AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..!

Festivals in March: ఈ ఏడాది మార్చి నెలలో చాలా ముఖ్యమైన పండగలు వస్తున్నాయి. మార్చి తొలివారంలోనే హోలీ పండగ వస్తోంది. ఆ తర్వాత మార్చి 8వ తేదీ రంగ పంచమి, 10వ తేదీ శీతల సప్తమి, 11వ తేదీ శీతల అష్టమి కూడా నిర్వహిస్తారు. మార్చి 19వ తేదీ ఉగాది పండుగ రానుంది. ఇది తెలుగు వారికి నూతన సంవత్సరం. కొత్త పంచాంగం మొదలయ్యే రోజు. ఇలా మార్చి నెలలో ముఖ్యమైన పండగలు ఉన్నాయి.

హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..!
Festivals In March
Rajashekher G
|

Updated on: Feb 28, 2026 | 6:30 PM

Share

ఈ ఏడాది మార్చి నెలలో చాలా ముఖ్యమైన పండగలు వస్తున్నాయి. నెల ప్రారంభంలోనే మార్చి 3 లేదా మార్చి 4వ తేదీ హోలీ పండుగను ఘనంగా జరుపుకోనున్నారు. హోలీకి ముందు రోజు హోలీకా దహనం, కామ దహనం నిర్వహిస్తారు. ఈసారి మూడో తేదీ చంద్రగ్రహణం కూడా రానుంది. మార్చి 4వ తేదీ హోలీ పండుగ జరుపుకోనున్నారు. కొన్ని ప్రాంతాల్లో మార్చి 2 లేదా 3 తేదీల్లో జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇక ఆ తర్వాత కూడా ఈ నెల గురువారం బాయ్ దూజ్‌ నిర్వహిస్తారు. ఇక మార్చి 8వ తేదీ రంగ పంచమి, 10వ తేదీ శీతల సప్తమి, 11వ తేదీ శీతల అష్టమి కూడా నిర్వహిస్తారు. మార్చి 19వ తేదీ ఉగాది పండుగ రానుంది. ఇది తెలుగు వారికి నూతన సంవత్సరం. కొత్త పంచాంగం మొదలయ్యే రోజు. ఈ నేపథ్యంలో దక్షిణాదిలో ఉగాది పండుగ విశిష్టంగా జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పచ్చడి ఈ పండగకు ప్రత్యేకం.

ఈ రోజు ప్రతి ఒక్కరూ తమ రాశులను బట్టి జాతకం తెలుసుకుంటారు. ముఖ్యంగా, ఈ సంవత్సరం ఆదాయం, వ్యయాలు ఎలా ఉంటాయో, జీవితంలో ముఖ్యమైన విషయాలు ఎలా కుదిరుతాయో పంచాంగం ద్వారా రాశిఫలాలను పరిశీలిస్తారు.

ఉత్తరాదిలో కూడా ఈ వేడుక ఉంది. ఉగాది వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా పిలుస్తారు. ఆ తర్వాత మార్చు 26వ తేదీ శ్రీరామనవమి నిర్వహిస్తారు. ఈరోజు సీతారాముల కళ్యాణం వేడుకగా జరుపుకుంటారు. ప్రముఖ ఆలయాల్లో ఈ వేడుకగా వైభవంగా నిర్వహిస్తారు. శ్రీరామ నవమి గురువారం రానుంది.

ముస్లింల నిర్వహించే రంజాన్ వేడుకలు కూడా మార్చి 20వ తేదీ శుక్రవారం రానుంది. ఆ రోజు ముస్లిం సోదరులు రంజాన్ నెల జరుపుకుంటారు. బంధుమిత్రులతో కలిసి వేడుకగా ఈ పండుగ నిర్వహిస్తారు.

Follow Us
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు
అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమిదే
అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమిదే
LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
కోలీవుడ్ టు టాలీవుడ్.. సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా
కోలీవుడ్ టు టాలీవుడ్.. సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా
భారత రూపాయి విలువ: రూ.100 ఇజ్రాయెల్- ఇరాన్‌కి వెళితే ఎంత విలువ చే
భారత రూపాయి విలువ: రూ.100 ఇజ్రాయెల్- ఇరాన్‌కి వెళితే ఎంత విలువ చే
వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో హీరోయిన్స్‌
వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో హీరోయిన్స్‌
గ్రహణం రోజు కూడా తెరిచి ఉండే ఆలయాలు ఇవే.. వీటి ప్రత్యేకత..
గ్రహణం రోజు కూడా తెరిచి ఉండే ఆలయాలు ఇవే.. వీటి ప్రత్యేకత..
రింకు తర్వాత మరో స్టార్ ప్లేయర్ ఔట్… మిగిలిన మ్యాచ్‌లకు డౌట్?
రింకు తర్వాత మరో స్టార్ ప్లేయర్ ఔట్… మిగిలిన మ్యాచ్‌లకు డౌట్?