AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా ఇన్ స్టా‌గ్రామ్‌ సబ్‌స్క్రిప్షన్‌‌లో అలాంటివి ఉండవు.. అది బూతు కంటెంట్ కోసం మాత్రమే కాదంటున్న హీరోయిన్

ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ఇన్ స్టా‌గ్రామ్‌లో సబ్‌స్క్రిప్షన్‌ గోల ఎక్కువగా వినిపిస్తుంది. డబ్బులు కట్టి అందాలు చూడండి అంటూ కొంతమంది ముద్దుగుమ్మలు ఇన్ స్టా‌గ్రామ్‌లో సబ్‌స్క్రిప్షన్‌ పెట్టుకుంటున్నారు. దీని పై ఇప్పటికే రచ్చ రచ్చ అవుతుంది. తాజాగా దీని పై ఓ హీరోయిన్ స్పందించింది.

నా ఇన్ స్టా‌గ్రామ్‌ సబ్‌స్క్రిప్షన్‌‌లో అలాంటివి ఉండవు.. అది బూతు కంటెంట్ కోసం మాత్రమే కాదంటున్న హీరోయిన్
Actress
Rajeev Rayala
|

Updated on: Apr 11, 2026 | 3:00 PM

Share

సోషల్ మీడియా ద్వారా సెలబ్రెటీలు అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు. చాల మంది ముద్దుగుమ్మలు సినిమాలతో కంటే సోషల్ మీడియాలోనే చాలా యాక్టివ్ గా ఉంటారు. సినిమా అప్డేట్స్ తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటుంటారు. చాలా మంది అందాల తారలు తమ గ్లామర్ తో నెట్టింట తెగ సందడి చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్ స్టా గ్రామ్ లో సబ్‌స్క్రిప్షన్‌ గోల ఎక్కువైంది. సబ్‌స్క్రిప్షన్‌ తీసుకుంటే ఎక్స్ క్లూజివ్ కంటెంట్ ఉంటుంది అంటూ కొంతమంది ముద్దుగుమ్మలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. అయితే చాలా మంది సోషల్ మీడియాలో బోల్డ్ కంటెంట్ తో రచ్చ చేస్తున్నారు. సబ్‌స్క్రిప్షన్‌ అంటే బూతు కంటెంట్ అనేలా చాలా మంది ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. అయితే సబ్‌స్క్రిప్షన్‌ అంటే బూతు కంటెంట్ అని అనుకోవద్దు అని ఓ హీరోయిన్ చెప్పుకొచ్చింది. ఆమె ఎవరంటే..

ఆమె ఎవరో కాదు అన్నా రేష్మ రాజన్‌. మలయాళ ఇండస్ట్రీలో హీరోయిన్ గా సినిమాలు చేసింది ఈ ముద్దుగుమ్మ. మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ సినిమాలో నటించింది. ఈ సినిమాలో పృథ్వీరాజ్‌ సుకుమారం భార్యగా నటించింది. ప్రస్తుతం ఈ అమ్మడు తమిళ్ లో నటిస్తుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న జైలర్ 2 సినిమాలో ఈ చిన్నది నటిస్తుంది. ఈ సినిమాతో తమిళ్ లోకి అడుగుపెడుతుంది ఈ అమ్మడు. ఇదిలా ఉంటే తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో సబ్‌స్క్రిప్షన్‌ గురించి మాట్లాడుతూ..

ఇన్ స్టా గ్రామ్ లో సబ్‌స్క్రిప్షన్‌ అంటే బూతు కంటెంట్ అని అనుకోవద్దు.. నా ఇన్ స్టా గ్రామ్ లో సబ్‌స్క్రిప్షన్‌ ఉంది. నా దగ్గర నుంచి అలాంటివి ఆశించొద్దు.. నా అకౌంట్‌లో సబ్‌స్క్రిప్షన్‌ ను నేను రెండేళ్ల క్రితమే మొదలు పెట్టా.. దీని వల్ల నేను అభిమానులకు మరింత దగ్గరవ్వొచ్చు. అలాగే నా రీల్స్, ఫోటోలు ముందుగానే మీకు చేరుతాయి అంతే.. అలాగే నా అకౌంట్‌లో సబ్‌స్క్రిప్షన్‌ నా సినిమా అప్డేట్స్ మాత్రమే ఉంటాయి అని మీకు క్లియర్ గ చెప్తున్నా అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఈ అమ్మడి కామెంట్స్ పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది రీల్స్, ఫోటోలు, సినిమా అప్డేట్స్ కోసమే ఇన్ స్టా గ్రామ్ లో సబ్‌స్క్రిప్షన్‌ ఎందుకు అంటూ సెటైర్స్ వేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Anna raajan (@annaspeeks)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us