వినూత్న వేడుక.. పెంపుడు కుక్కకు రాఖీ కట్టి ప్రేమానుబంధాన్ని చాటిన జంతు ప్రేమికుడు!
అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి వేడుకలు దేశమంతా ఘనంగా జరుగుతున్నాయి. తోబుట్టువులు ఎక్కడున్నా దగ్గరకు చేర్చి మమతానురాగాలు పంచే ఈ పర్వదినం సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ జంతు ప్రేమికుడు తన ఆప్యాయతను చాటాడు. ఆ కుటుంబం అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పెంపుడు కుక్కకు రాఖీ కట్టి తన అనురాగాన్ని పంచుకున్నాడు.

అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి వేడుకలు దేశమంతా ఘనంగా జరుగుతున్నాయి. తోబుట్టువులు ఎక్కడున్నా దగ్గరకు చేర్చి మమతానురాగాలు పంచే ఈ పర్వదినం సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ జంతు ప్రేమికుడు తన ఆప్యాయతను చాటాడు. వివరాల్లోకి వెళ్తే..జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ఈ వెరైటీ వేడుకలు జరిగాయి. వేణు సింగ్ అనే జంతు ప్రేమికుడు గత కొన్నేళ్లుగా ఒక శునకాన్ని పెంచుకుంటున్నారు. ఆ శునకానికి బన్ను అనే పేరు పెట్టి దాన్ని వారి ఇంట్లో సభ్యుడుగా అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు.
అయితే పెంపుడు కుక్క కూడా తమకు తోబుట్టులాంటిదే అని భావించిన యజమాని నేపాలి వేణుసింగ్ దానికి స్నానం చేయించి, తిలకం దిద్ది, రాఖీ కట్టి, అక్షింతలు వేసి, మంగళ హారతితో ఆశీర్వదించారు. పెంపుడు శునకంపై తనకున్న అనుబంధాన్ని చాటుకున్నాడు. తోబుట్టు లా చూసుకుంటున్న పెంపుడు కుక్కకు రాఖీ కట్టే ఆప్యాయతను చాటిన ఆ జంతు ప్రేమికుడిని ప్రతి ఒక్కరూ అభినందించారు.
వీడియో చూడండి..
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
