AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aja Ekadashi: ఈ ఏడాది అజ ఏకాదశి ఎప్పుడు? పూజా సమయం, వేటిని దానం చేస్తే విష్ణు అనుగ్రహం కలుగుతుందంటే

ప్రతి నెల కృష్ణ పక్షం, శుక్ల పక్షంలోని ఏకాదశి తిథి రోజున శ్రీ మహా విష్ణువు అనుగ్రహం కోసం ఉపవాసం పాటిస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రావణ పద మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశి రోజున అజ ఏకాదశిగా జరుపుకుంటారు. ఈ రోజున శ్రీ విష్ణువును పూజించడం, ఉపవాసం, రాత్రి జాగరణకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

Aja Ekadashi: ఈ ఏడాది అజ ఏకాదశి ఎప్పుడు? పూజా సమయం, వేటిని దానం చేస్తే విష్ణు అనుగ్రహం కలుగుతుందంటే
Aja Ekadashi
Surya Kala
|

Updated on: Aug 11, 2025 | 7:50 AM

Share

శ్రీ మహా విష్ణువు అనుగ్రహం పొందడానికి ఏకాదశి తిథి శుభప్రదంగా పరిగణించబడుతుంది. పంచాంగం ప్రకారం శ్రావణ మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశిని అజ ఏకాదశి అంటారు. ఇది శ్రీ మహా విష్ణువుకు అంకితం చేయబడిన ముఖ్యమైన ఉపవాసం. శ్రీ మహా విష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి, గత జన్మల పాపాలను వదిలించుకోవడానికి అజ ఏకాదశి ఉపవాసం ఆచరిస్తారు. ఈ రోజున ఉపవాసం ఉండటం వల్ల ఒక వ్యక్తి సకల పాపాల నుంచి విముక్తి పొందుతాడని జీవితంలో ఆనందం, శ్రేయస్సు వస్తుందని మత విశ్వాసం.

అజ ఏకాదశి ఉపవాసం ఎప్పుడంటే పంచాంగం ప్రకారం శ్రావణ మాసం కృష్ణ పక్ష ఏకాదశి తిథి ఆగస్టు 18న సాయంత్రం 5:22 గంటలకు ప్రారంభమవుతుంది. అదే సమయంలో ఈ తిథి మరుసటి రోజు ఆగస్టు 19న మధ్యాహ్నం 3:32 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో ఆగస్టు 19న అజ ఏకాదశి ఉపవాసం పాటిస్తారు.

అజ ఏకాదశి ఉపవాసం ఎప్పుడు విరమించాలంటే ద్వాదశి తిథి నాడు ఏకాదశి ఉపవాసం ఎల్లప్పుడూ విరమిస్తారు. కనుక ఆగస్టు 20న ఉదయం 5:53 నుంచి ఉదయం 08:29 వరకు అజ ఏకాదశి ఉపవాసం విరమించడానికి శుభ సమయం. ఈ శుభ సమయంలో ఎప్పుడైనా ఉపవాసం విరమించవచ్చు.

ఇవి కూడా చదవండి

ఆజా ఏకాదశిని ఆచరించడం వల్ల ఏమి జరుగుతుంది? హిందూ మత విశ్వాసాల ప్రకారం అజ ఏకాదశి శుభ సందర్భంగా శ్రీ మహా విష్ణువు , లక్ష్మీ దేవిని పూజించడం ఆచారం. ఈ రోజున లక్ష్మీ నారాయణుడిని పూజించడం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాల నుంచి విముక్తి లభిస్తుందని, మరణానంతరం వైకుంఠాన్ని పొందుతారని నమ్ముతారు. అయితే అజ ఏకాదశి పూజ సమయంలో వ్రత కథను తప్పని సరిగా పఠించాలానే నియమం ఉంది. లేదంటే ఆ వ్యక్తికి శుభ ఫలితాలు లభించవు.

ఆజా ఏకాదశి నాడు ఏమి దానం చేయాలంటే ఏకాదశి నాడు దానం చేయడం చాలా ప్రయోజనకరం. కనుక అజ ఏకాదశి రోజున పూజ చేసిన అనంతరం లక్ష్మీ నారాయణ ఆలయానికి లేదా పేద ప్రజలకు ఆహారం, డబ్బు, వస్త్రాలను దానం చేయాలి. వస్తువులను దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని, ధన లాభాలు పొందే అవకాశం ఉందని విశ్వాసం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.