AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ చిన్ని కృష్ణుడు, గోపికలు ఎవరో తెలుసా? 16 కోట్లతో 400 కోట్లు రాబట్టిన ఆ స్టార్ హీరో పిల్లలు

శనివారం (ఆగస్టు 16) శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సామాన్యులతో పాటు సెలబ్రిటీలు తమ పిల్లలను శ్రీకృష్ణుడు, గోపికలుగా ముస్తాబు చేశారు. అలా ఓ స్టార్ హీరో దంపతులు కూడా తమ పిల్లలను కృష్ణుడు, గోపికలుగా అంందంగా రెడీ చేశారు.

Tollywood: ఈ చిన్ని కృష్ణుడు, గోపికలు ఎవరో తెలుసా? 16 కోట్లతో 400 కోట్లు రాబట్టిన ఆ స్టార్ హీరో పిల్లలు
Krishnashtami Special
Basha Shek
| Edited By: |

Updated on: Aug 18, 2025 | 11:43 AM

Share

దేశ వ్యాప్తంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం (ఆగస్టు 16) చాలా మంది తల్లి దండ్రులు తమ బిడ్డలను చిన్ని కృష్ణులుగా, గోపికలుగా ముస్తాబు చేశారు. అనంతరం ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి మురిసిపోయారు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగమయ్యారు. తమ పిల్లలను చిన్ని కృష్ణుడు, గోపికలుగా రెడీ చేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తారు. దీంతో ఆ ఫొటోలు నెట్టింట బాగా వైరలయ్యాయి. పై ఫొటో కూడా అదే. అందులో క్యూట్ గా కనిపిస్తున్న కృష్ణుడు, గోపికలు ఎవరో తెలుసా? ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయిన ఒక స్టార్ హీరో పిల్లలే వీళ్లు. ఇదే సినిమాకు గానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు కూడా అందుకున్నాడీ హీరో. ఇప్పుడు ఇదే పాన్ ఇండియా మూవీకి ప్రీక్వెల్ తీస్తూ బిజీగా ఉంటున్నాడు. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్. ఈ పిల్లలు మరెవరో కాదు కాంతార సినిమాతో సంచలన విజయం సాధించిన కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి పిల్లలు.

రిషభ్ శెట్టి 2017లో ప్రగతి శెట్టి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు.. కుమారుడు రణ్ విత్, కుమార్తె రాధ ఉన్నారు. పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉండే రిషబ్ తన ఫ్యామిలీ ఫొటోలను తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా ప్రతి పండక్కి తన భార్య, పిల్లలతో కలిసి దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంటుంటాడు. అలా తాజాగా కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని తన కుమారుడు రన్విత్ శెట్టిని ఇలా చిన్ని కృష్ణుడిగా తయారుచేశారు. అలాగే కూతురు రాధ్య శెట్టిని గోపికలా ముస్తాబు చేశారు. అనంతరం ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ ఫొటోలు నెట్టింట తైగ వైరలవుతున్నాయి. ముఖ్యంగా రిషబ్ ఫ్యాన్స్ ఈ ఫోటోలను మరింత వైరల్ చేస్తున్నారు. వీటిని చూసిన నెటిజన్లు పిల్లలు చాలా క్యూట్ గా ఉన్నారంటూ కాంప్లిమెంట్స్ అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కృష్ణుడి, గోపికలుగా రిషభ్ శెట్టి  పిల్లలు.,

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం