తెలంగాణకు మరో గుడ్‌న్యూస్.. ఎన్టీపీసీ ప్రతిపాదనకు రేవంత్ సర్కార్ సుముఖత..!
తెలంగాణకు ఇదో శుభకర దినంగా చెప్పాలి. పునరుత్పాదక ఇంధన రంగంపై దృష్టి సారించిన జాతీయ శక్తి రంగంలో అగ్రగామి ఎన్టీపీసీ.. రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు సన్నద్దమైంది. సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గురుదీప్ సింగ్ నాయకత్వంలోని ప్రతినిధుల బృందం.. జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆయన నివాసంలో సమావేశమయ్యారు.

తెలంగాణకు ఇదో శుభకర దినంగా చెప్పాలి. పునరుత్పాదక ఇంధన రంగంపై దృష్టి సారించిన జాతీయ శక్తి రంగంలో అగ్రగామి ఎన్టీపీసీ.. రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు సన్నద్దమైంది. సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గురుదీప్ సింగ్ నాయకత్వంలోని ప్రతినిధుల బృందం.. జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. తమ భవిష్యత్ ప్రణాళికలను వివరించింది. రాష్ట్రంలో సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులపై దాదాపు రూ.80,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ఎన్టీపీసీ వెల్లడించింది. ముఖ్యంగా ఫ్లోటింగ్ సోలార్.. నీటి మీద తేలియాడే సౌర విద్యుత్ ప్లాంట్ల ద్వారా తెలంగాణలో సుమారు 6,700 మెగావాట్ల ఉత్పత్తి సాధ్యమని సంస్థ ప్రతినిధులు వివరించారు.
ఈ ప్రాజెక్టులు రాష్ట్రానికి శక్తి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా.. పర్యావరణ పరిరక్షణతో ఉపాధి అవకాశాల సృష్టించడం.. భూమి వినియోగం లేకుండా విద్యుత్ ఉత్పత్తి వంటి అనేక లాభాలను అందిస్తాయని ముఖ్యమంత్రికి ఎన్టీపీసీ ప్రతినిధులు వివరించారు. రాష్ట్రంలోని పెద్ద రిజర్వాయర్లు, జలాశయాలు ఈ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టులకు అనువైన వనరులుగా మారనున్నాయని నిపుణులు భావిస్తున్నారు.
పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చడంలో థర్మల్, జల విద్యుత్ ఉత్పత్తిపై ఆధారపడుతున్న తెలంగాణకు, ఈ పునరుత్పాదక ఇంధన పెట్టుబడులు కీలక మలుపు అవుతాయని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్టీపీసీ ప్రతిపాదనకు ప్రభుత్వం అన్ని విధాలా మద్దతు ఇస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




