AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆయనంటే పిచ్చి.. ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకున్నా.. సీనియర్ నటి షాకింగ్ కామెంట్స్

తెలుగు సినిమాల్లో వందల సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు నటి కవిత. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో విభిన్నమైన పాత్రలు చేసి ఆకట్టుకున్నారు. ఒకప్పుడు బిజీగా సినిమాలు చేసిన కవిత ఇప్పుడు సినిమాల స్పీడ్ తగ్గించారు. నటి కవిత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ఆయనంటే పిచ్చి.. ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకున్నా.. సీనియర్ నటి షాకింగ్ కామెంట్స్
Kavitha
Rajeev Rayala
|

Updated on: Apr 08, 2026 | 8:14 PM

Share

నటి కవిత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు కవిత. తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలోని ఎన్నో ఆసక్తికరమైన జ్ఞాపకాలను, అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల, ఆమె కెరీర్ సవాళ్లు, అవార్డులు, మరియు తోటి నటీనటులతో సంబంధాలు అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కవిత తాను సూపర్ స్టార్ కృష్ణ గారికి వీరాభిమానినని పేర్కొన్నారు. కృష్ణ గారి సినిమాలు చూసినప్పుడు, ఆయనలాంటి అందమైన, మంచి భర్త రావాలని తాను కోరుకున్నానని తెలిపారు. ఈ విషయాన్ని ఆమె ఒకానొక ఇంటర్వ్యూలో చెప్పగా, విజయనిర్మల గారు విన్నారట. విజయనిర్మల గారే స్వయంగా కవితను కృష్ణ గారి పక్కన హీరోయిన్‌గా అవకాశం ఇచ్చారట. అయితే, కృష్ణ గారి పట్ల తనకున్న అభిమానం కారణంగా, ఆయనతో ప్రేమ సన్నివేశాల్లో నటించేటప్పుడు చాలా బిగుసుగా ఉండిపోయేదాన్నని కవిత గుర్తు చేసుకున్నారు.

నాకు బ్రేకప్ అయ్యింది.. మా అమ్మకు కూడా అది తెలుసు.. షాకింగ్ విషయం చెప్పిన కృతిశెట్టి

విజయనిర్మల గారు ఆమెను కపితా అని సరదాగా పిలుస్తూ, “నీకు క్రష్ ఉంది కదా, పోయి లవ్ సీన్ చెయ్” అని ప్రోత్సహించేవారని వివరించారు. కృష్ణ గారితో పాటు ఆయనకు తనపై ఎంతటి అభిమానం ఉందో తెలిసేదని, ఆయన మితభాషి అయినప్పటికీ అద్భుతమైన వ్యక్తి అని కవిత ప్రశంసించారు. తన తల్లి ప్రోత్సాహంతో, అసభ్యకరమైన సన్నివేశాలకు దూరంగా, గౌరవప్రదమైన పాత్రలను మాత్రమే ఎంచుకునేవారని పేర్కొన్నారు. తన కెరీర్‌లో కొన్ని నిరాశలు ఉన్నప్పటికీ, అనేక విజయాలను సాధించినట్లు కవిత తెలిపారు. కె. రాఘవేంద్ర రావు , దాసరి నారాయణ రావు వంటి గొప్ప దర్శకుల సినిమాల్లో హీరోయిన్‌గా నటించలేకపోవడం తన ఏకైక నిరాశ అని చెప్పారు.

వార్ని..! ఈ నటుడి భార్య ఈమేనా..!! తెలుగులో చాలా పాపులర్ నటి కదా గురూ..!!

అయితే, తాను గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నానని, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సృష్టించుకున్నానని కవిత స్పష్టం చేశారు. తోటి నటీనటుల అసూయ గురించి అడిగినప్పుడు, తాను ఎదుర్కొన్న ఒక సంఘటనను వివరించారు. మలయాళంలో “రివాల్వర్ రాణి” సినిమా షూటింగ్ సమయంలో, తాను యంగ్ ఆర్టిస్ట్‌గా ఉండగా, సీనియర్ నటీమణులతో కలిసి పనిచేసినప్పుడు కాస్ట్యూమ్స్ విషయంలో విభేదాలు వచ్చాయని తెలిపారు. తన సొంత కాస్ట్యూమ్ డిజైనర్ సాయి గారు డిజైన్ చేసిన సంప్రదాయబద్ధమైన దుస్తులను ధరించగా, తోటి నటీమణులు అసభ్యకరమైన దుస్తులు ధరించారు. తన కాస్ట్యూమ్ మార్చమని వారు పట్టుబట్టగా, డైరెక్టర్ నిరాకరించారని. దీనితో ఆ నటీమణులు తనతో షూటింగ్ పూర్తయ్యే వరకు మాట్లాడలేదని కవిత పంచుకున్నారు.

ఇవి కూడా చదవండి

హీరో లేడు.. ఫైట్స్, స్పెషల్ సాంగ్స్ లేవు..! కట్ చేస్తే నాలుగేళ్లుగా ఓటీటీలో తిరుగులేని సినిమా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది
ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!
ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!
ఇడ్లీ, దోశకు కొత్త చట్నీ కావాలా?.. బెండకాయతో ఈ పచ్చడి చేసి చూడండి
ఇడ్లీ, దోశకు కొత్త చట్నీ కావాలా?.. బెండకాయతో ఈ పచ్చడి చేసి చూడండి
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. 
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. 
జస్ప్రీత్ బుమ్రా లేని లోటును తీర్చబోతున్న యంగ్ పేసర్
జస్ప్రీత్ బుమ్రా లేని లోటును తీర్చబోతున్న యంగ్ పేసర్
విపరీతంగా జుట్టు రాలుతోందా? కారణం ఈ విటమిన్ లోపమే కావచ్చు!
విపరీతంగా జుట్టు రాలుతోందా? కారణం ఈ విటమిన్ లోపమే కావచ్చు!