BAPS: శ్రీకృష్ణుడి జీవితం ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే.. మహంత్ స్వామి మహారాజ్ జన్మాష్టమి సందేశం
శ్రీ కృష్ణుడు మహాభారత యుద్ధంలో అర్జునుడికి రథ సారథిగా మారి, ద్రౌపదిని అవమానం నుండి కాపాడినట్లు BAPS సంస్థ ఆధ్యాత్మిక అధిపతి మహంత్ స్వామి మహారాజ్ వివరించారు. గోకులలోని పిల్లలు, గోపికలతో ఆయన గడిపిన క్షణాలను భక్తులు ఎప్పుడూ గుర్తుంచుకుంటారని చెప్పారు.

శ్రీ కృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని BAPS సంస్థ ఆధ్యాత్మిక అధిపతి మహంత్ స్వామి మహారాజ్ భక్తులకు ఒక ప్రత్యేక సందేశాన్ని అందించారు. స్వామినారాయణ అక్షరధామ్ తరపున ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ.. భగవాన్ శ్రీకృష్ణుడి జీవితం, ఆయన బోధనలు నేటికీ ప్రపంచాన్ని ప్రేరేపిస్తూనే ఉన్నాయని చెప్పారు. ‘‘దేశంలో భగవంతుడు ధర్మాన్ని స్థాపించడానికి ఎప్పటికప్పుడు అవతరిస్తుంటాడు. ఈ గొప్ప లక్ష్యం కోసం భూమిపై అవతరించిన భగవాన్ శ్రీకృష్ణుడి జీవితం, ఆయన చేసిన పనులు, బోధనలు ఇప్పటికీ ప్రపంచానికి స్ఫూర్తిని ఇస్తున్నాయి’’ అని మహంత్ స్వామి మహారాజ్ తెలిపారు.
శ్రీకృష్ణుడు తన భక్తుల పట్ల అపారమైన ప్రేమను చూపించేవాడని మహంత్ స్వామి మహారాజ్ గుర్తు చేశారు. మహాభారత యుద్ధంలో అర్జునుడికి రథ సారథిగా మారి, ద్రౌపదిని అవమానం నుండి కాపాడినట్లు వివరించారు. గోకులలోని పిల్లలు, గోపికలతో ఆయన గడిపిన క్షణాలను భక్తులు ఎప్పుడూ గుర్తుంచుకుంటారని చెప్పారు. శ్రీకృష్ణుడి లీలలను వివరించే శ్రీమద్ భాగవతం నేటికీ పారాయణం చేయబడుతోందన్నారు.
భగవద్గీత గొప్ప బహుమతి
‘‘శ్రీకృష్ణుడు ఈ ప్రపంచానికి ఇచ్చిన గొప్ప బహుమతి భగవద్గీత. దానిలోని జ్ఞానం అందరికీ ఉపయోగపడుతుంది. మనం దానిని ఆచరిస్తే, మనం భగవంతుని ప్రత్యక్ష ఉనికిని ఫీల్ అవుతాం. ఇదే జన్మాష్టమిని నిజమైన అర్థంలో జరుపుకోవడానికి సరైన మార్గం’’ అని మహంత్ స్వామి మహారాజ్ తన సందేశంలో తెలిపారు. ఈ జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుడి ఆశీస్సులు అందరికీ లభించాలని ప్రార్థించారు.
View this post on Instagram
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




