సాంగ్ వచ్చి 31ఏళ్లు.. ఇప్పటికీ యూట్యూబ్‌లో తోప్.. మిలియన్ కొద్దీ వ్యూస్
సినిమాలే కాదు కొన్ని పాటలు కూడా పేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంటాయి. సినిమాల సంగతి పక్కన పెడితే పాటలు మాత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రేమ గీతాలు ఆడియన్స్ గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతుంటాయి. ఓల్డ్ సాంగ్స్ కు ఉండే క్రేజ్ వేరు..

సంగీతం అనేది మానసిక ఉల్లాసాన్ని ఉత్సహాన్ని పెంచడమే కాకుండా మనసుకు హాయిని కూడా కలిగిస్తుంది. చాలా మంది మ్యూజిక్ ను ఎంజాయ్ చేస్తుంటారు. ఇక సినిమా సాంగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలు విజయాలను అందుకున్నా అందుకోకున్నా సాంగ్స్ మాత్రం మంచి క్రేజ్ తెచ్చుకుంటుంటాయి. సినిమాల రిజల్ట్స్ తో సంబంధం లేకుండా సాంగ్స్ హిట్ అవుతుంటాయి. సినిమాల విజయంలో సాంగ్స్ కూడా కీలక పాత్రలు పోషిస్తుంటాయి. ఇప్పుడొస్తున్న సాంగ్స్ తో పోల్చుకుంటే ఓల్డ్ సాంగ్స్ కు ఉండే వైబే వేరు.. అప్పట్లో సోషల్ మీడియా లేదు గాని ఉండుంటే ఎన్నో సాంగ్స్ ఆడియన్స్ ను ఇంకా ఎక్కువగా ఆకట్టుకునేవి.. అయితే అప్పట్లో ఊపేసిన ఓ సాంగ్ ఇప్పటికీ యూట్యూబ్ లో తెగ ట్రెండ్ అవుతుంది.
ఓల్డ్ సాంగ్స్ కు ఉండే క్రేజే వేరు.. ఆ లిరిక్స్, ఆ మ్యూజిక్ వేరే లెవల్ అనే చెప్పాలి. ముఖ్యంగా 90స్ కిడ్స్ మాత్రం అప్పటి సాంగ్స్ ను తెగ ఎంజాయ్ చేస్తుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సాంగ్ వచ్చి 31ఏళ్లు.. అయినప్పటికీ ఇప్పటికీ ఆ సాంగ్ క్రేజ్ ఎక్కడా తగ్గలేదు.. యూట్యూబ్ లో మిళియన్స్ కొద్దీ వ్యూస్ సొంతం చేసుకుంది. ఆ సాంగ్ మరేదో కాదు.. సూపర్ స్టార్ కృష్ణ నటించిన అమ్మదొంగ సినిమాలోని నీతో సాయంత్రం ఎంతో సంతోషం సాంగ్.
సాగర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ నటించారు. రాజ్-కోటి జంట విడిపోయిన తరువాత కోటి ఒంటరిగా సంగీతం అందించిన తొలి సినిమా ఇది. 1995లో సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలోని పాటలన్ని సూపర్ హిట్ గా నిలిచాయి. వాటిలో ఎస్పీబి, చిత్ర, శైలజ కలిసి ఆలపించిన నీతో సాయంత్రం ఎవర్ గ్రీన్ గా నిలిచింది. ఈ సాంగ్ కు ఇప్పటికీ చాలా మంది అభిమానులు ఉన్నారు. ఈ పాటలో ముగ్గురు హీరోయిన్స్ తో కలిసి స్టెప్పులేశారు కృష్ణ. ఈ సాంగ్ పై మీరూ ఓ లుక్కేయండి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
