AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: గర్భంతో ఉండగా డైలీ భగవద్గీత చదివా.. లేబర్ వార్డులో పురిటి నొప్పుల సమయంలో కూడా..

తెలుగుతో పాటు కన్నడ సినిమాల్లోనూ నటించిన ఈ హీరోయిన్ 2023లో ఓ ప్రముఖ నటుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ ప్రేమ బంధానికి ప్రతీకగా గతేడాది చివర్లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే తాజాగా ఈ బ్యూటీ తన ప్రెగ్నెన్సీ జర్నీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది.

Tollywood: గర్భంతో ఉండగా డైలీ భగవద్గీత చదివా.. లేబర్ వార్డులో పురిటి నొప్పుల సమయంలో కూడా..
Tollywood Actress
Basha Shek
|

Updated on: Aug 17, 2025 | 7:40 AM

Share

పురిటి నొప్పులనేవి స్త్రీకి ఒక విధంగా పునర్జన్మలాంటివి. సమయంలో వచ్చే నొప్పులు తట్టుకుని బిడ్డను ప్రసవించడమంటే ఆషా మాషీ కాదు. సమయంలో ధైర్యం తెచ్చుకోవడం కోసం, మానసికంగా బలంగా ఉండేందుకు మహిళలు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు పాటలు వింటుంటారు. మరికొందరు తమకు నచ్చిన పనులు చేస్తుంటారు. అయితే టాలీవుడ్ హీరోయిన్ మాత్రం పురిటి నొప్పులు సమయంలో భగవద్గీత శ్లోకాలు విన్నానంటోంది. ఆస్పత్రిలోని లేబర్‌ రూమ్‌లో తన మావయ్య శ్లోకాలు చదివి తనకు వినిపించాడంటోంది. అంతకు ముందు కూడా తాను గర్భంతో ఉన్నప్పుడు ప్రతిరోజు భగవద్గీత చదివేదాన్నంటూ చాలా ఆసక్తకర విషయాలు పంచుకుంది. శ్రీకృష్ణాష్టమి నేపథ్యంలో తన కూతురును శ్రీకృష్ణుడిలా ముస్తాబు చేసిన హీరోయిన్ ఇలా చెప్పుకొచ్చింది. ‘ చిన్నప్పుడు అమ్మ నన్ను బాగా రెడీ చేసేది. స్కూల్‌లో నేను రాధ వేషం వేసేదాన్ని. మరికొన్నిసార్లు కృష్ణుడి వేషం కూడా వేసేదాన్ని. ఆ జ్ఞాపకాలన్నీ ఇప్పటికీ నాతో పదిలంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ సాంప్రదాయాన్ని నా కూతురి ద్వారా కొనసాగించాలనుకుంటున్నాను

మన జీవితంలో ఎదురయ్యే చాలా సమస్యలు, ప్రశ్నలకు భగవద్గీతలో సమాధానం దొరుకుతుంది. నేను గర్భంతో ఉన్నప్పుడు ప్రతిరోజు భగవద్గీత చదివేదాన్ని. దానివల్ల మానసికంగా ఎంతో ధృడంగా తయారయ్యాను. ఇక ఆస్పత్రిలోని లేబర్‌ రూమ్‌లో పురిటినొప్పులతో బాధపడుతున్నప్పుడు నాకు ధైర్యం చెప్పేందుకు మామయ్య భగవద్గీతలోని శ్లోకాలు చదివాడు. ఇప్పుడు నాకు తొమ్మిది నెలల కూతురు ఉంది. తనను కృష్ణుడిగా రెడీ చేయాలని చాలారోజులుగా అనుకుంటున్నాను. ఈ రోజు నా కల నెరవేరింది. అని తెగ సంబరపడిపోయిందీ అందాల తార.

ఇవి కూడా చదవండి

కూతురితో  హర్షిక పునాచ

ఇలా శ్రీకృష్ణాష్టమి రోజున భగవద్గీత గొప్పతనం గురించి చెప్పిన టాలీవుడ్ హీరోయిన్ పేరు హర్షిక పునాచ. కర్ణాటకకు చెందిన ముద్దుగుమ్మ తెలుగులోనూ సినిమాలు చేసింది. ‘ఏడుకొండలవాడ వెంకటరమణ అందరూ బాగుండాలి’, ‘అప్పుడలా ఇప్పుడిలా’ తదితర చిత్రాల్లో హీరోయిన్‌‌గా చేసింది. సోగ్గాడే చిన్ని నాయనా కన్నడ రీమేక్‌లోనూ నటించింది. తెలుగు, కన్నడతో పాటు తమిళ, మలయాళ, కొంకణి, భోజ్‌పురి, కొడవ భాషా చిత్రాల్లోనూ యాక్ట్‌ చేసింది. 2023లో నటుడు భువన్‌ పొన్నానను పెళ్లి చేసుకుంది. గతేడాది చివర్లో పాపకు జన్మనిచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.