AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OYO: గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ఓయో వెళ్లినప్పుడు పోలీస్ రైడ్ జరిగితే.! ఈ ఒక్క మాట చెప్పండి మీ జోలికి రారు

ఇప్పుడున్న జనరేషన్‌లో మ్యారేజ్ కాకుండానే ఓయో రూమ్స్‌కు వెళ్తుండటం మనం చూస్తూనే ఉన్నాం. అయితే పెళ్లి కాకుండానే గర్ల్ ఫ్రెండ్‌తో ఓయోకు వెళ్తే.. అప్పుడు పోలీసులు పట్టుకుంటే పరిస్థితి ఏంటని చాలామందిలో భయాలు ఉన్నాయి. అసలు చట్టం ఏం చెబుతోంది.. ఆ వివరాలు ఇలా..

OYO: గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ఓయో వెళ్లినప్పుడు పోలీస్ రైడ్ జరిగితే.! ఈ ఒక్క మాట చెప్పండి మీ జోలికి రారు
Oyo Room
Ravi Kiran
|

Updated on: Apr 16, 2026 | 9:25 AM

Share

భారత రాజ్యాంగం, చట్టం ప్రకారం అవివాహిత జంటలకు కొన్ని ప్రత్యేక హక్కులు ఉన్నాయి. అవేంటో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. దేశంలో ఏ చట్టం కూడా అవివాహిత జంటలు హోటల్ గదుల్లో ఉండకూడదని చెప్పలేదు. ఇద్దరు వ్యక్తులు మేజర్లు (అంటే 18 ఏళ్లు పైబడినవారు) అయ్యి, పరస్పర అంగీకారంతో హోటల్ గదిని అద్దెకు తీసుకుంటే అది చట్టవిరుద్ధం కాదు. భారత అత్యున్నత న్యాయస్థానం కూడా వ్యక్తుల గోప్యత, స్వేచ్ఛను గౌరవించాలని స్పష్టం చేసింది. హోటల్ గదిని బుక్ చేసుకోవడం అనేది పౌరుల వ్యక్తిగత హక్కు.

గుర్తింపు కార్డులు, వయస్సు పరిమితి

హోటల్‌లో గదిని బుక్ చేసేందుకు కొన్ని ప్రాథమిక నిబంధనలు పాటించడం తప్పనిసరి. బుక్ చేసిన ఇద్దరూ తప్పనిసరిగా 18 ఏళ్లు నిండిన వారై ఉండాలి. అది రుజువు చేసేందుకు ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి లేదా పాన్ కార్డ్ లాంటి ప్రభుత్వ గుర్తింపు కార్డులను సమర్పించాల్సి ఉంటుంది. చాలా హోటళ్లు స్థానిక నివాసితులకు గదులు ఇవ్వడానికి నిరాకరిస్తుంటాయి. కానీ ఇది కేవలం హోటల్ అంతర్గత పాలసీ మాత్రమే తప్ప చట్టం కాదు.

పోలీసుల తనిఖీలు, వేధింపులు

హోటల్ గదులపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి జంటలను ఇబ్బంది పెట్టే అధికారం చట్టపరంగా లేదు. ఒకవేళ ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని పక్కా సమాచారం ఉంటే తప్ప, కేవలం జంటలు ఉన్నారనే కారణంతో పోలీసులు వారిని ప్రశ్నించలేరు. ఒకవేళ పోలీసులు వేధింపులకు పాల్పడితే, మీరు మీ హక్కులను గుర్తు చేయవచ్చు. అనవసరంగా భయపడటం వల్ల నిందితులుగా ముద్ర పడే అవకాశం ఉంటుంది, కాబట్టి చట్టం పట్ల అవగాహన కలిగి ఉండటం ముఖ్యం. అవివాహిత జంటలు గదులు బుక్ చేసుకునేటప్పుడు ‘కపుల్ ఫ్రెండ్లీ’ హోటళ్లను ఎంచుకోవడం ఉత్తమం. ఓయో లాంటి వాటిల్లో ఈ సదుపాయం ఉంటుంది. గదిలోకి వెళ్లే ముందు అక్కడ సిసిటివి కెమెరాలు లేదా రహస్య కెమెరాలు లేవని నిర్ధారించుకోవడం భద్రత దృష్ట్యా చాలా అవసరం. మీ గోప్యతను కాపాడుకోవడం మీ బాధ్యత కూడా. చట్టం మీకు రక్షణ కల్పిస్తుంది.

ఇది చదవండి: ఒక బ్యాడ్ న్యూస్.. రెండు గుడ్ న్యూస్‌లు.! హైదరాబాద్ ఊపిరి పీల్చుకో.. కాటేరమ్మ కొడుకు వచ్చేస్తున్నాడు..

Follow Us