AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sir Madam Movie: ఓటీటీలోకి వస్తోన్న సార్ మేడమ్.. విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ మూవీ ఎక్కడ చూడొచ్చంటే..

తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు, తమిళం, హిందీ భాషలలో వరుస సినిమాల్లో నటిస్తూ తనదైన ముద్ర వేశారు. ప్రస్తుతం తమిళంలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటిస్తున్నారు. ఇటీవలే సార్ మేడమ్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చారు. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పిక్స్ అయ్యింది.

Sir Madam Movie: ఓటీటీలోకి వస్తోన్న సార్ మేడమ్.. విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ మూవీ ఎక్కడ చూడొచ్చంటే..
Sir Madam Movie
Rajitha Chanti
|

Updated on: Aug 15, 2025 | 2:31 PM

Share

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతికి సినిమాలకు ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. తెలుగు, తమిళం, హిందీ భాషలలో పలు చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవలే ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా తలైవన్ తలైవి. ఈ చిత్రాన్ని తెలుగులో సార్ మేడమ్ పేరుతో డబ్ చేసి విడుదల చేశారు. ఇందులో నిత్యా మీనన్ కథానాయకగా నటించింది. తమిళంలో జూలై 25న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆగస్ట్ 1న తెలుగులో రిలీజ్ చేసారు. కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాకు అన్ని వర్గాల అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయ్యింది.

ఇవి కూడా చదవండి: Actress : ఈ క్రేజ్ ఏంట్రా బాబూ.. 40 ఏళ్లు దాటిన తగ్గని జోరు.. 50 సెకండ్స్ కోసం 5 కోట్లు రెమ్యునరేషన్..

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా ఆగస్ట్ 22 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో ఈ మూవీ అందుబాటులోకి రానుంది. ఈ సందర్భంగా సార్ మేడమ్ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు పాండిరాజ్ దర్శకత్వం వహించగా.. టీజీ త్యాగరాజన్ సమర్పణలో సత్య జ్యోతి ఫిలిమ్స్ బ్యానర్ పై సెంథిల్ త్యాగరాజన్ నిర్మించారు.

ఇవి కూడా చదవండి: అరాచకం భయ్యా.. వయ్యారాలతో గత్తరలేపుతున్న సీరియల్ బ్యూటీ..

కథ విషయానికి వస్తే..

ఈ సినిమాలో విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ భార్యభర్తలుగా నటించారు. పెళ్లైన మొదట్లో ఎంతో అన్యోన్యంగా ఉన్న వీరిద్దరు ఆ తర్వాత ప్రతి విషయానికి చిరాకు, గొడవలు పడడం జరుగుతుంది. దీంతో వారి వైవాహిక జీవితంతోపాటు బిజినెస్ సైతం ప్రమాదంలో పడిపోతుంది. ఆ తర్వాత ఏమైంది..? అనేది కథ.

ఇవి కూడా చదవండి: Dulquer Salman: ఆ హీరోయిన్ అంటే పిచ్చి ఇష్టం.. ఎప్పటికైనా ఆమెతో నటించాలనే కోరిక.. దుల్కర్ సల్మాన్..

ఇవి కూడా చదవండి: Actor: అన్నపూర్ణ స్టూడియో 50 ఏళ్ళు.. శంకుస్థాపన చేస్తోన్న చిన్నోడు ఎవరో తెలుసా..?

Follow Us
ప్రతీ శనివారం బ్యాంక్‌లకు హాలీడే..? కేంద్రం క్లారిటీ ఇదే..
ప్రతీ శనివారం బ్యాంక్‌లకు హాలీడే..? కేంద్రం క్లారిటీ ఇదే..
నీ దారికి నువ్వే వెలుగవ్వాలి.. మీ జీవితాన్ని మార్చే బుద్ధుడి కథ!
నీ దారికి నువ్వే వెలుగవ్వాలి.. మీ జీవితాన్ని మార్చే బుద్ధుడి కథ!
వ్యక్తి చనిపోయిన తర్వాత ఆధార్ కార్డును ఏం చేయాలి?
వ్యక్తి చనిపోయిన తర్వాత ఆధార్ కార్డును ఏం చేయాలి?
రూపాయి నాణెం తయారీకి ఎంత ఖర్చువుతందంటే..? ప్రభుత్వ లెక్కలివే..
రూపాయి నాణెం తయారీకి ఎంత ఖర్చువుతందంటే..? ప్రభుత్వ లెక్కలివే..
రెడ్ రైస్ ప్రయోజనాలు తెలిస్తే ఇక తెల్లన్నం మానేస్తారు!
రెడ్ రైస్ ప్రయోజనాలు తెలిస్తే ఇక తెల్లన్నం మానేస్తారు!
ఈ స్కూల్ అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్
ఈ స్కూల్ అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్
ఉడికించిన గుడ్లు బయట పెడుతున్నారా? ఈ టైమ్ దాటితే తినకండి!
ఉడికించిన గుడ్లు బయట పెడుతున్నారా? ఈ టైమ్ దాటితే తినకండి!
Video: చీర కొంగును ఇంజిన్‌కు కట్టి .. ట్రైన్ ముందు మహిళ డ్యాన్స్!
Video: చీర కొంగును ఇంజిన్‌కు కట్టి .. ట్రైన్ ముందు మహిళ డ్యాన్స్!
ఉల్లిపాయ, టమాటాలు ఇంట్లో ఉన్నాయా?.. అదిరిపోయే చట్నీ రెసిపీ
ఉల్లిపాయ, టమాటాలు ఇంట్లో ఉన్నాయా?.. అదిరిపోయే చట్నీ రెసిపీ
ట్రైన్‌లోకి పాములతో ఎంట్రీ ఇచ్చిన ఆరుగురు వ్యక్తులు.. కట్‌చేస్తే.
ట్రైన్‌లోకి పాములతో ఎంట్రీ ఇచ్చిన ఆరుగురు వ్యక్తులు.. కట్‌చేస్తే.