AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సత్రం తిండి.. మఠం నిద్ర...! ఎలా ఉండేది?.. ఎలా అయిపోయిందో?

సత్రం తిండి.. మఠం నిద్ర…! ఎలా ఉండేది?.. ఎలా అయిపోయిందో?

Phani CH
|

Updated on: Aug 13, 2025 | 7:19 PM

Share

గతంలో సిల్వర్ స్క్రీన్ పై స్టార్స్ గా కనిపించిన నటీమణుల్లో కొందరు ఇప్పుడు ఆధ్యాత్మిక యాత్ర బాట పడుతున్నారు. సెలబ్రెటీ హాదా, లగ్జరీ లైఫ్ ను విడిచి పెట్టి ప్రశాంతత కోసం కాషాయం కట్టేస్తున్నారు. బర్ఖా మదన్, సోఫియా హయత్, గ్రేసీ సింగ్.. ఇలా ఎందరో ఒకనాటి అందాల తారలు సాధ్విలుగా మారి సింపుల్ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. తాజాగా, అదే బాటలో పయనిస్తోంది నుపుర్ అలంకార్.

గతంలో వెండితెర, బుల్లితెరపై స్టార్ నటిగా రాణించిన నుపుర్.. సన్యాసినిగా మారి దేవాలయాల వద్ద భిక్షాటన చేస్తున్నారు. ఆమె భిక్షాటన వీడియో, ఫోటోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నుపుర్ అలంకార్..! పేరు చెబితే గుర్తు పట్టకపోవచ్చు కానీ.. ఒకప్పడు టీవీ సీరియల్స్‌లో నంబర్ వన్ షోగా నిలిచిన శక్తిమాన్ సీరియల్ లోని కామిని పాత్ర పోషించిన నటి అంటే.. గుర్తుపట్టని వారుండరు. ఇదే కాదు , ఘర్ కీ లక్ష్మీ బేటియా, తంత్ర వంటి టీవీ సీరియల్స్ లో నటించి మెప్పించిన నుపుర్.. సినిమాల్లోనూ నటించి అలరించింది. అయితే 2022లో ఆమె నటజీవితానికి స్వస్తి చెప్పి.. ఆధ్యాత్మిక మార్గంలోకి మారింది. కాషాయం కట్టి.. సన్యాసినిలా జీవించటం వల్ల తన జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయని.. ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తాను అన్ని కోరికలను త్యజించి సన్యాసినిగా మారాలని నిర్ణయించుకున్నప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారని ఆమె వెల్లడించింది. మనసును పరమాత్మ మీద లగ్నం చేసి.. అత్యంత సాధారణ జీవితాన్ని గడుపుతున్నానని తెలిపింది. తీర్థయాత్రలు, ధ్యానం, జపంతో తన రోజువారీ జీవితం గడిచిపోతోందని ఆమె తెలిపారు. టీవీ, సినిమా ఇండస్ట్రీలో అన్నీ అనుభవించానని, ఎన్నో విజయాలు సాధించానని, కలవాలనుకున్న ప్రతి ఒక్కరినీ కలిశానని చెప్పుకొచ్చింది. ఇక.. మిగిలిన జీవితాన్ని ధ్యానంలో గడుపుతూ అన్ని బంధాలకు అతీతంగా జీవిస్తున్నట్లు వివరించింది. సాధ్విగా మారిన తర్వాత మీ రోజవారీ ఖర్చుకు డబ్బు ఎలా ? అని అడగగా, భిక్షాటన చేస్తున్నట్లు చెప్పి షాకిచ్చింది. తనకు వచ్చిన మొత్తంలో కొంత భగవంతునికి సమర్పించి.. తనకు అవసరమైనది మాత్రం వాడుకుంటానని నుపుర్ వెల్లడించింది. గుహలలో, అడవులలో, ఎత్తైన పర్వతాలలోనూ ధ్యానం చేయటమే గాక.. గడ్డకట్టే చలిలోనూ రోజుల తరబడి గడిపినట్లు తెలిపింది. తీవ్రమైన తపస్సు వల్ల తన శరీరం బలహీనపడిందంటూ చెప్పారు. ప్రజలకు ఆధ్యాత్మికత గురించి మార్గనిర్దేశం చేయడమే ప్రస్తుతం తన పని అంటోంది నుపుర్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై ఇదేం పని ?? మీరు మారారా ??

దయగా ఉంటే చాలు దెయ్యాలను పూజించినా డోంట్ కేర్.. ఆకట్టుకుంటున్న టూలెట్‌ ప్రకటన

అమ్మ బాబోయ్‌.. 4.5 km పొడవైన రైలును చూసారా?

విమర్శల ధాటికి వివరణ ఇచ్చుకున్న హీరోయిన్

బిగ్‌ బాస్‌లోకి పహల్గామ్ ఉగ్రదాడి బాధితురాలు