Holi: హోలాష్టక్ కాలంలో మర్చిపోయి కూడా ఈ తప్పులు చేయొద్దు..! ఏం చేయాలో తెలుసా..?
Holi Festival Guide: హోలీ సందర్భంలోనే చంద్రగ్రహణం కూడా ఏర్పడటంతో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జ్యోతిష్యులు సూచిస్తున్నారు. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 3 వరకు ఉన్న ఎనిమిది రోజులను హోలాష్టకంగా పరిగణిస్తారు. ఈ కాలంలో శుభకార్యాలు నివారించడం మంచిదని భావిస్తారు. గొడవలు, వాగ్వాదాలు దూరంగా ఉంచాలి. కొత్త పనులు ప్రారంభించడం, ఇల్లు లేదా బంగారం కొనడం, వ్యాపారాలు మొదలుపెట్టడం వంటి కార్యక్రమాలు వాయిదా వేసుకోవడం మంచిదని సూచిస్తారు.

దేశ వ్యాప్తంగా హోలీ సంబరాలు ఘనంగా జరుపుకునేందుకు ప్రజలంతా సిద్ధమవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే హోలీ వేడుకలు ప్రారంభమయ్యాయి. అయితే, చంద్రగ్రహణం కూడా పండగ సందర్భంలోనే రావడంతో కొన్ని జాగ్రత్తలు అవసరమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. హోలీ రోజైన మార్చి 3న చంద్రగ్రహణం ఉండటంతో ప్రజల్లో కొంత సందిగ్ధత నెలకొంది. జ్యోతిష్య సూచనల ప్రకారం.. హోలీని మార్చి 4న జరుపుకోవాలని సూచిస్తున్నారు. కానీ, పౌర్ణమి సందర్భంగా జరిగే కాముడి దహనం మాత్రం యథావిధిగా మార్చి 2న నిర్వహించాలంటున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో మార్చి 2నే హోలీ పండగను జరుపుకోవాలని నిర్ణయించుకుంటున్నారు.
వీటికి దూరంగా ఉండండి..
మార్చి 3న మధ్యాహ్నం 3:20 గంటల నుంచి సాయంత్రం 6:10 గంటల వరకు గ్రహణం ఉంటుంది. ఈ సమయంలో సూతక కాలంగా భావించి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. గ్రహణ సమయంలో మంత్ర జపం, దేవుని స్తోత్రాల పఠనం చేయడం శ్రేయస్కరం. అయితే తినడం, బయటకు తిరగడం, చంద్రకిరణాలు నేరుగా పడేలా ఉండడం వంటివి నివారించాలని సూచిస్తున్నారు. గ్రహణం ముగిసిన తర్వాత శుద్ధి స్నానం (విడుపు స్నానం) చేసి, గ్రహణ శాంతి దానాలు, పరిహారాలు చేయడం ఆనవాయితీ.
అలాగే ఫిబ్రవరి 24 నుంచి మార్చి 3 వరకు ఉన్న ఎనిమిది రోజులను హోలాష్టకంగా పరిగణిస్తారు. ఈ కాలంలో శుభకార్యాలు నివారించడం మంచిదని భావిస్తారు. గొడవలు, వాగ్వాదాలు దూరంగా ఉంచాలి. కొత్త పనులు ప్రారంభించడం, ఇల్లు లేదా బంగారం కొనడం, వ్యాపారాలు మొదలుపెట్టడం వంటి కార్యక్రమాలు వాయిదా వేసుకోవడం మంచిదని సూచిస్తారు.
ఈ తప్పులు అసలు చేయొద్దు..
- హోలాష్టక సమయంలో కొన్ని సంప్రదాయ నియమాలు పాటించాలనే నమ్మకం గ్రామీణ ప్రాంతాల్లో ఉంది. ఉదాహరణకు..
- జుట్టు విరబోసుకుని బయటకు వెళ్లకూడదు
- గోర్లు కత్తిరించి బయట పడేయకూడదు
- ఇతరుల దుస్తులు ధరించకూడదు, తమ దుస్తులు ఇతరులకు ఇవ్వకూడదు
- చౌరస్తాల్లో పడిన నిమ్మకాయలు, నాణేలు లేదా ఇతర వస్తువులు తీసుకుని ఇంటికి తీసుకురాకూడదు. ఇవన్నీ చెడు ప్రభావం చూపుతాయని నమ్ముతారు.
- అయితే, ఈ కాలంలో వీలైనంత వరకు శివుడు, విష్ణువు, హనుమాన్ లేదా ఇతర దేవీదేవత ఆరాధన చేయడం, ప్రతిరోజూ నెయ్యితో దీపారాధన చేయడం శ్రేయస్కరంగా భావిస్తారు.
- ఇవన్నీ ఆధ్యాత్మిక విశ్వాసాల ఆధారంగా చెప్పబడిన సూచనలు. భక్తి, శ్రద్ధలతో పాటించేవారు ఈ నియమాలను అనుసరించవచ్చు. అదే సమయంలో శాస్త్రీయంగా గ్రహణం ఒక సహజ ఖగోళ ఘటన మాత్రమే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
(Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్య శాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)
