AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor: అన్నపూర్ణ స్టూడియో 50 ఏళ్ళు.. శంకుస్థాపన చేస్తోన్న చిన్నోడు ఎవరో తెలుసా..?

తెలుగు సినిమా అభివృద్ధి కోసం హైదరాబాద్ లో మొట్ట మొదటిగా ఏర్పాటు చేసిన సంస్థ అన్నపూర్ణ స్టూడియో. అక్కినేని నాగేశ్వరరావు ముందడుగుతో జూబ్లీహిల్స్ బీడు ప్రాంతంలో 1975 ఆగస్టు, 13న అన్నపూర్ణ స్టూడియో కోసం పునాది రాయి వేశారు. ఈ స్టూడియో మొదలయి నేటికి 50 ఏళ్లు. ఈ సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ కోన్ని ఫోటోస్ షేర్ చేసింది. అందులో శంకుస్థాపన రాయి వేస్తున్న కుర్రాడు ఎవరో తెలుసా.. ?

Actor: అన్నపూర్ణ స్టూడియో 50 ఏళ్ళు.. శంకుస్థాపన చేస్తోన్న చిన్నోడు ఎవరో తెలుసా..?
Annapurna Studios
Rajitha Chanti
|

Updated on: Aug 13, 2025 | 7:02 PM

Share

ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా ఉన్న టాలీవుడ్ సినిమా పరిశ్రమ ఒకప్పుడు చెన్నైలో ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ తరలివచ్చింది తెలుగు సినిమా. కానీ అప్పటికీ భాగ్యనగరంలో ఎలాంటి సినిమా సదుపాయాలు అందుబాటులో లేవు. అలాంటి సమయంలో తెలుగు సినిమా అభివృద్ధి కోసం అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణ స్టూడియోస్ కోసం పునాది వేశారు. టాలీవుడ్ కోసం భాగ్యనగరంలో మొట్ట మొదటి రాయి వేసింది ఏఎన్ఆర్. 1975 ఆగస్ట్ 13న ఈ సంస్థ కోసం శంకుస్థాపన జరిగింది. ఈ అన్నపూర్ణ స్టూడియోస్ మొదలయి నేటికి 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ షేర్ చేసిన కొన్ని ఫోటోస్ ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

ఇవి కూడా చదవండి : Cinema : ఏం సినిమా రా బాబూ.. 9 ఏళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తోన్న సినిమా.. ఇప్పటికీ ఓటీటీలో సెన్సేషన్..

ఇవి కూడా చదవండి

పైన ఫోటోను చూశారు కదా.. అందులో దాదాపు 50 ఏళ్ల క్రితం అన్నపూర్ణ స్టూడియోను ఏఎన్నార్ సతీమణి తమ మనవడిని ఎత్తుకుని శంకుస్థాపనం చేశారు. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరో తెలుసా.. ? అతడు మరెవరో కాదండి.. టాలీవుడ్ హీరో సుమంత్. ప్రస్తుతం ఎన్నో సినిమాల షూటింగ్స్, ప్రోస్ట్ ప్రొడక్షన్స్ ఆ స్టూడియోలోనే జరుగుతున్నాయి. అంతేకాదు.. సినిమాలు, టీవీ సీరియల్స్, రియాల్టీ షోల షూటింగ్స్ సైతం అక్కడే జరుగుతున్నాయి. ఇప్పటివరకు దాదాపు వెయ్యి మందికి పైగా ఉపాది కల్పిస్తుంది ఈ స్టూడియో.

ఇవి కూడా చదవండి : Cinema: థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఇప్పుడు ఓటీటీని శాసిస్తోన్న సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..

ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియో స్థాపించి 50 సంవత్సరాలు పూర్తయ్యింది. ఒకప్పుడు బీడు భూమిగా ఉన్న ఈ ప్రాంతం.. ఇప్పుడు భారతీయ సినిమాలోని అత్యంత సృజనాత్మక కేంద్రాలలో ఒకటిగా మారింది. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రయాణం ఒక కల నుంచి ప్రారంభమై.. ఎందరి కలలకో వారధిగా మారింది.

ఇవి కూడా చదవండి : Cinema : 4 ఏళ్లుగా ఓటీటీని శాసిస్తున్న మహేష్ బాబు సినిమా.. 75 కోట్లు పెడితే రూ.214 కోట్లు కలెక్షన్స్..

ఇవి కూడా చదవండి : Arundhathi: కొరియోగ్రాఫర్‏ను పెళ్లి చేసుకోబోతున్న అరుంధతి చైల్డ్ ఆర్టిస్ట్.. ఫ్రెండ్స్‏తో బ్యాచిలర్ పార్టీ..