- Telugu News Photo Gallery Cinema photos Know This Actress Who Has Only 2 Hits In Telugu, Now She Is Social Media Crazy Beauty Ruhani Sharma
Actress : జిమ్‍లో చెమటలు చిందిస్తోన్న ముద్దుగుమ్మ.. హిట్లు వచ్చినా రానీ స్టార్ బ్రేక్.. ఇప్పుడు ఇలా..
ఒక్క సినిమాతోనే కుర్రాళ్ల హృదయాలు దొచేసింది ఈ హీరోయిన్. ఇప్పటివరకు ఆరు సినిమాలు చేస్తే అందులో కేవలం రెండే హిట్టయ్యాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వరుస పోస్టులతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది ఈ వయ్యారి. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. ? ఇప్పుడు జిమ్ లో ఎక్కువగా వర్కవుట్స్ చేస్తూ చెమటలు చిందిస్తున్న ఈ బ్యూటీకి తెలుగులో మంచి క్రేజ్ ఉంది.
Updated on: Aug 12, 2025 | 5:57 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. కానీ వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ సక్సెస్ మాత్రం అందుకోలేకపోతుంది. తెలుగులో నటిస్తూనే అటు బాలీవుడ్, ఇటు కోలీవుడ్ ఇండస్ట్రీలలోనూ అవకాశాలు అందుకుంటుంది. తెలుగులో ఎనిమిది సినిమాలు చేసింది.

మొత్తం ఎనిమిది సినిమాలు చేస్తే.. అందులో రెండు మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి. కెరీర్ మొదట్లో హోమ్లీ లుక్ లో కనిపించిన ఈ చిన్నది.. ఇప్పుడు మాత్రం గ్లామర్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తుంది. ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ సొంతం చేసుకుంది.

కానీ ఈ బ్యూటీకి తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. ప్రస్తుతం జిమ్ లో వర్కవుట్లతో చెమటలు చిందిస్తోంది. తాజాగా ఈ అమ్మడు జిమ్ వర్కవుట్ ఫోటోస్, వీడియోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో మీరు గుర్తుపట్టారా.. ?

తనే హీరోయిన్ రుహానీ శర్మ. చిలసౌ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఫస్ట్ మూవీతోనే కుర్రాళ్ల హృదయాలు దొచేసింది. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో నటించినప్పటికీ అంతగా క్రేజ్ మాత్రం రాలేదు. డర్టీ హరి, నూటొక్క జిల్లాల అందగాడు, హర్ , సైంధవ్ చిత్రాల్లో నటించింది.

ఆమె నటించిన చిత్రాల్లో చిలసౌ, హిట్ మాత్రమే విజయాన్ని అందుకున్నాయి. అయితే తెలుగులో ఈ బ్యూటీకి అంతగా అవకాశాలు రాలేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో అందాలతో పిచ్చెక్కిస్తోంది. తాజాగా ఈ అమ్మడు క్రేజీ ఫోటోస్ నెట్టింట తెగ ఆకట్టుకుంటున్నాయి.




