Sun Astro Tips: జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే ఏమి జరుగుతుంది? లక్షణాలు, నివారణలు తెలుసుకోండి..
జ్యోతిషశాస్త్రంలో నవ గ్రహాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ నవ గ్రహాలకు సూర్యభగవానుడిని రాజుగా పరిగణిస్తారు. ఎవరి జాతకంలోనైనా సూర్యుడు బలంగా ఉంటే.. ఆరోగ్యంగా ఉంటాడు. అంతేకాదు చాలా గౌరవం లభిస్తుంది. మరోవైపు జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే.. జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ రోజు సూర్యుడు బలహీనంగా ఉంటే కనిపించే లక్షణాలు, నివారణ చర్యలు ఏమిటి అనేది తెలుసుకుందాం..

జ్యోతిషశాస్త్రం ప్రకారం సూర్యుడిని తొమ్మిది గ్రహాలకు రాజుగా పరిగణిస్తారు. మనిషి జాతకంలో సూర్యుని ఇల్లు, స్థానం అతని జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. జాతకంలో సూర్యుడు బలమైన స్థానంలో ఉంటే ఆ వ్యక్తికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని చెబుతారు. సూర్యుడు బలహీనంగా ఉన్నప్పుడు వ్యతిరేక ఫలితాలు కనిపిస్తాయి. సూర్య స్థానం బలహీనమైన స్థానంలో ఉంటే అనేక లక్షణాలు కనిపిస్తాయి. అవి వ్యక్తి జీవితంలోని వివిధ అంశాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. బలహీనమైన సూర్యుని లక్షణాలు, నివారణలు ఏమిటో తెలుసుకుందాం.
సూర్యుడు ఎప్పుడు బలహీనపడతాడు?
జ్యోతిషశాస్త్రం ప్రకారం సూర్యుడు తులారాశిలో బలహీనంగా ఉన్నప్పుడు లేదా అశుభ గ్రహంతో కలిసి ఉన్నప్పుడు జాతకంలో సూర్య స్థానం బలహీనంగా పరిగణించబడుతుంది. దీనితో పాటు సూర్యుడు 6వ, 8వ లేదా 12వ ఇంట్లో ఉండటం వల్ల కూడా బలహీనంగా ఉంటాడు. సూర్యుడు బలహీనంగా ఉన్నప్పుడు వ్యక్తి విశ్వాసం, ఆత్మగౌరవం, నిర్ణయం తీసుకునే సామర్థ్యం ప్రభావితమవుతాయి.
సూర్యుడు బలహీనంగా ఉంటే ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయంటే
- ఆత్మవిశ్వాసం లేకపోవడం: సూర్యుడు బలహీనంగా ఉన్నప్పుడు వ్యక్తికి ఆత్మవిశ్వాసం ఉండదు. ఏ పని చేయాలన్నా భయపడతాడు.
- నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది: సూర్య స్థానం బలహీనంగా ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవడంలో చాలా ఇబ్బందిని ఎదుర్కొంటాడు.
- ఆరోగ్య సమస్యలు: బలహీనమైన సూర్య స్థానం ఉంటే తలనొప్పి, గుండె జబ్బులు, కంటి వ్యాధులు, కడుపు సంబంధిత సమస్యలను కలిగిస్తాడు.
- వృత్తిలో అడ్డంకులు: సూర్యుడు బలహీనంగా ఉన్నప్పుడు, విజయం సాధించడం కష్టం. ఉద్యోగం లేదా వ్యాపారంలో సమస్యలు ఏర్పడతాయి.
- తండ్రితో విభేదాలు: బలహీనమైన సూర్యుడు ఉన్న వ్యక్తికి తన తండ్రితో మంచి సంబంధాలు ఉండవు. తండ్రి నుంచి మద్దతు లభించదు.
- గౌరవం లేకపోవడం: సూర్యుడు బలహీనంగా ఉన్నప్పుడు వ్యక్తికి సమాజంలో గౌరవం లభించదు. తరచుగా అవమానాలను ఎదుర్కోవలసి ఉంటుంది.
- మానసిక సమస్యలు: బలహీనమైన సూర్యుడి స్థానం కారణంగా ప్రతికూల ఆలోచనలు, కోపం, అసూయ వంటి మానసిక సమస్యలు సంభవించవచ్చు.
- శారీరక బలహీనత: బలహీనమైన సూర్యుడి కారణంగా త్వరగా అలసిపోయి బలహీనంగా అనిపించవచ్చు.
- చర్మం, జుట్టు సమస్యలు: బలహీనమైన సూర్యుడి కారణంగా చర్మం, జుట్టుకి సంబధించిన సమస్యలు కూడా సంభవించవచ్చు.
- ప్రమాదాల ప్రమాదం: బలహీనమైన సూర్యుడి కారణంగా ప్రమాదాల బారిన పడే ప్రమాదం కూడా పెరగవచ్చు.
సూర్యుడు బలహీనంగా ఉంటే ఏమి చేయాలి? జాతకంలో సూర్యుడిని బలోపేతం చేయడానికి జ్యోతిషశాస్త్రంలో అనేక నివారణలు సూచించబడ్డాయి. సూర్యుడిని బలోపేతం చేయడానికి, సూర్యుడికి క్రమం తప్పకుండా అర్ఘ్యం సమర్పించండి. సూర్య నమస్కారం చేయండి. గాయత్రి మంత్రాన్ని జపించండి. సూర్య భగవానుడిని పూజించండి. పేదలకు దానం చేయండి. తండ్రిని గౌరవించండి. ఆదివారాలు ఉపవాసం ఉండండి. ఆదిత్య హృదయ స్తోత్రం పఠించండి. దానధర్మాలు చేయండి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.








