AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raksha ka Bandhan: టాటా మోటార్స్‌ ‘దుర్గా’ మహిళల రాఖీ.. ట్రక్‌ డ్రైవర్ల భద్రతకు భరోసా..

ఈ రక్షా బంధన్‌కి.. టాటా మోటార్స్‌లోని దుర్గా లైన్‌కు చెందిన మహిళా ఉద్యోగులు.. స్వయంగా తమ చేతులతో రాఖీలను తయారు చేశారు. ఈ రాఖీలను కలంబోలిలోని ట్రక్ డ్రైవర్లకు ప్రేమతో కట్టి.. వారి భద్రతకు తాము అండగా ఉన్నామని చాటి చెప్పారు. డ్రైవర్లు సైతం తమ కుటుంబంలో ఒకరని గుర్తుచేశారు.

Raksha ka Bandhan: టాటా మోటార్స్‌ 'దుర్గా' మహిళల రాఖీ.. ట్రక్‌ డ్రైవర్ల భద్రతకు భరోసా..
Raksha Ka Bandhan
Krishna S
| Edited By: |

Updated on: Aug 11, 2025 | 1:52 PM

Share

రక్షా బంధన్ అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. అది ప్రేమ, నమ్మకం, రక్షణతో కూడిన బంధాన్ని పంచుకునే వేడుక. ఈ విలువలే టాటా మోటార్స్ తమ ఫ్యాక్టరీ ప్లాంట్ల నుంచి దేశవ్యాప్తంగా ఉన్న రహదారుల వరకు విస్తరించింది. దేశాన్ని నిరంతరం ముందుకు నడిపిస్తున్న ట్రక్ డ్రైవర్లను టాటా మోటార్స్ కుటుంబంలో ఒకరిగా భావిస్తుంది. ఈ ఏడాది రక్షా బంధన్‌ను పురస్కరించుకుని టాటా మోటార్స్, TV9 నెట్‌వర్క్‌తో కలిసి ‘రక్షా కా బంధన్’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా టాటా మోటార్స్‌లోని దుర్గా లైన్ మహిళా ఉద్యోగులు.. దేశంలోనే అత్యంత సురక్షితమైన ట్రక్కులను తయారుచేసే తమ చేతులతో రాఖీలను తయారు చేశారు.

ఈ రాఖీలను నవీ ముంబైలోని కలంబోలి ట్రాన్స్‌పోర్ట్ నగర్‌కు చెందిన ట్రక్ డ్రైవర్లకు ప్రేమతో కట్టారు. ఆ మహిళలకు, రోడ్డు మీద ఉన్న ప్రతి డ్రైవర్ తమ కుటుంబంలో ఒకరు. రాఖీతో పాటు ‘‘మేము మీ భద్రతను కోరుకుంటున్నాం. మీ ప్రయాణంలో ప్రతి మైలుకూ మీరు సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నాం’’ అనే సందేశం పంపారు. టాటా మోటార్స్ సురక్షా నిబద్ధత ఇంజినీరింగ్‌తోనే ముగిసిపోలేదని ఈ రాఖీలతో పాటు పంపిన వ్యక్తిగత సందేశాలు గుర్తుచేశాయి.

ఈ మహిళలు డ్రైవర్లు.. సరుకు భద్రత కోసం అధునాతన యాక్టివ్, ప్యాసివ్ సేఫ్టీ టెక్నాలజీలతో ట్రక్కులను నిర్మిస్తారు. వారు పంపిన రాఖీలు ఆ లక్ష్యానికి ప్రతీక. ప్రేమ, గౌరవంతో అల్లిన ఈ రాఖీలు రక్షణ బంధాలుగా నిలిచాయి. కలంబోలిలో రాఖీలు కడుతున్నప్పుడు డ్రైవర్ల ముఖాలు భావోద్వేగం, చిరునవ్వులతో నిండిపోయాయి. తమ గురించి ఎక్కడో ఉన్న ఎవరో రోజూ ఆలోచిస్తున్నారని.. తమ భద్రతకు ప్రాధాన్యమిస్తున్నారని వారికి ఆ రాఖీలు గుర్తుచేశాయి. ఎందుకంటే, టాటా మోటార్స్‌కు ప్రతి డ్రైవర్ కుటుంబ సభ్యుడే. ఎప్పుడూ కుటుంబ భద్రతకే మొదటి ప్రాధాన్యం ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే