సస్పెండ్ అయిన ఉద్యోగి ఇంట్లో ఏసీబీ సోదాలు.. వణికిపోతున్న తోటి ఉద్యోగులు
బాపట్ల జిల్లా చీరాల మండలం పేరాలలో గిద్దలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేసి ప్రస్తుతం సస్పెన్షన్‌లో కొనసాగుతున్న కృష్ణమోహన్ రావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. గత ఏడాది జూలై నెలలో భూ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో 35 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన అనంతరం ఆయనను సస్పెండ్ చేశారు.

బాపట్ల జిల్లా చీరాల మండలం పేరాలలో గిద్దలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేసి ప్రస్తుతం సస్పెన్షన్‌లో కొనసాగుతున్న కృష్ణమోహన్ రావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. గత ఏడాది జూలై నెలలో భూ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో 35 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన అనంతరం ఆయనను సస్పెండ్ చేశారు. ఈ విచారణ క్రమంలో అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారనే అనుమానంతో ఈ సోదాలు చేపట్టారు.
ఒంగోలు ఏసీబీ అధికారులు పేరాలలోని కృష్ణమోహన్ రావు నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా చీరాల పరిసర ప్రాంతాలతో పాటు కడవకుదురు ప్రాంతంలో ఉన్న ఆయన బంధువుల ఇళ్లలో కూడా ఏసీబీ బృందాలు తనిఖీలు చేపట్టాయి. ఆస్తులకు సంబంధించిన పత్రాలు, బ్యాంకు లాకర్లలో ఉన్న డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు. అలాగే వాహనాలకు సంబంధించిన పత్రాలను కూడా అధికారులు తనిఖీ చేపట్టారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
