..? మీరే లక్షాధికారి..
రూ.5 ట్రాక్టర్ ఫొటో నోటు మీ దగ్గర ఉందా..? మీరే లక్షాధికారి..
సెప్టెంబర్‌లో పుట్టారా? మీలో ఈ గుణాలు కన్ఫర్మ్ గా ఉంటాయట!
సెప్టెంబర్‌లో పుట్టారా? మీలో ఈ గుణాలు కన్ఫర్మ్ గా ఉంటాయట!