- Telugu News Photo Gallery Spiritual photos Vastu Tips: Bringing these home on Krishnashtami will bring good luck
వాస్తుటిప్స్: అదృష్టం కలిసి రావాలా.. అయితే కృష్ణాష్టమి రోజున ఇవి ఇంటికి తెచ్చుకోండి!
శ్రీ కృష్ణ జన్మాష్టమి వచ్చేసింది. భారతదేశం అంతటా శ్రీకృష్ణజన్మాష్టమిని ఆగస్టు 16 శనివారం రోజునం ఘనంగా జరుపుకుంటారు. అయితే వాస్తు ప్రకారం, ఈ రోజున కొన్ని రకాల వస్తువులను ఇంటిలోకి తెచ్చుకోవడం చాలా శుభ ప్రదం అంట. కాగా, ఇప్పుడు మనం శ్రీకృష్ణాష్టమి రోజున ఎలాంటి వస్తువులు ఇంటిలోకి తీసుకొచ్చుకోవాలో చూద్దాం!
Updated on: Aug 18, 2025 | 11:59 AM

శ్రీకృష్ణుడికి పిల్లన గ్రోవి, నెమలి ఈకలు అంటే చాలా ఇష్టం. అందుకే ఈ రోజున ఈ రెండు వస్తువలను కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకోవడం వలన చాలా మంచి జరుగుతుందని చెబుతున్నారు పండితులు. జన్మాష్టమి రోజున నెమలి ఈక తీసుకొచ్చుకొని ఇంటిలో పెట్టుకోవడం వలన ఆందోళనలు తొలిగిపోయి, కాలస్పదోషం భయం ఉండదంట. అందుకే తప్పక ఈ రెండు వస్తువులు తీసుకొచ్చుకోవడం చాలా మంచిదంట.

జన్మాష్టమి రోజున కొందరు శ్రీకృష్ణుడిని విగ్రహాన్ని కొనుగోలు చేస్తుంటారు. అయితే అలాంటి వారు ఆవు, దూడతో ఉన్న కన్నయ్య విగ్రహం కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లడం శుభప్రదం అంట. దీని వలన వాస్తు దోషాలు తొలిగిపోయి, సంతానం కలుగుతుందని చెబుతున్నారు వాస్తు నిపుణులు.

కృష్ణుడు జన్మించిన రోజున అష్టధాతువుతో చేసిన శ్రీ కృష్ణుడి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవడం చాలా మంచిదంట. అందువలన ఎవరైతే సమస్యలతో సతమతం అవుతున్నారో, అలాంటి వారు ఈ విగ్రహాన్ని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకోవడం వలన సమస్యల నుంచి బయటపడి సంతోషంగా గడుపుతారంట.

శ్రీ కృష్ణజన్మాష్టమి రోజు వైజయంతి మాలను తీసుకొచ్చి, ఇంటిలో కన్నయ్య పూజ సమయంలో శ్రీకృష్ణుడికి సమర్పించడం వలన ఆర్థిక సమస్యలు తొలిగిపోయా, ఆనందంగా జీవిస్తారంట.

అదే విధంగా కృష్ణాష్టమి రోజున దక్షిణావర్తి శంఖం తీసుకొచ్చి, అందులో నీరు , పాలు పోసి, శ్రీకృష్ణుడికి అభిషేకం చేయడం వలన వైవాహిక జీవితంలోని సమస్యలు తొలిగిపోతాయంట.



