AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Selva Brindha: 22 నెలల్లో 300 లీటర్ల చనుబాలు దానం.. ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ క్రియేట్‌ చేసిన సూపర్‌ మామ్‌!

తల్లి మనస్సు ఎంత గొప్పది అంటే.. ఆకలంటూ వచ్చిన వాళ్లు తన బిడ్డ కాకపోయినా.. ఆ తల్లి వాళ్ల కడుపునిండా భోజనం పెట్టి వాళ్లలో తమ బిడ్డలను చూసుకుంటుంది. ఇక్కడ ఒక తల్లి కూడా అచ్చం అలానే తన చనుబాలతో ఎందరో చిన్నారులకు ప్రాణం పోసింది. 22 నెలల్లో సుమారు 300 లీటర్ల తల్లిపాలు దానం చేసి.. ఎందరో నవజాత శిశువుల కడుపు నింపి అమ్మతనానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. ఇంతకు ఆమె ఎవరో తెలుసుకుందాం పదండి.

Selva Brindha: 22 నెలల్లో 300 లీటర్ల చనుబాలు దానం.. ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ క్రియేట్‌ చేసిన సూపర్‌ మామ్‌!
Super Mother
Anand T
|

Updated on: Aug 10, 2025 | 10:56 PM

Share

తల్లి మనస్సు ఎంత గొప్పది అంటే.. ఆకలంటూ వచ్చిన వాళ్లు తన బిడ్డ కాకపోయినా.. ఆ తల్లి వాళ్ల కడుపునిండా భోజనం పెట్టి వాళ్లలో తమ బిడ్డలను చూసుకుంటుంది. ఇక్కడ ఇద్దరు పిల్లల తల్లైన 33 ఏళ్ల సెల్వ బ్రిందా అనే మహిళ కూడా అచ్చం అలానే తన చనుబాలతో ఎందరో శిశువుల ఆకలి తీర్చింది. సెల్వది తమిళనాడులోని తిరుచిరాపల్లి చెందిన సెల్వ బ్రిందా అనే మహిళ 22 నెలల్లో సుమారు 300 లీటర్ల తల్లిపాలు దానం చేసి ఆసియాలోనే ఎక్కువ మొత్తంలో తల్లిపాలు దానం చేసిన తొలి మహిళగా ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లోనూ చోటు దక్కించుకుంది. ఆమె ఇటీవలే ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్స్‌ కూడా అందుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని తిరుచిరాపల్లికి చెందిన సెల్వ బ్రిందాకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈమెకు ప్రస్తుతం ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఇమె మొదటి బిడ్డకు జన్మనిచ్చినప్పటి కంటే.. రెండో బిడ్డకు జన్మనిచ్చిన సదర్భంలో ఆమెలో చనుబాల ఉత్పత్తి పెరిగింది. ఆదే సమయంతో తన రెండో కూతురు అనారోగ్యం బారిన పడడంతో ఆమె హాస్పిటల్‌లో చేరాల్సి వచ్చింది. అయితే పాపకు జాండీస్‌ కారణంగా నేరుగా తల్లి పాలు ఇవ్వకూడదని వైద్యులు సూచించారు. దీంతో ఆమె బ్రెస్ట్‌ పంప్‌ ద్వారా పాలను తీసి పాపకు పట్టేది. అయితే పాపకు సరిపోయే కన్నా ఆమెకు ఎక్కువ పాటు ఉత్పత్తి కావడంతో.. ఆ పాలను అక్కడ అనారోగ్యంతో ఉన్న లేదా తల్లి పాలు కావాల్సిన ఇతర శిశువులకు ఆమె ఇచ్చేదని కొన్ని నివేదికల ద్వారా తెలుస్తోంది. అయితే అప్పుడే ఆమె తన పాలను ఇలా అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులకు దానం చేయాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని ఆమె భర్తకు తెలియజేసింది.

దీంతో వైద్యుల సలహాల మేరకు అప్పటి నుంచి తల్లి పాలను దానం చేయడం స్టార్ట్‌ చేసింది. ఇలా దాదాపు 22 నెలల పాటు సుమారు 300.17 లీటర్ల తల్లిపాలను ప్రభుత్వ ఆస్పత్రులలో అనారోగ్యంతో బాధపడుతున్న శిశులకు అందించి వారి ఆకలి తీర్చడంతో పాటు ప్రాణాలు కాపాడింది. ఆమె అంకితభావం, నిస్వార్థతను గుర్తించిన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ , ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఆమె పేరును వాటిలో నమోదు చేశాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.