- Telugu News Photo Gallery Cinema photos Tollywood Actor Vishwaksen Rakhi Celebrations with his sister, See Photos
Vishwak Sen: విశ్వక్ సేన్ ఇంట్లో రాఖీ సెలబ్రేషన్స్.. హీరో సోదరిని చూశారా? ఫొటోస్ వైరల్
లైలా సినిమాతో ఎదురు దెబ్బ తిన్న విశ్వక్ సేన్ ఇప్పుడు స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలోనే జాతి రత్నాలతో అందరి దృష్టిని ఆకర్షించిన డైరెక్టర్ అనుదీప్ తో కలిసి ఓ కామెడీ ఎంటర్ టైనర్ మూవీ చేస్తున్నాడు.
Updated on: Aug 13, 2025 | 12:26 PM

అన్నా చెల్లెళ్ల, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షా బంధన్ వేడుకలు ఇటీవల ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సోదరి మణులు తమ సోదరులకు రాఖీలు కట్టి విషెస్ చెప్పారు.

సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా రాఖీ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. తమ తోబుట్టువులకు రాఖీలు కట్టి బెస్ట్ విషెస్ చెప్పారు. ఈ క్రమంలో హీరో విశ్వక్ సేన్ ఇంట్లోనూ రక్షా బంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి.

ఈ సందర్భంగా విశ్వక్ సేన్ సోదరి వన్మయి హీరోకు రాఖీ కట్టి నోరూ తీపి చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు విశ్వక్ సేన్.

ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఈ ఫొటోల్లో ఎంతో అందంగా, క్యూట్ గా కనిపించారు విశ్వక్ సేన్, వన్మయి

ఇక సినిమాల విషయానికి వస్తే.. గతేడాది మూడు సినిమాలతో తెలుగు ఆడియెన్స్ ను పలకరించాడు విశ్వక్. అయితే ఈ ఏడాది అతను నటించిన లైలా సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.

ప్రస్తుతం జాతి రత్నాలు డైరెక్టర్ అనుదీప్ తో కలిసి ఫంకీ అనే సినిమా చేస్తున్నాడు మాస్ కా దాస్. దీన్ని ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.




