AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కమిట్మెంట్ అడిగాడు.. ఆ డైరెక్టర్‌ను కొట్టి అక్కడి నుంచి వచ్చేశా : ఐశ్వర్య

జబర్డస్త్ ద్వారా పాపులర్ అయిన వారిలో ఐశ్వర్య ఒకరు. ఈ ముద్దుగుమ్మ తన కామెడీతో పాటు అందంతోనూ కవ్విస్తుంది ఈ చిన్నది. పలు టీవీ షోలతో పాటు సినిమాలు, వెబ్ సిరీస్ లోనూ నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య ఆసక్తికర కామెంట్స్ చేసింది.

కమిట్మెంట్ అడిగాడు.. ఆ డైరెక్టర్‌ను కొట్టి అక్కడి నుంచి వచ్చేశా : ఐశ్వర్య
Ishwarya
Rajeev Rayala
|

Updated on: Apr 09, 2026 | 7:14 PM

Share

జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది నటి ఐశ్వర్య వల్లింగాల. తన అందంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ అందాల తార. తాజాగా ఐశ్వర్య ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితంలోని పలు అంశాలపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. సినీ పరిశ్రమలో తాను ఎదుర్కొన్న సవాళ్లు, ప్రేమ జీవితం, భవిష్యత్ ప్రణాళికల గురించి తెలిపింది. గతంలో నాతో నేను చిత్రం ప్రమోషన్స్ సమయంలో నటుడు సాయితో కలిసి చేసిన ఒక స్కిట్, దానికి సంబంధించిన ప్రోమో విస్తృతంగా వైరల్ అయ్యింది. ఈ ప్రోమో చూసిన చాలామంది తమది నిజమైన సంబంధమని, పెళ్లి కూడా జరిగిందని అపోహ పడ్డారని ఐశ్వర్య తెలిపింది. ఇది కేవలం ఒక ప్రచారంలో భాగంగా చేసిన స్కిట్ మాత్రమే అని, దానిని ప్రజలు నిజంగా నమ్మడం ఆశ్చర్యపరిచిందని ఆమె తెలిపింది. తన ప్రేమ జీవితం గురించి మాట్లాడుతూ, ప్రేమను తాను చాలా విలువైనదిగా, అమూల్యమైనదిగా భావిస్తానని చెప్పుకొచ్చింది.

జోడీ సెట్.. పెద్ది సినిమాలో చరణ్‌తో స్పెషల్ సాంగ్ చేసేది ఈ అమ్మడేనట

అయితే, “అంత విలువైన ప్రేమను డిజర్వ్ లేని వ్యక్తులు జీవితంలోకి వస్తే అది నిలబడదు” అని ఆమె తెలిపింది. ప్రస్తుతం తాను సింగిల్‌గా ఉండటంలోనే సంతోషంగా ఉన్నానని తెలిపింది. వివాహం పట్ల ప్రస్తుతానికి తనకు ఆసక్తి లేదని, ఇంటి వ్యవహారాలు సర్దుకున్న తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తానని, అది కూడా తన తల్లి ఇష్టానికి వదిలేశానని తెలిపింది. సినీ పరిశ్రమలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకుంటూ, కమిట్‌మెంట్ పేరుతో ఫోన్ కాల్స్ వచ్చేవని తెలిపింది. మొదట్లో కమిట్‌మెంట్ అంటే పని పట్ల నిబద్ధత అని భావించి, తాను చాలా కమిట్‌మెంట్‌తో, హార్డ్‌వర్క్‌తో పనిచేస్తానని చెప్పేదానినని.. అయితే, దాని అసలు అర్థం తెలిసిన తర్వాత, ఒక సందర్భంలో ఒక డైరెక్టర్‌ను కొట్టి అక్కడి నుంచి బయటకు వచ్చినట్లు తెలిపింది ఐశ్వర్య.

వార్ని..! ఈ నటుడి భార్య ఈమేనా..!! తెలుగులో చాలా పాపులర్ నటి కదా గురూ..!!

అవకాశాల కోసం ఎవరినీ అడగనని, అయినప్పటికీ తనకు సినిమాలు వస్తున్నాయని ఆమె స్పష్టం చేసింది. కొన్నిసార్లు డబ్బింగ్ థియేటర్లలో లేదా స్నేహితుల ద్వారా తన క్లిప్స్ చూసి కూడా అవకాశాలు వచ్చాయని ఆమె తెలిపింది. నిరంతరంగా టీవీ షోలు, సీరియల్స్, సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తున్నప్పటికీ, ఇంకా సరైన బ్రేక్ రాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కథ విన్న తర్వాత కూడా సినిమా అవుట్‌పుట్ డీఓపీ, డైరెక్టర్ లేదా నటీనటుల సరైన ప్రదర్శన లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చని అన్నారు. సినిమా షూటింగ్ ఉన్న రోజు కూడా జబర్దస్త్ లేదా శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి పిలుపు వస్తే, సినిమా షెడ్యూల్‌ను సర్దుబాటు చేసుకుని ఈ షోలకు వెళ్లేదాన్ని అని తెలిపింది. బిగ్‌బాస్‌లో పాల్గొనే అవకాశం గత సీజన్‌లో ఇంటర్వ్యూల వరకు వచ్చి, ఇంట్లోకి ప్రవేశించే అవకాశం రాలేదని ఆమె తెలిపారు.

ఈ విలన్ మామూలోడు కాదు..! ఎకరం భూమిని కేవలం రూ. 100 కొంటే.. ఇప్పుడు అవి రూ.100 కోట్లు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us