AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fuel Prices : ప్రజలకు బిగ్‌ అలర్ట్‌.. భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎప్పుడంటే?

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధి మూసివేత కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచలోని అనేక దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గమంటున్నాయి. మన దేశంలోనూ కొన్ని కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచేశాయ్ కాబట్టి ప్రస్తుతం దేశంలో ఎక్కడెక్కడా ఇందన ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Fuel Prices : ప్రజలకు బిగ్‌ అలర్ట్‌.. భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎప్పుడంటే?
India Fuel Prices
Anand T
|

Updated on: Apr 16, 2026 | 9:27 AM

Share

పశ్చిమాసియా యుద్ధంలో ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నప్పటికీ, భారత ప్రభుత్వం మాత్రం ఆ ప్రభావం సాధారణ వినియోగదారులపై పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. అంతర్జాతీయంగా పెరుగుతున్న ధరల భారం ప్రజలపై పడకుండా ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన IOCL, BPCL, HPCLలే ఈ భారాన్ని భరిస్తున్నాయి.ఈ నేపథ్యంలో OMCలకు కొంత ఉపశమనం కలిగించడానికి కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ. 10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. అయితే, ఈ తగ్గింపు ప్రయోజనాన్ని నేరుగా ప్రజలకు బదిలీ చేయకుండా, కంపెనీలు ఎదుర్కొంటున్న నష్టాలను భర్తీ చేయడానికి ఉపయోగిస్తున్నారు.

ప్రైవేట్ కంపెనీల రేట్ల పెంపు

అయితే ఈ మధ్య కాలంలో ప్రభుత్వ రంగ సంస్థలు ధరలను స్థిరంగా ఉంచినప్పటికీ, ప్రైవేట్ చమురు కంపెనీలు మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచాయి. ఏప్రిల్ 1న, షెల్ ఇండియా పెట్రోల్ ధరను లీటరుకు రూ. 7.41, డీజిల్ ధరను లీటరుకు రూ. 25.01 పెంచింది. అంతకుముందు, నయారా పెట్రోల్ ధరను లీటరుకు రూ. 5, డీజిల్ ధరను లీటరుకు రూ. 3 పెంచింది.

అంతర్జాతీయంగా ముడిచమురు ధర బ్యారెల్‌కు 120 డాలర్ల వరకు చేరడంతో ప్రభుత్వ రంగ సంస్థలు ప్రతిరోజూ భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. సుంకాల తగ్గింపు కంటే ముందు రోజుకు రూ. 2,400 కోట్ల నష్టం ఉండగా, ప్రస్తుతం అది రూ. 1,600 కోట్లకు తగ్గింది. ప్రీమియం ఇంధనం ధరలను ఇప్పటికే పెంచినప్పటికీ, సాధారణ ఇంధన ధరల విషయంలో ఎన్నికల తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

రాబోయే రోజుల్లో పెరిగే అవకాశం

అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరిగినప్పటికీ ఆ భారం ప్రజలపై పడకుండా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రస్తుతానికి సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగిస్తున్నప్పటికీ, అంతర్జాతీయ పరిణామాలు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ధరల పెంపు తప్పకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

పెట్రోల్ ధరలు

దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరలు హైదరాబాద్ లీటర్ పెట్రోల్ ధర రూ.107.45, ముంబైలో రూ. 103.49, కోల్‌కతా రూ. 104.99, బెంగళూరులో రూ. 102.90, చెన్నైలో రూ. 100.79, దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల ధర రూ. 94.77గా ఉంది.

డీజిల్ ధరలు

ఇక దేశవ్యాప్తంగా డీజిల్ ధరలు చూసుకుంటే దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ. 87.67గా ఉండగా, ముంబైలో రూ. 90.03, కోల్‌కతాలో రూ. 92.02, చెన్నైలో రూ. 92.48, హైదరాబాద్‌లో రూ. 95.70, బెంగళూరులో రూ. 90.99గా ఉన్నాయి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us