- Telugu News Photo Gallery Spiritual photos Sri krishna Janmashtami 2025: 7 Famous Radha Krishna Temples To Visit In India
Janmashtami 2025: కన్నయ్య భక్తులా.. మన దేశంలో తప్పనిసరిగా చూడాల్సిన రాదా కృష్ణుల ఆలయాలు ఇవే..
భూమిమీద పాపా భారం పెరిగినప్పుడల్లా శ్రీ మహా విష్ణువు అవతారం దాల్చి దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణ చేస్తాడు. అలా శ్రీ మహా విష్ణువు అవతారాల్లో శ్రీ కృష్ణుడు అవతారం ఒకటి. ద్వారపర యుగంలో దేవకీనందుల శ్రావణ మాసం కృష్ణ పక్షం, అష్టమి తిథి రోజున జన్మించాడు. అందుకనే ప్రతి ఏడాది ఈ రోజున కన్నయ్య భక్తులు కృష్ణాష్టమి పండగను జరుపుకుంటారు. అయితే ప్రేమకు చిహ్నం ఎవరంటే రాధాకృష్ణులని చెబుతారు. మన దేశంలో రాధా-కృష్ణ దేవాలయాలు చాలా ఉన్నాయి. అయితే కొన్ని మాత్రం ప్రత్యేకతని సంతరించుకున్నాయి. మన దేశంలో సందర్శించాల్సిన 7 రాధా-కృష్ణ దేవాలయాల గురించి తెలుసుకుందాం..
Updated on: Aug 16, 2025 | 9:51 AM

హిందూ పండుగలో ఒకటి శ్రీ కృష్ణ జన్మాష్టమి. ఈ పండగను కృష్ణ జన్మ భూమి మథురలో మాత్రమే కాదు యావత్ భారత దేశంలో ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ పండగ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న శ్రీ కృష్ణ దేవాలయాలతో పాటు.. వైష్ణవ క్షేత్రాల్లో కూడా జరుపుకుంటారు. ఈ మేరకు ఇప్పటికే ఆలయాలను అలంకరించారు. అయితే కృష్ణాష్టమి పండగ రోజున మాత్రమే కాదు కన్నయ్య భక్తులు తప్పనిసరిగా తమ జీవితంలో ఒక్కసారైనా సందర్శించాల్సిన రాధా-కృష్ణ దేవాలయాలను గురించి ఈ రోజు తెలుసుకుందాం..

ప్రేమ్ మందిరం ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లా సమీపంలోని బృందావనంలో ఉంది. ఇది భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ రాధా-కృష్ణ ఆలయాలలో ఒకటి. 54 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ దేవాలయం.. తెల్లని ఇటాలియన్ పాలరాయితో నిర్మించబడింది. ప్రేమ్ మందిర్, రాధా కృష్ణ, సీతా రాముల జీవితాలలోని ముఖ్య ఘట్టాలను వర్ణించే శిల్పాలకు ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయం జగద్గురు శ్రీ కృపాలు జీ మహారాజ్ నిర్మించారు.

శ్రీ రాధా మదన్ మోహన్ ఆలయం బృందావనం లోని పురాతన ఆలయాలలో ఒకటి. ఇది నాగర శైలిలో నిర్మించబడింది. యమునా నది ఒడ్డున ఉంది. కాలియా ఘాట్‌కు దగ్గరగా 50 అడుగుల ఎత్తులో ఉంది . ఈ ఆలయం శీతాకాలంలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు, వేసవి నెలల్లో రాత్రి 9.30 గంటల వరకు తెరిచి ఉంటుంది.

శ్రీ రాధా రామన్ ఆలయం బృందావనంలో ఉన్న మరొక ఆలయం. దీనిని మదన్ మోహన్ ఆలయం అని కూడా పిలుస్తారు. ద్వాదశాదిత్య కొండపై ఉన్న ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం ఈ ఆలయంలోని కృష్ణుని విగ్రహం చాలా ప్రసిద్ధి చెందింది.. ఈ ఆలయాన్ని మొదట కృష్ణుని ముని మనవడు వజ్రనాభుడి ప్రతిష్టించాడు. తర్వత ఈ విగ్రహాన్ని అద్వైత ఆచార్య కనుగొన్నారు. తర్వాత బృందావనంలోని ఆరుగురు గోస్వామిలలో ఒకరైన గోపాల్ భట్ట గోస్వామి 1542 ADలో స్థాపించారు.

ఉత్తరప్రదేశ్‌లోని శ్రీ రాధా దామోదర్ ఆలయం బృందావనంలోని అత్యంత పవిత్రమైనది. పురాతనమైనదిగా పరిగణించబడుతుంది. ఈ ఆలయం 1542లో శ్రీల జీవ గోస్వామి స్థాపించారు. ఇది గౌడియ వైష్ణవ సంప్రదాయానికి చెందినది. ఈ ఆలయంలో గర్భ గుడిలో శ్రీ రాధా దామోదరుడిని (కృష్ణుడు) పూజిస్తారు. ఆలయ ప్రాంగణంలో రాధా కృష్ణులతో పాటు ఇతర దేవతా మూర్తుల విగ్రహాలు కూడా ఉన్నాయి.

శ్రీ శ్రీ రాధా రసబిహారి ఆలయం ముంబైలోని జుహులో ఉన్న ఒక అద్భుతమైన పాలరాయి ఆలయ సముదాయం. తెలుపు, ఎరుపు పాలరాయితో అందంగా కనిపిస్తుంది. శ్రీకృష్ణునికి అంకితం చేయబడిన ఈ ఆలయం ఇస్కాన్ ఆలయం, శ్రీ శ్రీ రాధా రసబిహారి ఆలయం, హరే రామ హరే కృష్ణ దేవాలయం వంటి పేర్లతో ప్రసిద్ధి చెందింది. ఒకప్పుడు దట్టమైన అడవి తప్ప మరేమీ లేని ప్రదేశంలో ఆలయాన్ని నిర్మించడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే.

రాధా కృష్ణుల వివాహ స్థలి ఒక హిందూ దేవాలయం. ఇది రాధాదేవి శ్రీకృష్ణుని నిలయం. ఇది ఉత్తర ప్రదేశ్ లోని మధుర జిల్లాలోని భండిర్వన్‌లో ఉంది. పురాణాల ప్రకారం ఇక్కడ రాధా, కృష్ణులు బ్రహ్మ సమక్షంలో వివాహం చేసుకున్నారని నమ్ముతారు. ఈ ఆలయంలో రాధా, కృష్ణులతో పాటు బలరాముడికి కూడా మందిరం ఉంది

మధురలోని శ్రీ రాధావల్లభ్ లాల్ జీ ఆలయాన్ని రాధావల్లభ ఆలయం అని కూడా పిలుస్తారు. 16వ శతాబ్దంలో స్థాపించబడిన పురాతన ఆలయం. ఈ ఆలయాన్ని శ్రీ హిట్ హరివంశ మహాప్రభువు నిర్మించాడు. ఈ ఆలయంలో రాధా వల్లభ సంప్రదాయం చాలా ముఖ్యమైనది. ఈ సంప్రదాయంలో రాధా, కృష్ణుడికి సమానంగా ప్రాముఖ్యత ఇస్తారు. రాధా వల్లభ అనేది కృష్ణుడిని సూచించే ఒక పేరు. ఈ ఆలయంలో రాధా, కృష్ణుడిని పూజిస్తారు.




