AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weekly Horoscope: ఈ వారం వారి జాతకం మారబోతోంది… ఆ రాశులకు ఉద్యోగం, పెళ్లి యోగం!

వార ఫలాలు (జూలై 26-ఆగస్టు 1, 2026): మేష రాశి వారికి ఈ వారమంతా ఆర్థికంగా చక్కగా గడిచిపోతుంది. ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. వృషభ రాశి వారి ప్రతిభా పాటవాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 25, 2026 | 7:00 PM

Share
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): రాశ్యధిపతి కుజుడు ధన స్థానంలో ఉండడం, చతుర్థ స్థానంలో గురు రవులు యుతి చెందడం వల్ల వారమంతా ఆర్థికంగా చక్కగా గడిచిపోతుంది. ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. శుభ కార్యాలకు సంబంధించిన ప్రయత్నాలు తప్పకుండా సత్ఫలితాలనిస్తాయి. ముఖ్య మైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను సకాలంలో చక్కబెడతారు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రుల వల్ల లబ్ధి పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగ జీవితం బాగా సంతృప్తికరంగా ఉంటుంది. పిల్లలు విజయాలు సాధిస్తారు. సోదరులతో వివాదాలు పరిష్కారమయ్యే అవ కాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.

1 / 12
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): రాశ్యధిపతి శుక్రుడు చతుర్థ స్థానంలో, గురువు తృతీయంలో ఉచ్ఛ స్థితిలో ఉండడం వల్ల ప్రతిభా పాటవాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. కుటుంబంలో సుఖసంతోషాలు నెలకొంటాయి. గృహ, వాహన సౌకర్యాలు అమరుతాయి. ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులు చురుకుగా పురోగమిస్తాయి. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగుతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. పిల్లలు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగుతాయి. ఆదాయానికి లోటుండదు.

2 / 12
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): గురు, రవి, బుధ గ్రహాల సంచారం చాలావరకు అనుకూలంగా ఉంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. రావలసిన డబ్బు తప్పకుండా అందుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. కుటుంబ బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది.  ఆర్థిక వ్యవహారాలు, ఆస్తి వివాదాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు తేలికగా పూర్తవుతాయి. వ్యాపారాల్లో మార్పులు చేర్పులు చేసి లాభాలు గడిస్తారు. ఉద్యోగంలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. కుటుంబసమేతంగా ఆలయాలను దర్శిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది.  పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి.  ప్రేమ వ్యవహారాలు సాఫీగా, సంతృప్తికరంగా సాగుతాయి.

3 / 12
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఈ రాశికి భాగ్య స్థానంలో శనీశ్వరుడి వక్ర సంచారం, ఈ రాశిలో గురువు ఉచ్ఛ స్థితి కారణంగా ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ జీవితం ఉత్సా హంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలకు సంబంధించి అధికారుల నుంచి శుభవార్త అందుకుంటారు. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా పురోగమిస్తాయి. ఇంటా బయటా బాగా ఒత్తిడి, శ్రమ ఉంటాయి. స్వల్ప అనారోగ్యానికి కూడా అవకాశం ఉంది. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం మంచిది.  పిల్లల చదువుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.  మంచి పరిచయాలు ఏర్పడతాయి.  జీవిత భాగస్వామికి ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా అపార్థాలు తలెత్తుతాయి. ఒకటి రెండు ఆశించిన శుభవార్తలు అందుతాయి.

4 / 12
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): కుజ, శుక్ర, బుధ గ్రహాల బలం వల్ల ఉద్యోగం, కుటుంబ విషయాల్లో అనుకూలతలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఆచితూచి ఖర్చు చేయడం మంచిది. మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ప్రముఖులతో స్నేహాలు విస్తరిస్తాయి. కొద్దిపాటి వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో మీ ఆలోచనలు, వ్యూహాలు ఆశిం చిన ఫలితాలనిస్తాయి. ఆస్తి వివాదానికి సంబంధించి బంధువుల నుంచి ఆశించిన శుభవార్త వింటారు. నిరుద్యోగులు తమ ప్రయత్నాల్ని ముమ్మరం చేయడం మంచిది.  విదేశాల్లో స్థిరపడిన పిల్లలు, బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఇంట్లో శుభ కార్యాన్ని తలపెడతారు. రావల సిన డబ్బు చేతికి అందుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగుతాయి.

5 / 12
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): లాభ స్థానంలో ఉన్న రాశ్యధిపతి బుధుడి వల్ల ఆర్థిక పరిస్థితికి లోటుండదు. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. కొన్ని ముఖ్య వ్యవహారాలు సానుకూలపడ తాయి. వ్యక్తిగత సమస్యలను సమయస్ఫూర్తితో పరిష్కరించుకుంటారు. ఆస్తి వివాదం ఒకటి సమ సిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. పెళ్లి సంబంధానికి సంబంధించి బంధువుల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. పిల్లల చదువులు మెరుగ్గా ఉంటాయి. కుటుంబ సమేతంగా ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగ సంబంధమైన ఏ ప్రయత్నమైనా సఫలం అయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగపరంగా విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది.  ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత, సాన్నిహిత్యం బాగా పెరిగే అవకాశముంది.

6 / 12
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): గురు, రవి, శని, శుక్ర గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల వారమంతా ప్రశాంతంగా, సానుకూ లంగా గడిచిపోతుంది. ప్రతి ప్రయత్నమూ నెరవేరుతుంది. ఈ అనుకూల సమయాన్ని సద్విని యోగం చేసుకోవడం మంచిది.  చేపట్టిన వ్యవహారాల్లో శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది.పెండింగ్ పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తవుతాయి. ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు.  బంధుమిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి ఉప శమనం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం కొనసాగుతుంది. వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి. ఇతరుల వ్యవహారాల కంటే సొంత పనులు మీద శ్రద్ధ పెంచడం మంచిది. జీవిత భాగస్వామికి వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి.

7 / 12
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): గురు, శని, కుజ గ్రహాల అనుకూలత కారణంగా ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుం టాయి. ఆదాయం బాగా పెరుగుతుంది కానీ, అందుకు తగ్గ ఖర్చులు సిద్ధంగా ఉంటాయి. ఆశిం చిన శుభవార్తలు వింటారు. ఒకటి రెండు ముఖ్యమైన శుభవార్తలు వింటారు. వ్యయ ప్రయాస  లతో గానీ ఏ ముఖ్యమైన వ్యవహారమూ పూర్తి కాదు. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. ఉద్యో గంలో పని భారం బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి వృద్ధి చెందుతుంది.  బంధువు లకు ఒక శుభ కార్యం కోసం సహాయం చేయడం జరుగుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఇష్టమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు.  రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందు తుంది. జీవిత భాగస్వామికి ఆర్థిక లాభం కలుగుతుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగుతాయి.

8 / 12
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): కుజ, బుధ, శుక్ర గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు దిగ్విజయంగా చక్కబడతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. నిరుద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. కొత్త కార్యక్రమాలు, నిర్ణయాలు విజయవంతంగా నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ ఆలోచనలకు, సలహాలకు ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి. ఆరోగ్యం విషయంలో వీలైనంత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది.

9 / 12
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): గురు, శని, కుజుల బలం బాగా అనుకూలంగా ఉంది. ద్వితీయ స్థానంలో ఉన్న రాహువు  ప్రభా వం బాగా తగ్గుతుంది. కొందరు ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. గౌరవ మర్యాదలకు లోటుండదు.  ప్రభుత్వ మూలక ధన లాభం కూడా ఉంది.  మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగ సంబంధమైన ఏ ప్రయత్నమైనా సఫలం అవుతుంది. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా వృద్ధి చెందుతాయి. చేపట్టిన పనుల్ని కొద్ది శ్రమతో విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా ఊరట లభిస్తుంది. పిల్లలు కొద్ది శ్రమతో ఆశించిన ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా పురోగమిస్తాయి.

10 / 12
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): పంచమ, సప్తమ స్థానాలు శుభ గ్రహాలతో బలంగా ఉన్నందువల్ల కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందుతారు. మీ నుంచి సహాయం పొందినవారు మీకు ఆశించిన స్థాయిలో అండగా నిలబడతారు. శుక్రుడు సప్తమ స్థానంలో బాగా అనుకూలంగా ఉన్నందు వల్ల జీవిత భాగస్వామి నుంచి ఆశించిన సహాయ సహకారాలందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం పెరిగినప్పటికీ అంచనాలకు మించిన ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. కొందరు మిత్రుల కారణంగా డబ్బు నష్టపోయే సూచనలున్నాయి. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబంతో ఆలయాలు సందర్శిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.

11 / 12
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): పంచమ స్థానంలో రాశ్యధిపతి గురువు ఉచ్ఛ స్థితిలో ఉండడం, తృతీయంలో కుజుడి సంచారం కారణంగా ఉద్యోగ జీవితం రాజయోగంగా సాగిపోతుంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు మరిన్ని సదవకాశాలు అంది వస్తాయి. ఆర్థిక పరిస్థితి క్రమంగా అనుకూలంగా మారుతుంది. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు, చేతకు బాగా విలువ పెరుగుతుంది. బంధుమిత్రులు మీ వల్ల బాగా లాభపడతారు. వ్యాపారాల్లో లాభాలు అంచనాలకు మించి వృద్ధి చెందుతాయి. జీవిత భాగస్వామికి వృత్తి, ఉద్యోగాల్లో అధికార యోగం పట్టే అవకాశం ఉంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా, సంతృప్తికరంగా సాగుతాయి.

12 / 12
Follow Us