AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జూలై 26 దినఫలాలు: ఆ రాశుల వారికి అదృష్టం ఖాయం..మీ రాశికి ఎలా ఉందంటే..?

Rashi Phalalu (July 26, 2026): ఈ ఆదివారం గ్రహాల సంచారం ప్రభావంతో కొన్ని రాశుల వారికి ఉద్యోగ, ఆర్థిక, వ్యాపార రంగాల్లో శుభ ఫలితాలు కనిపించనున్నాయి. మరికొందరు ఖర్చులు, బాధ్యతలు పెరిగినా ఆశించిన ఫలితాలను అందుకుంటారు. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఈరోజు కెరీర్, ధనం, కుటుంబం, ఆరోగ్యం, శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

జూలై 26 దినఫలాలు: ఆ రాశుల వారికి అదృష్టం ఖాయం..మీ రాశికి ఎలా ఉందంటే..?
Horoscope Today 26 July 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 26, 2026 | 6:00 AM

Share

దిన ఫలాలు (జూలై 26, 2026): మేష రాశి వారికి ఉద్యోగంలో ఆశించిన శుభవార్తలు వింటారు. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. వృషభ రాశి వారికి ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు వృద్ది చెందుతాయి. మిథున రాశి వారికి ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో ఆశించిన శుభవార్తలు వింటారు. అధికారులు ఆదర భావంతో వ్యవహరిస్తారు. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. వృత్తి జీవితం బిజీ అవుతుంది. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం చాలావరకు మెరుగ్గా ఉంటుంది. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. అనుకోకుండా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆధ్యాత్మిక వ్యవహారాలు, దైవ కార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు వృద్ది చెందుతాయి. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యక్తిగతంగా కొన్ని సమస్యలను సమయ స్ఫూర్తితో పరిష్కరించుకుంటారు. సమాజంలో ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. మిత్రుల సాయంతో పెండింగ్ పనుల్ని పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. మీ పనితీరు, మీ సమర్థత అధికారులకు నచ్చుతాయి. వృత్తి, వ్యాపారాలు బాగా అనుకూలంగా పురోగమిస్తాయి. తలపెట్టిన పనులన్నీ సవ్యంగా జరిగిపోతాయి. తోబుట్టువులతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం కావచ్చు. కొందరు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకా శాలు అందుతాయి. దగ్గర బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగం ప్రశాంతంగా సాగిపోతుంది. కొత్త ఆపర్లు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఇంటి బాధ్యతల విషయంలో కొద్దిగా ఊగిసలాట ధోరణి ఉంటుంది. వ్యక్తిగత వ్యవహారాల్లో కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. కొద్ది శ్రమతో పెండింగ్ పనుల్ని పూర్తి చేస్తారు. లాభాలకు, రాబడికి లోటుండదు. వృత్తి, వ్యాపారాల మీద శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ఇంటా బయటా శ్రమకు గుర వుతారు. జీవిత భాగస్వామి నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. ఆరోగ్యం అనుకూలిస్తుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కూడా బాగా ఒత్తిడి ఉంటుంది. ఏ పని తలపెట్టినా వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, వృథా ఖర్చులు ఇబ్బంది పెడతాయి. నిరుద్యోగులు శుభవార్త వింటారు. కుటుంబంలో అనుకో కుండా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. వృత్తి, ఉద్యోగాలపరంగా ప్రయాణాలు చేయ వలసి వస్తుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. కుటుంబంతో దైవకార్యాల్లో బాగా పాల్గొంటారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాల్లో లాభాలు ఆశాజన కంగా ఉంటాయి. వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. రావలసిన డబ్బు చేతికి అంది అవసరాలు తీరిపోతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. తలపెట్టిన ప్రతి పనీ విజయవంతంగా పూర్తవుతుంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు మారతాయి. ఆశించిన ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. వ్యాపారాల్లో మీరు తలపెట్టిన మార్పులు సత్ఫలితా లని స్తాయి. కుటుంబ సభ్యులతో ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. బంధువులతో సఖ్యత పెరుగు తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం చాలావరకు మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగం మారే విషయంలో సానుకూల స్పందన లభిస్తుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు పూర్తిగా చక్కబడతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రతిభా పాటవాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. మీ పనితీరుకు అధి కారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. అదనపు ఆదాయ మార్గాలు పెరిగి, ఆర్థిక సమస్యలు తగ్గు తాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగుతాయి. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందు తుంది. జీవిత భాగస్వామి పురోగతి సాధిస్తారు. కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులకు చేదోడు వాదోడుగా ఉంటారు. ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలనిస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్లు లాభిస్తాయి. అదనపు ఆదాయ మార్గాలు మీ ముందుకు వస్తాయి. ప్రతిభకు డిమాండ్ పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారయవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబంలో సుఖ సంతో షాలు వెల్లి విరుస్తాయి. భాగస్వాములతో విభేధాలు సమసిపోతాయి. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా విముక్తి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో మార్పులు, చేర్పులు చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇంటా బయటా అనుకూల పరిస్థితులుంటాయి. ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలనిస్తాయి. బంధువుల ద్వారా ఆస్తి వివాదం సమసిపోతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కుటుంబ సభ్యులతో దైవకార్యాల్లో పాల్గొంటారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ప్రతి పనిలోనూ వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. వ్యక్తిగత పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. వ్యాపారాల్లో శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది. కుటుంబ సభ్యులతో హ్యాపీగా గడుపుతారు. తోబుట్టువులతో వివాదాలు పరిష్కారమవుతాయి. పెళ్లి ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో ఆదరాభిమానాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక ఉండని పరి స్థితి ఏర్పడుతుంది. కొత్త కార్యక్రమాలు, ప్రాజెక్టులు చేపడతారు. ఆర్థిక ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. బంధువుల నుంచి ఒకటి రెండు శుభవార్తలందు తాయి. ఆదాయం పరిస్థితి చాలావరకు నిలకడగా ఉంటుంది. ఆరోగ్యానికి భంగమేమీ ఉండదు.

Also Read: ఈ వారం వారి జాతకం మారబోతోంది… ఆ రాశులకు ఉద్యోగం, పెళ్లి యోగం! (వారఫలాలు)

Follow Us