AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్ థ్రిల్లర్.. సబ్ స్క్రిప్షన్ లేకపోయినా చూడొచ్చు

థియేటర్లు అయినా, ఓటీటీలు అయినా ప్రజెంట్ హారర్ థ్రిల్లర్ సినిమాలదే హవా. ముఖ్యంగా ఓటీటీలో ఈ జానర్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అలా మూవీ లవర్స్ ను భయపెట్టడానికి లేటెస్ట్ గా ఒక తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చింది.

OTT Movie: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్ థ్రిల్లర్.. సబ్ స్క్రిప్షన్ లేకపోయినా చూడొచ్చు
OTT Movie
Basha Shek
|

Updated on: Mar 10, 2026 | 9:18 PM

Share

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీలోకి కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. అందులో రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, విశ్వక్ సేన్ ‘ఫంకీ’, ప్రియాంక మోహన్ ‘మేడిన్ కొరియా’ తదితర చిత్రాలు కాస్త ఆసక్తి కలిగిస్తున్నాయి. అలాగే జుటోపియా 2, ద తాజ్ స్టోరీ, పూకీ చిత్రాలు కూడా మూవీ లవర్స్ కు మంచి కాలక్షేపమే అని చెప్పవచ్చు. వీటి సంగతి అలా ఉంచితే ఇప్పుడో తెలుగు సినిమా.. నేరుగా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే.. ఎలాంటి ఓటీటీ సబ్ స్క్రిప్షన్ లేకపోయినా ఈ హరర్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌ మూవీని చూడవచ్చు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఆత్మల నేపథ్యంలో తిరిగే కథ ఇది. ఓ ఈఎన్‌టీ డాక్టర్ భూషణ్, తన రీసెర్చ్ నిరూపించుకోవడం కోసం ఆత్మల మీద డాక్యుమెంటరీ తీయాలనుకుంటాడు. ఇందుకోసం మౌళి అనే ఓ యువ దర్శకుడిని కలుస్తాడు. తాను చెప్పిన డాక్యుమెంటరీ తీస్తే.. తర్వాత మౌళి సినిమాను తానే నిర్మిస్తానని ఆఫర్ కూడా ఇస్తాడు. దీంతో మౌళి తన ప్రియురాలు పూజ , స్నేహితుడు రవితో కలిసి పింజర్లపల్లి అనే ఓ మారుమూల గ్రామానికి వెళ్తాడు.

పింజర్లపల్లిలో అడుగు పెట్టిన మౌళి బృందానికి ఊహించని పరిస్థితులు ఎదురవుతాయి. మరి అసలు మౌళి ఆత్మల మీద డాక్యుమెంటరీ తీశాడా? లేదా? చివరకు ఆ ఊరిలో ఏం జరిగింది? అన్న ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే రవం సినిమా చూడాల్సిందే. శ్రీరామ్ మన్నార్ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రశాంత్, అనుశ్రీ అనే కొత్తవాళ్లు హీరోహీరోయిన్లుగా నటించారు. తారక్ ఫిలిం హౌస్ బ్యానర్ పై తారక రామారావు ఈ సినిమాను నిర్మించారు. అలాగే ప్రముఖ నటి కరాటే కళ్యాణి ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. మంచి హారర్ థ్రిల్లర సినిమాను చూడాలనుకునేవారికి రవం ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

ఆహాలో స్ట్రీమింగ్.. సబ్ స్క్రిప్షన్ లేకుండానే చూడొచ్చు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఆగస్టు 31లోగా ITR ఎవరు దాఖలు చేయాలి? వారికి అక్టోబర్‌ 31 గడువు..!
ఆగస్టు 31లోగా ITR ఎవరు దాఖలు చేయాలి? వారికి అక్టోబర్‌ 31 గడువు..!
బోనాల స్పెషల్: నోరూరించే బోటీ ఫ్రై..ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది!
బోనాల స్పెషల్: నోరూరించే బోటీ ఫ్రై..ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది!
మత్తోన్మాదులు.. మెడికోను 3 సార్లు కారుతో ఢీకొట్టారు..
మత్తోన్మాదులు.. మెడికోను 3 సార్లు కారుతో ఢీకొట్టారు..
కామిక ఏకాదశికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..? ఈరోజు విష్ణువును ఇలా
కామిక ఏకాదశికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..? ఈరోజు విష్ణువును ఇలా
అరెరె ఇన్నాళ్లు ఇంత పొరపాటు చేశామా.. వానాకాలంలో కొబ్బరి నీళ్లు..
అరెరె ఇన్నాళ్లు ఇంత పొరపాటు చేశామా.. వానాకాలంలో కొబ్బరి నీళ్లు..
భర్తను చంపేందుకు భార్య మైండ్‌బ్లోయింగ్ స్కెచ్..!
భర్తను చంపేందుకు భార్య మైండ్‌బ్లోయింగ్ స్కెచ్..!
లంకతో ప్రాక్టీస్ మ్యాచ్.. పిచ్ చూస్తే పిచ్చెక్కిందిగాా..
లంకతో ప్రాక్టీస్ మ్యాచ్.. పిచ్ చూస్తే పిచ్చెక్కిందిగాా..
1953లో తాత నడిపిన ట్రాక్టర్‌‌ను మళ్లీ కొన్న మనవడు!
1953లో తాత నడిపిన ట్రాక్టర్‌‌ను మళ్లీ కొన్న మనవడు!
కొరియన్ కనకరాజు సినిమా రివ్యూ.. వరుణ్ తేజ్ హిట్ కొట్టాడా?
కొరియన్ కనకరాజు సినిమా రివ్యూ.. వరుణ్ తేజ్ హిట్ కొట్టాడా?
త్రిఫల-ఖర్జూరం లడ్డూ.. రోజూ ఒక్కటి తిన్నారంటే ఖతర్నాక్ బెనిఫిట్స్
త్రిఫల-ఖర్జూరం లడ్డూ.. రోజూ ఒక్కటి తిన్నారంటే ఖతర్నాక్ బెనిఫిట్స్