AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పన్నీటితో స్నానం.. ఖరీదైన కార్లలో ప్రయాణం.. చివరకు అనాథలా రైల్వే స్టేషన్‌లో మరణం..

సినిమా ఇండస్ట్రీలో ఆయన స్టార్ కమెడియన్.. తొలితరం కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు ఆయన., అప్పట్లోనే లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకున్నాడట ఆయన.. ఆయన పేరు కస్తూరి శివరావు. స్టార్ హీరోలకు మించి క్రేజ్ సొంతం చేసుకున్న ఆయన ఖరీదైన కార్లలో తిరిగే వాడట..

పన్నీటితో స్నానం.. ఖరీదైన కార్లలో ప్రయాణం.. చివరకు అనాథలా రైల్వే స్టేషన్‌లో మరణం..
Kasturi Siva Rao
Rajeev Rayala
|

Updated on: Apr 08, 2026 | 3:36 PM

Share

తెలుగు సినీ రంగంలో ఒకప్పుడు వెలిగి, కోట్లు సంపాదించి, చివరకు కటిక దారిద్ర్యంతో కన్నుమూసిన హాస్యనటుడు కస్తూరి శివరావు జీవితం ఒక విషాద గాథ. నేటితరం బ్రహ్మానందం, సునీల్, వెన్నెల కిషోర్, ఆలీల లాగే, గత తరం రేలంగి, రమణారెడ్డి, రాజబాబుల లాగే, అంతకు ముందు కస్తూరి శివరావు వెండితెరపై నవ్వుల పూయించారు. తెలుగు సినీ రంగంలో తొలి స్టార్ కమెడియన్‌గా కీర్తి గడించిన ఆయన నటుడిగా లెక్క పెట్టలేనంత డబ్బు సంపాదించారు. అదే రీతిలో దుబారా చేసి, చివరికి ఒక అనామకుడిగా మరణించారు. శివరావు 1913లో కాకినాడలో జన్మించారు. తండ్రి ఉపాధ్యాయుడు కాగా, ఆయనకు చదువు కన్నా పద్యాలు, పాటలు, నాటకాలపైనే ఆసక్తి ఎక్కువ. నాటక రంగంలో హాస్యాన్ని పండించి, కామెడీతో సినిమా ఛాన్సులు అందుకున్నారు.

నాకు బ్రేకప్ అయ్యింది.. మా అమ్మకు కూడా అది తెలుసు.. షాకింగ్ విషయం చెప్పిన కృతిశెట్టి

1939లో వరవిక్రయం సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత స్వర్గసీమ చిత్రంతో ప్రజలకు మరింత దగ్గరయ్యారు. బాలరాజు, గుణసుందరి కథ, లైలా మజ్ను, శ్రీ లక్ష్మమ్మ కథ, స్వప్న సుందరి వంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించి పేరు ప్రఖ్యాతులు పొందారు. తెరపై ఆయన కనిపించగానే ప్రేక్షకుల ముఖాల్లో నవ్వులు వెల్లివిరిసేవి. ఆ రోజుల్లోనే లక్ష రూపాయలు పారితోషికంగా తీసుకున్న ఆయన పన్నీటితో స్నానం చేసేవారని, ఖరీదైన బ్యూకో కారులో దర్జాగా తిరిగేవారని ప్రచారంలో ఉంది. తమ సినిమాల్లో శివరావు ఉండాల్సిందేనని అప్పటి హీరోలు, నిర్మాతలు పట్టుబట్టేవారంటే ఆయనకున్న డిమాండ్ అర్థం చేసుకోవచ్చు. శివరావు కేవలం నటుడిగానే కాక, గొప్ప దాతగా కూడా పేరుపొందారు. జేబులో నోట్ల కట్టలు పెట్టుకుని తిరుగుతూ, అడిగిన వారందరికీ సాయం చేసేవారు. భూమి, ధనం వంటి దానధర్మాలు చేశారు. అయితే, పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా. సినిమా నిర్మించాలన్న ఆలోచన ఆయన పాలిట శాపంగా మారింది.

వార్ని..! ఈ నటుడి భార్య ఈమేనా..!! తెలుగులో చాలా పాపులర్ నటి కదా గురూ..!!

ఆయన స్వీయ నిర్మాణంలో 1950లో నాగిరెడ్డి నాగేశ్వరరావుతో తీసిన పరమానందయ్య శిష్యులు సినిమా భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. ఒకప్పుడు బ్యూకో కారులో తిరిగిన ఆయన తిరిగి సైకిల్ తొక్కుకునే స్థాయికి పడిపోయారు. ఇల్లు, కారు, ఆస్తులు అన్నీ పోగొట్టుకున్నారు. కోట్లు సంపాదించిన శివరావు, ఆ తర్వాత అవకాశాలు అడగాలంటే నామోషీగా భావించారు. ఆర్థిక ఇబ్బందులకు తోడు, తాగుడు వ్యసనమై, ఆయన జీవితాన్ని మరింత దిగజార్చింది. అవకాశాలు తగ్గిపోవడంతో మళ్లీ నాటక రంగాన్ని ఆశ్రయించారు. ఎన్.టి. రామారావు వంటి మహానటులు అభిమానంతో కొన్ని సినిమాల్లో అవకాశాలు కల్పించినా, షూటింగ్‌లకు తాగి రావడంతో తదుపరి ఛాన్సులు రాలేదు. శివరావు ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. ఆకలితో చనిపోవడం ఇష్టం లేక, ఒంట్లో శక్తి లేకపోయినా నాటకాలు వేసేందుకు వెళ్ళేవారు. పౌష్టికాహారం లేక చిక్కి శల్యమైపోయారు. చివరిసారిగా 1966లో తెనాలిలో ఒక నాటకంలో వేషం వేయడానికి వెళ్లారు. నాటకం ముగిశాక స్టేషన్‌లోని బల్లపై పడుకున్నారు. మరుసటి రోజు ఉదయం చలనం లేకపోవడంతో, ఎవరో అనాథ శవమని భావించారు. ఒక ప్రయాణికుడు ఆయన్ను గుర్తుపట్టాడట, ఆయన మృతదేహాన్ని స్వస్థలానికి పంపేందుకు కారు మాట్లాడగా, డ్రైవర్ శవాన్ని తీసుకెళ్లనని వాదించాడు. చివరకు డిక్కీలో ఆయన మృతదేహాన్ని పెట్టాల్సి వచ్చిందట. తన స్టార్‌డమ్ ఉన్నా చివరి చూపుకు కూడా చాలా మంది తారలు రాకపోవడం విషాదం. చివరికి పాడె మోయడానికి నలుగురు మనుషులకు డబ్బులు ఇచ్చి పిలిపించాల్సి రావడం అత్యంత దైన్యం.

ఇవి కూడా చదవండి

హీరో లేడు.. ఫైట్స్, స్పెషల్ సాంగ్స్ లేవు..! కట్ చేస్తే నాలుగేళ్లుగా ఓటీటీలో తిరుగులేని సినిమా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us