AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఒక్క క్లూ దొరక్కుండా లేడీ సింగర్ హత్య.. ఓటీటీలో రియల్ క్రైమ్ స్టోరీ.. ట్విస్టులకు మైండ్ బ్లాక్ ఖాయం

ఈ మధ్యన ఓటీటీల్లో రియల్ స్టోరీలకు మంచి ఆదరణ ఉంటోంది. ఆడియెన్స్ వీటిని చూసేందుకు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ కూడా ఒక రియల్ స్టోరీనే. 1923 లో జరిగిన ఒక రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కింది. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

OTT Movie: ఒక్క క్లూ దొరక్కుండా లేడీ సింగర్ హత్య.. ఓటీటీలో రియల్ క్రైమ్ స్టోరీ.. ట్విస్టులకు మైండ్ బ్లాక్ ఖాయం
OTT Movie
Basha Shek
|

Updated on: Aug 17, 2025 | 8:02 PM

Share

మధ్యన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఓటీటీలో మంచి ఆదరణ ఉంటోంది. భాషతో ప్రమేయం లేకుండా ఆడియెన్స్ ఇటువంటి సినిమాలను బాగా చూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా ప్రతి వారం జానర్ సినిమాలను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి. కాగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ఒక రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కింది. 1923 లో జరిగిన ఒక రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కింది. క్రైమ్ థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో సాగే సినిమాలోని ట్విస్టులు ఆడియెన్స్ కు మంచి థ్రిల్ ను అందిస్తాయి. కథ విషయానికి వస్తే.. లైలా ఒక ప్రొఫెషనల్ మోడల్ గా, సింగర్ గా సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటుంది. అయితే ఆమె ఒక రోజు తన అపార్ట్‌మెంట్‌లోనే దారుణ హత్యకు గురవుతుంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. హత్య జరిగిన సమయంలో ఆమె ఫ్లాట్ లోపలి నుంచి లాక్ చేయబడి ఉంటుంది. దీంతో పోలీసులు తలలు పట్టుకుంటారు. దీంతో కొత్తగా వచ్చిన ఐపీఎస్ అధికారి సంధ్యా మోహన్ రాజ్ కేసు బాధ్యతలను అప్పగిస్తారు. ఆమె కేసును పరిష్కరించేందుకు ప్రైవేట్ డిటెక్టివ్ అయిన వినాయక్ హెల్ప్ తీసుకుంటుది. విచారణలో భాగంగా లైలాకు మేనేజర్‌గా ఉండే బబ్లూ, లైలా బాయ్‌ఫ్రెండ్ సతీష్, ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్ అర్జున్ వాసుదేవన్, మోడలింగ్ కంపెనీ ఏజెంట్ ఆదిత్య కౌశిక్ అనే వ్యక్తులను అనుమానిస్తారు. అయితే కేసును దర్యాప్తు చేస్తున్న కొద్దీ   సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయి.

మరి లైలాను హత్య చేసింది ఎవరు? ఎందుకు ఆమెను హత్య చేశాడు? మర్డర్ చేసిన వ్యక్తిని పోలీసులు పట్టుకుంటారా? ? డోర్ లోపలి నుంచి లాక్ చేసినా ఈ హత్య ఎలా జరుగుతుంది ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మిస్ అవ్వకుండా చూడాల్సిందే. సినిమా పేరు కొలై. తెలుగులో హత్య పేరుతో డబ్ చేయబడింది. బాలాజీ కె.కుమార్ దర్శకత్వం వహించిన సినిమాలో విజయ్‌ ఆంటోనీ, రితికా సింగ్‌, మీనాక్షి చౌదరి, రాధికా శరత్‌కుమార్‌, మురళీ శర్మ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

ప్రస్తుతం సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. మంచి ఇంటెన్స్, క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలను చూడాలనుకునేవారికి హత్య ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు. సినిమా మందుకు వెళ్లే కొద్దీ వచ్చే ట్విస్టులు మాత్రం ఎవరూ ఊహించని విధంగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దురంధర్ మూవీ చూసిన టీం ఇండియా.. వీడియో వైరల్
దురంధర్ మూవీ చూసిన టీం ఇండియా.. వీడియో వైరల్
పడుకునే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చట.. ఎలా అంటే?
పడుకునే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చట.. ఎలా అంటే?
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!