రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై ఇదేం పని ?? మీరు మారారా ??
సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలని జనాలు తెగ రీల్స్ చేస్తూ నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. అంతవరకూ ఓకే.. కానీ ఈ రీల్స్ చేసే క్రమంలో ఇతరులకు ఇబ్బంది కలుగుతుందనే విషయం పట్టించుకోకుండా ఇష్టారీతిన ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో రైల్వే ప్లాట్‌ఫారంపై రీల్స్ చేస్తున్న యువతికి ఓ వ్యక్తి ఊహించని షాకిచ్చాడు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో, రైలు దిగగానే స్టేషన్‌లో రీల్ చేస్తూ.. ఒక అమ్మాయి డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. ఇంకా ప్రయాణికులు రైలు దిగుతున్నారు… పక్కనే ఇద్దరు వ్యక్తులు నిలబడి ఏదో మాట్లాడుకుంటున్నారు. వారిలో ఓ వ్యక్తి డాన్స్ చేస్తున్న యువతిని కోపంగా ముందుకి నెట్టేశాడు. దీంతో ఒక్కసారిగా అక్కడ వాతావరణం వేడెక్కింది. ఆ అమ్మాయి కోపంగా ఆ వ్యక్తిని గట్టిగా నిలదీసింది. అందుకు ఆ వ్యక్తి.. ఇది తమాషా చేయడానికి సరైన ప్రదేశమా? అంటూ మరింత కోపంగా మాట్లాడాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అక్కడే ఉన్న ఇతర వ్యక్తులు వారిని శాంతింపచేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. యువతి తనను నెట్టిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించింది. ఇంతలో అక్కడే రైలు దిగుతున్న మరో మహిళ విషయం అర్థం చేసుకుని జోక్యం చేసుకుంది. ఆమె ఆ వ్యక్తితో ఆ అమ్మాయిని నెట్టి ఉండకూడదని, ఇద్దరికి సర్ది చెప్పింది. చివరికి ఆ వ్యక్తి తన తప్పును గ్రహించి ఆ అమ్మాయికి క్షమాపణ చెప్పి వెళ్లిపోయాడు. ఈ వీడియోను ఓ యూజర్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఇప్పటి వరకూ ఈ వీడియోను 4 లక్షల మందికి పైగా వీక్షించారు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఒక వినియోగదారుడు మామ ధైర్యానికి నేను సెల్యూట్ చేస్తున్నాను అని రాశారు. మరొకరు మామ నెట్టడం కంటే తెలివిగా మాట్లాడి ఉండాల్సిందని రాశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దయగా ఉంటే చాలు దెయ్యాలను పూజించినా డోంట్ కేర్.. ఆకట్టుకుంటున్న టూలెట్ ప్రకటన
అమ్మ బాబోయ్.. 4.5 km పొడవైన రైలును చూసారా?
విమర్శల ధాటికి వివరణ ఇచ్చుకున్న హీరోయిన్
అడవిలో చరిత్ర ఆనవాళ్లు
హుండీ దొంగ అడ్డంగా బుక్
వారెవ్వా.. తొలిరోజే మత్స్యకారులకు జాక్‌పాట్.. ఒకే సారి
రాత్రివేళ ఒంటరిగా క్యాబ్‌లో యువతి ప్రయాణం! ఆ డ్రైవర్ చేసిన పనికి
బ్లాక్ మిల్క్.. ప్రకృతి వింత! ఆశ్చర్యపరిచే శాస్త్రీయ నిజం
భూకంపాలకు చెక్కుచెదరని పిరమిడ్ల సీక్రెట్ ఇది!
ఇంట్లో కూలర్ ఆన్ చేస్తున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూడండి!

