AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: షూటింగ్ పూర్తయ్యి నాలుగు నెలలైనా రెమ్యునరేషన్ ఇవ్వలేదు.. ఆ నిర్మాతపై టాలీవుడ్ హీరోయిన్ తీవ్ర ఆగ్రహం

హీరోలతో పోల్చితే సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల రెమ్యునరేషన్లు చాలా తక్కువే. అయితే కొంత మంది నిర్మాతలు హీరోయిన్లతో పని చేయించుకుని పారితోషికాలు ఎగ్గోట్టుతున్నారని ఓ టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

Tollywood: షూటింగ్ పూర్తయ్యి నాలుగు నెలలైనా రెమ్యునరేషన్ ఇవ్వలేదు.. ఆ నిర్మాతపై టాలీవుడ్ హీరోయిన్ తీవ్ర ఆగ్రహం
Seerat Kapoor
Basha Shek
|

Updated on: Mar 10, 2026 | 4:56 PM

Share

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారనే ప్రచారం ఉంది. ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్ పై ఇప్పటికే చాలా మంది నటీమణులు తమకు ఎదురైన చేదు అనుభవాలను బయట పెట్టారు. ఇప్పుడు కొన్ని నిర్మాణ సంస్థలు హీరోయిన్లో పని చేయించుకుని పారితోషికాలు ఇవ్వడం లేదని తెలుస్తోంది. తాజాగా ఓ టాలీవుడ్ హీరోయిన్ కూడా ఇలానే నిర్మాణ సంస్థ తన రెమ్యునరేషన్ ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెడుతోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. రన్ రాజా రన్ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది సీరత్ కపూర్. ఆ తర్వాత టైగర్, ఒక్క క్షణం, రాజుగారి గది 2, కొలంబస, టచ్ చేసి చూడు, కృష్ణ అండ్ హిజ్ లీలా, మా వింత గాధ వినుమా, భామా కాలాపం 2, మనమే, ఉషా పరిణయం తదితర సినిమాల్లో హీరోయిన్ గా, సహాయక నటిగా మెప్పించింది. అయితే తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. షూటింగ్ పూర్తయి నాలుగు నెలలు అవుతున్న తనకు రావాల్సిన పారితోషికం ఇవ్వట్లేదంటూ తన పోస్టులో రాసుకొచ్చింది.

‘ సినిమా షూటింగ్ పూర్తయ్యి నాలుగు నెలలు గడిచినా సరే సంబంధిత ప్రొడక్షన్ టీమ్ నా రెమ్యునరేషన్ ఇవ్వలేదు. నా కుటుంబంలో అత్యవసర వైద్య పరిస్థితి ఉందని చెప్పినా స్పందించడం లేదు. చాలా ఓపిక, సహనంతో ఎదురుచూస్తున్నా. నా టీమ్‌కి ఇవ్వాల్సిన పారితోషికం ఇంకా పెండింగ్‌లోనే ఉంది. టీమ్‌కు ఇచ్చిన చెక్కు కూడా బౌన్స్ అయింది. దీన్ని ఆలస్యం చేయకుండా వెంటనే పరిష్కరించండి. ఇలాంటి విషయాల్లో కాస్త బాధ్యతతో వ్యవహరించండి. లేకపోతే తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది’ అని సీరత్ కపూర్ సున్నితంగా వార్నింగ్ ఇచ్చింది. అయితే ఆమెను ఇబ్బంది పెడుతున్న ఆ నిర్మాణ సంస్థ, నిర్మాత పేర్లను కానీ సీరత్ కపూర్ బయటపెట్టలేదు. ప్రస్తుతం ఈ పోస్ట్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది.

ఇవి కూడా చదవండి

సీరత్ కపూర్ పోస్ట్..

సీరత్ కపూర్  ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఆగస్టు 31లోగా ITR ఎవరు దాఖలు చేయాలి? వారికి అక్టోబర్‌ 31 గడువు..!
ఆగస్టు 31లోగా ITR ఎవరు దాఖలు చేయాలి? వారికి అక్టోబర్‌ 31 గడువు..!
బోనాల స్పెషల్: నోరూరించే బోటీ ఫ్రై..ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది!
బోనాల స్పెషల్: నోరూరించే బోటీ ఫ్రై..ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది!
మత్తోన్మాదులు.. మెడికోను 3 సార్లు కారుతో ఢీకొట్టారు..
మత్తోన్మాదులు.. మెడికోను 3 సార్లు కారుతో ఢీకొట్టారు..
కామిక ఏకాదశికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..? ఈరోజు విష్ణువును ఇలా
కామిక ఏకాదశికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..? ఈరోజు విష్ణువును ఇలా
అరెరె ఇన్నాళ్లు ఇంత పొరపాటు చేశామా.. వానాకాలంలో కొబ్బరి నీళ్లు..
అరెరె ఇన్నాళ్లు ఇంత పొరపాటు చేశామా.. వానాకాలంలో కొబ్బరి నీళ్లు..
భర్తను చంపేందుకు భార్య మైండ్‌బ్లోయింగ్ స్కెచ్..!
భర్తను చంపేందుకు భార్య మైండ్‌బ్లోయింగ్ స్కెచ్..!
లంకతో ప్రాక్టీస్ మ్యాచ్.. పిచ్ చూస్తే పిచ్చెక్కిందిగాా..
లంకతో ప్రాక్టీస్ మ్యాచ్.. పిచ్ చూస్తే పిచ్చెక్కిందిగాా..
1953లో తాత నడిపిన ట్రాక్టర్‌‌ను మళ్లీ కొన్న మనవడు!
1953లో తాత నడిపిన ట్రాక్టర్‌‌ను మళ్లీ కొన్న మనవడు!
కొరియన్ కనకరాజు సినిమా రివ్యూ.. వరుణ్ తేజ్ హిట్ కొట్టాడా?
కొరియన్ కనకరాజు సినిమా రివ్యూ.. వరుణ్ తేజ్ హిట్ కొట్టాడా?
త్రిఫల-ఖర్జూరం లడ్డూ.. రోజూ ఒక్కటి తిన్నారంటే ఖతర్నాక్ బెనిఫిట్స్
త్రిఫల-ఖర్జూరం లడ్డూ.. రోజూ ఒక్కటి తిన్నారంటే ఖతర్నాక్ బెనిఫిట్స్