AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shukra Blessings: నీచ శుక్రుడితో అనూహ్య శుభ యోగాలు..! పెళ్లి, ప్రేమ వ్యవహారాలు సక్సెస్

ప్రేమలు, పెళ్లిళ్లు, శృంగారం, దాంపత్య జీవితం, సంపద, సుఖ సంతోషాలకు కారకుడైన శుక్రుడు ఒక నెల రోజుల పాటు బలహీనపడడం జరుగుతోంది. ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 2 వరకూ శుక్రుడు కన్యా రాశిలో నీచబడడం జరుగుతోంది. శుక్రుడు నీచబడడం వల్ల కొన్ని రాశులకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నప్పటికీ, కన్యా రాశి శుక్రుడికి మిత్ర క్షేత్రం కూడా కావడం వల్ల మరికొన్ని రాశులకు మాత్రం రాజయోగాలు, ధన యోగాలు, అధికార యోగాలు పట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా వృషభం, మిథునం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మకర రాశుల వారికి ఈ యోగాలు పట్టడం జరుగుతుంది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 24, 2026 | 4:43 PM

Share
వృషభం: రాశ్యధిపతి శుక్రుడు పంచమ కోణంలో నీచత్వం పొందుతున్నందువల్ల కలలో కూడా ఊహించని ఆర్థిక యోగాల్ని కలిగించే అవకాశం ఉంటుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర అదనపు ఆదాయ ప్రయత్నాలు విశేషంగా లాభించే అవకాశం ఉంది. విలాస జీవితం గడిపే అవకాశం ఉంది. ఉద్యో గులు, నిరుద్యోగుల విదేశీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం కుదురుతుంది. పిల్లలు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. సంతాన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది.

1 / 6
మిథునం: ఈ రాశికి అత్యంత శుభుడైన శుక్రుడు చతుర్థ స్థానంలో సంచారం వల్ల గృహ, వాహన యోగాలు పట్టే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. ఇంట్లో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. వారసత్వపు ఆస్తి సంక్రమిస్తుంది. ఉద్యోగంలో అధికారులు మీ శక్తి సామర్థ్యాల్ని గుర్తించి పదోన్నతి కల్పించడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో మార్పులు, చేర్పులు చేపట్టి ఆర్థికంగా లబ్ది పొందే అవకాశం ఉంది.

2 / 6
సింహం: ఈ రాశికి ధన స్థానంలో శుక్ర సంచారం వల్ల ఊహించని విధంగా ఒకటి రెండు ధన యోగాలు పడతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. అదనపు ఆదాయాన్ని షేర్లు, చిన్న వ్యాపారాల్లో పెట్టు బడులుగా పెట్టి లబ్ధి పొందడం జరుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. దాంపత్య జీవితం బాగా హ్యాపీగా సాగిపోతుంది. ఆశించిన పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.

3 / 6
వృశ్చికం: ఈ రాశికి లాభ స్థానంలో శుక్ర సంచారం వల్ల వృత్తి, వ్యాపారాలు ఆర్థిక సంబంధమైన కష్టనష్టాల నుంచి క్రమంగా బయటపడే అవకాశముంది. మంచి స్నేహాలు ఏర్పడతాయి. లాభదాయక ఒప్పం దాలు కుదురుతాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు సానుకూలంగా పరిష్కారమవుతాయి. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఇంట్లో పెళ్లి, గృహ ప్రవేశం వంటి శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. అనారోగ్యాల నుంచి పూర్తిగా కోలుకోవడం జరుగుతుంది.

4 / 6
ధనుస్సు: ఈ రాశికి దశమంలో శుక్ర సంచారం వల్ల, ఉద్యోగపరంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అనేక విధాలుగా లబ్ధి పొందడం జరుగుతుంది. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్లు అందుతాయి. ఆర్థికంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయం వరిస్తుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేసి, కీర్తి ప్రతిష్ఠలు సంపాదించుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. తల్లితండ్రుల నుంచి ఆస్తి, సంపద సంక్రమించే అవకాశంఉంది.

5 / 6
మకరం: ఈ రాశికి భాగ్య స్థానంలో శుక్రుడి సంచారం వల్ల విదేశీ అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది.వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ విస్తరిస్తుంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశీ ప్రయాణాలు చేయవలసి వస్తుంది. నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమలో పడే సూచనలున్నాయి. దాంపత్య జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది.

6 / 6
Follow Us