AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 9: సాఫ్ట్ వేర్‌ టు బిగ్ బాస్ హౌస్.. అగ్ని పరీక్షలో తెలంగాణ అమ్మాయి వైరల్.. ఇంతకీ ఎవరీ అనూష?

ఈసారి బిగ్ బాస్ లో సెలబ్రిటీలతో పాటు సామాన్యులను కంటెస్టెంట్లుగా తీసుకోనున్నారు. ఇందుకోసం నిర్వహించిన 'అగ్నిపరీక్ష'లో మొత్తం 15 మందిని ఎంపిక చేశారు. అందులో తెలంగాణకు చెందిన అనూషా రత్నం ఒకరు. మరి ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలుసుకుందాం రండి.

Bigg Boss Telugu 9: సాఫ్ట్ వేర్‌ టు బిగ్ బాస్ హౌస్.. అగ్ని పరీక్షలో తెలంగాణ అమ్మాయి వైరల్.. ఇంతకీ ఎవరీ అనూష?
Bigg Boss Telugu 9
Basha Shek
|

Updated on: Aug 16, 2025 | 10:21 PM

Share

బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న బిగ్ బాస్ తెలుగు కొత్త సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకున్న రియాలిటీ షో తొమ్మిదో సీజన్ త్వరలోనే షూరూ కానుంది. సెప్టెంబర్ 07 లేదా సెప్టెంబర్ 15న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఈసారి హౌస్ లోకి  అడుగు పెట్టే కంటెస్టెంట్ల ఎంపిక విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటోంది బిగ్ బాస్ యాజమాన్యం. అందులో భాగంగానే ఈసారి ఇంటిలోకి సామాన్యులకు ప్రవేశం కల్పించడం కోసం ‘బిగ్ బాస్ అగ్నిపరీక్ష’  నిర్వహిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో లీక్ అవుతున్నాయి. అలా బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఎక్కువగా వినిపిస్తోన్న పేరు అనూషా రత్నం. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో తెలుసా? ఆమెది మన తెలంగాణే. వరంగల్ లోనే పుట్టి పెరిగింది. ఎమ్మెస్సీ పూర్తి చేసిన ఆమె ఒక ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో చేరింది. సుమారు ఐదేళ్ల పాటు ఈ రంగంలోనే పని చేసింది. అయితే ఆ తర్వాత జాబ్ నుంచి బయటకు వచ్చి సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా మారిపోయింది.  అప్పటి నుంచి ఆమెకు పేరుకు పేరు, డబ్బుకు డబ్బు వచ్చాయి. ప్రస్తుతం ఇన్‌స్టా గ్రామ్ లో అనూషకు సుమారు 280k ఫాలోవర్లు ఉన్నారు. కాగా సినిమా సెలబ్రిటీలతో నూ అనూషకు మంచి సంబంధాలు ఉన్నాయి. గతంలో గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ నుంచి ఒక మెసేజ్ వచ్చిందని అనూష పేర్కొన్నారు. రఘు కుంచె తనకు సపోర్ట్ చేశారని, వీడియోస్ బావున్నాయని చెబుతూ ఉంటారని అనూష పేర్కొంది.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనూష అప్పుడప్పుడు కొన్ని సినిమా ఈవెంట్స్‌కు కూడా వస్తుంటుంది.  యాంకరింగ్ కూడా చేస్తుంటుంది. ఇటీవల ‘వర్జిన్ బాయ్స్’ సినిమా ఈవెంట్ కు అనూష హాజరైంది.  అలాగే న్యాచురల్ స్టార్ నాని హిట్ 3, విజయ్ ఆంటోని మార్గన్ సినిమా రిలీజ్ ల సమయంలో ఆయా హీరలతో కలిసి కొన్ని ఆసక్తికర వీడియోలు కూడా చేసింది.

అనూష రత్నం లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ వీడియోలు..

View this post on Instagram

A post shared by Anusha Ratnam (@anu__uuu)

View this post on Instagram

A post shared by Anusha Ratnam (@anu__uuu)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం