AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అక్కా నువ్వు సూపర్.. చిరుతకు రాఖీ కట్టిన మహిళ.. వీడియో వైరల్

సోషల్ మీడియాలో రాఖీ పండగకి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఒక గ్రామీణ మహిళ చిరుతపులికి రాఖీ కడుతున్నట్లు కనిపించింది. అంతేకాదు ఆమె సింబాలిక్ గా, హృదయ విదారక సంజ్ఞతో ఇక నుంచి చిరుతపులి నా సోదరుడు.. దానిని రక్షించమని ప్రజలను కోరుతుంది. ఈ సాహసోపేతమైన, భావోద్వేగ క్షణానికి నెటిజన్లు ఆ మహిళను ప్రశంసించారు. ఈ ఘటన రాజస్తాన్ లో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

Viral Video: అక్కా నువ్వు సూపర్.. చిరుతకు రాఖీ కట్టిన మహిళ.. వీడియో వైరల్
Viral Video
Surya Kala
|

Updated on: Aug 11, 2025 | 2:45 PM

Share

రాజస్థాన్ నుంచి వచ్చిన ఒక ప్రత్యేకమైన, షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిలో ఒక గ్రామీణ మహిళ చిరుతపులికి రాఖీ కడుతున్నట్లు కనిపిస్తుంది. తర్వాత ఆమె చిరుతపులిని రక్షించమని ప్రజలను కోరుతుంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోపై.. ఆ మహిళ సాహసోపేత చర్యపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ వైరల్ క్లిప్‌లో కనిపించే వన్యప్రాణుల సమతుల్యత, చిరుతపులి బలహీన స్థితిపై కొందరు ఆందోళన వ్యక్తం చేశారు.

వీడియోలో ఆ మహిళ తన ఇంటి సమీపంలోని పొలం దగ్గర కూర్చుని ఉండటం, ఆమె ముందు ఒక చిరుతపులి ప్రశాంతంగా కూర్చుని ఉండటం చూడవచ్చు. ఆ మహిళ దాని పాదాన్ని చాలా జాగ్రత్తగా పట్టుకుని, రాఖీ కట్టి, దానికి స్వీట్లు తినిపించడానికి ప్రయత్నిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే చిరుతపులి ఇలా రాఖీ కడుతున్న సమయంలో పూర్తిగా ప్రశాంతంగా ఉంది.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి:

సమాచారం ప్రకారం ఈ సంఘటన రాజస్థాన్‌లోని ఒక గ్రామంలో జరిగింది. అక్కడ గత కొన్ని రోజులుగా చిరుతపులి తిరుగుతోంది. ఈ చిరుతపులి మనుషులకు భయపడదని, గ్రామంలో చాలాసార్లు సంచరించడం కనిపించిందని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే అటవీ శాఖ చిరుత పులి ప్రమాదకరమైనదిగా అభివర్ణించింది. అడవి జంతువుల నుంచి దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. రాఖీ కట్టే దృశ్యం భావోద్వేగంగా అనిపించినప్పటికీ.. ఇది చాలా ప్రమాదకరమని అటవీ శాఖ అధికారులు తెలిపారు. చిరుతపులులు వంటి వన్యప్రాణుల చర్యలను ఎవరూ ఊహించలేరు. ఎప్పుడైనా దాడి చేయగలవు. ప్రస్తుతం, ఆ ప్రాంతంలో నిఘా పెంచి.. చిరుతను సురక్షిత ప్రాంతానికి తరలించడానికి అటవీ శాఖ సన్నాహాలు చేస్తోంది.

ఈ వీడియోలో కనిపిస్తున్న చిరుతపులి బలహీన స్థితిపై చాలా మంది నెటిజన్లు ప్రశ్నలు లేవనెత్తారు. కొందరు చిరుతకి ఆమె ఏమైనా మత్తుమందు ఇచ్చిందా..? లేదా అది అనారోగ్యంతో ఉందా అని అడుగుతున్నారు. జంతువుల పట్ల ఇంత ప్రేమను చూడటం మనసుకి ఆనందంగా ఉంది. కానీ అడవి జంతువులకు ముఖ్యంగా మాంసాహార జంతువులకు దగ్గరగా ఉండటం ప్రేమనా అని ప్రశ్నిస్తున్నారు. అడవి జంతువులను పట్ల నిజమైన ప్రేమ అవి అడవిలో స్వేచ్ఛగా ఉండడమే బాగుటుందని ఒకరు కామెంట్ చేశారు. మరొక యూజర్ “ఆ చిరుతపులికి పరిసరాల గురించి పూర్తిగా తెలిసినట్లు లేదు.. మత్తుమందులో ఉన్నట్లు ఉందని కామెంట్ చేశారు.

మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ