- Telugu News Photo Gallery Spiritual photos It is auspicious to visit these temples on Vinayaka Chavithi
కోరికలు తీర్చే గణపతులు.. వినాయక చవితికి ఈ ఆలయాలకు వెళ్తే శుభప్రదం..
భారతదేశంలో గణపతికి చెందిన అనేక దేవాలయాలున్నాయి. కొన్ని దేవాలయాలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. ఇవి స్థల పురాణంతోనో ఆలయ నిర్మాణంతోనో ఈ ఆలయాలు ప్రసిద్ధి చెందాయి. ఈ రోజు దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఖ్యాతి గడించిన 5 ప్రత్యేక గణపతి ఆలయాల గురించి ఈ రోజు మనం వీటి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం..
Updated on: Aug 16, 2025 | 11:40 AM

ఇండోర్‌లోని ఖజ్రానా అనే చిన్న పట్టణంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గణేష్ దేవాలయం ఉంది. ఇక్కడ గణేశుడి విగ్రహం వెనుక స్వస్తిక్ గుర్తును వేసి మోదకం నైవేదంగా పెడితే తమ కోరికలు నెరవేరతాయని భక్తుల నమ్మకం. ఈ ఆలయాన్ని 1735లో హోల్కర్ రాజవంశానికి చెందిన సామ్రాజ్ఞి అహల్యాబాయి నిర్మించారు. ఈ ఆలయానికి వచ్చే భక్తులు ఆలయానికి మూడు ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆలయ గోడలకు దారాలు కడతారు. ఇలా చేసినప్పుడే ఆలయ దర్శనం పూర్తి అయినట్లు పరిగణిస్తారు. ప్రతి బుధవారం ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు, హారతులను ఇస్తారు. ఈ ఆలయం దేశంలోని అత్యంత ధనిక దేవాలయాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది.

మధ్యప్రదేశ్‌లోని జునా ప్రాంతంలో దేవాలయం జునా చింతామన్ గణేష ఆలయం. సుమారు 1200 సంవత్సరాల నాటి ఈ దేవాలయం అత్యంత ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కొలువైన వినాయకుడు భక్తుల సమస్యలను ఫోన్, మొబైల్, లెటర్‌తో విని సమస్యను పరిష్కరిస్తాడని ఖ్యాతి. ఈ విషయానికి రుజువు జర్మనీకి చెందిన ఒక భక్తుడు గణేశుడితో మాట్లాడాలని పట్టుబట్టాడని.. అలా గణపతికి చెవిలో తన సమస్య చెప్పిన ఆ విదేశీ భక్తుడి సమస్య తీరినట్లు.. వినాయకుడితో మాట్లాడిన కొన్ని రోజుల తర్వాత తన సమస్య తీరినట్లు తెలిపాడని చెబుతారు. అప్పటి నుండి ఈ ప్రక్రియ ప్రారంభమైంది. భక్తుడు పూజారి ద్వారా గణేష్ దేవునితో మాట్లాడి తన కోరికను తీర్చుకుంటారు

రాజస్థాన్ లోని రణథంబోర్ కోటలో ఉన్న త్రినేత్ర గణేశ దేవాలయం ప్రసిద్ధ చెందిన పురాతన దేవాలయం. ఈ కోటలో గణేశుడు త్రినేత్రుడు. ఇది సుమారు 1000 సంవత్సరాల నాటిది. ఈ ఆలయాన్ని మహారాజా హర్మీర్‌దేవ్ చౌహాన్ నిర్మించారు. ఈ ఆలయంలో వినాయకుడు స్వయంగా వెలిసినట్లు చెబుతారు.

మండై గణపతి ఆలయం మహారాష్ట్రలోని పూణేలోని అతి పెద్ద గణపతి ఆలయం. ఇక్కడ గణపతి ఆలయాన్ని అఖిల గణపతి మండలం అంటారు. దేశ విదేశాల నుండి ఇక్కడ స్వామివారిని దర్శించుకునేందుకు దేశ, విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వస్తారు.

ఉచ్చి పిల్లయార్ ఆలయం తమిళనాడులోని తిరుచ్చి నగరంలోని కొండపై ఉంది. ఈ ఆలయం దేశ, విదేశాల్లో ప్రసిద్ధి చెందింది. భారీ సంఖ్యలో భక్తులు ఈ ఆలయంలోని గణపతిని దర్శించుకుంటారు. చైల్ రాజులు పర్వతాలను చదును చేసి ఈ ఆలయాన్ని నిర్మించారు. పర్వత శిఖరం కారణంగా ఈ గణేష్ దేవాలయాన్ని హై పిళ్లైయార్ అని పిలుస్తారు.




