US-Israel Vs Iran War: దుబాయ్ ఎయిర్ పోర్ట్ పై మరోసారి ఇరాన్ డ్రోన్ దాడి
దుబాయ్, అబుదాబి ఎయిర్‌పోర్ట్‌లపై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. దీంతో దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో దట్టమైన పొగ కమ్ముకుని విమానాల రాకపోకలకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది. ఇరాన్ డ్రోన్‌లను గాల్లోనే పేల్చివేసినట్లు దుబాయ్ రక్షణ శాఖ ప్రకటించింది. ఈ పరిణామాల మధ్య గల్ఫ్ దేశాల నుండి భారతీయుల తరలింపు కొనసాగుతోంది.
మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను ఇరాన్ మరోసారి టార్గెట్ చేసింది. డ్రోన్లు, మిస్సైళ్లతో దాడి చేయడంతో ఎయిర్‌పోర్ట్ పరిసరాల్లో దట్టమైన పొగ వ్యాపించింది. ఈ ఘటనతో తాత్కాలికంగా విమానాల రాకపోకలను నిలిపివేశారు, కొన్ని విమానాలను దారి మళ్లించారు. ఆపరేషన్లు కొంత సమయం పాటు నిలిచిపోయాయి. దుబాయ్ రక్షణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, ఇరాన్ డ్రోన్‌లను గాల్లోనే పేల్చివేశారు. ఈ దాడుల వెనుక అమెరికా, ఇజ్రాయెల్ బలగాలే తమ లక్ష్యమని ఇరాన్ స్పష్టం చేసింది. ప్రస్తుతం దుబాయ్ ఎయిర్‌పోర్ట్ నుండి విమాన సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
CM Revanth Reddy: మహిళల భద్రతే మాకు ముఖ్యం
Vijay Divorce Case: విజయ్‌పై మరో పిటిషన్ వేసిన భార్య సంగీత
Andhra Pradesh: స్కూల్ పిల్లలకు చెప్పుల దండ వేసిన టీచర్
US-Israel Vs Iran War: యుద్ధంలో ఇరాన్ కు ఇదే అతిపెద్ద విజయవంతమైన దాడి
Tirumala: తిరుమలలో ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. కారణం ఇదే
గాల్లో ఉండగా విమానంలో భారీ కుదుపులు.. ప్రయాణికుల హాహాకారాలు
కనలేక కొనేస్తున్న దంపతులు.. అడ్డగోలుగా అమ్మేస్తున్న దళారులు
పైకి.. కిట్ కాట్ చాక్లెట్ ప్యాకెట్.. ఓపెన్ చేస్తే..
కదులుతున్న రైలు నుంచి దూకేసిన ప్రయాణికులు.. ఏం జరిగిందో తెలుసా!
ప్రపంచంలోనే ధనిక గ్రామం.. భారత్‌లోనే...!
వానలో ఈ చెట్టు కింద నిల్చుంటే చావు ఖాయం!
ఇందూరు నయాగర జలపాతం ఎప్పుడైనా చూశారా?

