- Telugu News Photo Gallery Spiritual photos Janmashtami 2025: Raj Rajeshwar Rajyog on Janmashtami to Boost Wealth and Status for Signs
జన్మాష్టమి నాడు రాజరాజేశ్వర యోగం.. అపార సంపద, గౌరవం ఈ 5 రాశుల వారి సొంతం.. మీరున్నా చెక్ చేసుకోండి..
హిందువులు జరుపుకునే పండగల్లో జన్మాష్టమికి ఒకటి. కన్నయ్య పుట్టిన రోజుగా కృష్ణాష్టమిగా అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి రెడీ అవుతున్నారు. అయితే కృష్ణాష్టమి 190 సంవత్సరాల తర్వాత అరుదైన గ్రహ కలయికలు ఏర్పడుతున్నాయి. వీటిలో అమృత సిద్ధి యోగం, గజలక్ష్మి యోగం, రాజరాజేశ్వర యోగం ఉన్నాయి. ఈ యోగాలు కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇవ్వనున్నాయి. ముఖ్యంగా 5 రాశుల వారికి సంపద, గౌరవం, విజయం వంటి ప్రయోజనం చేకూరనున్నాయి.
Updated on: Aug 18, 2025 | 11:52 AM

ఈసారి జన్మాష్టమి చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది. ఎందుకంటే 190 సంవత్సరాల తర్వాత అరుదైన గ్రహాల కలయిక జరగనుంది. 1835 సంవత్సరంలో అదే గ్రహ స్థితి ఏర్పడుతోంది. ఆ సమయంలో కూడా జన్మాష్టమి పండుగ ఆగస్టు 16న వచ్చింది. చంద్రుడు, సూర్యుడు, కుజుడు, బృహస్పతి స్థానాలు మర్చుకోనున్నాయి. ఈ యాదృచ్చికంగా చంద్రుడు తన ఉచ్ఛ రాశి వృషభరాశిలో, సూర్యుడు తన సొంత రాశి సింహరాశిలో, బృహస్పతి మిథునరాశిలో, కుజుడు కన్యారాశిలో ఉంటారు. ఆ సమయంలో గౌరీ యోగం, ఆదిత్య యోగం, వేశి యోగం ఏర్పడుతున్నాయి. ఈ ఏడాది జన్మాష్టమి రోజున అనేక ఇతర అరుదైన యోగాలు ఏర్పడనున్నాయి.

ఈ సంవత్సరం జన్మాష్టమి నాడు అమృత సిద్ధి యోగం, గజలక్ష్మి యోగం, ముఖ్యంగా రాజరాజేశ్వర యోగం కూడా ఏర్పడుతున్నాయి, ఇది చాలా శుభప్రదమైనది. అరుదైనదిగా పరిగణించబడుతుంది. ఈ రాజయోగం ముఖ్యంగా 5 రాశులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ రాశికి చెందిన వారిపై శ్రీకృష్ణుడు ప్రత్యేక ఆశీస్సులను అందించనున్నాడు. ఈ యోగాలతో సంపద, ప్రతిష్ట, గౌరవం, విజయం లభిస్తుంది. దీని కారణంగా ఈ వ్యక్తుల జీవితాల్లో కొత్త శక్తి వస్తుంది. సానుకూల మార్పులు కనిపిస్తాయి.

వృషభ రాశి: జన్మాష్టమి సందర్భంగా ఈ రాశి కుండలిలో రెండవ ఇంట్లో గజలక్ష్మీ రాజ్యయోగం ఏర్పడుతోంది. ఈ శుభ యోగం కారణంగా వీరికి మంచి డబ్బు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ జీవితానికి సంబంధించిన కొన్ని శుభవార్తలు అందవచ్చు. చాలా కాలంగా సంతానం కోసం కోరుకుంటున్న వ్యక్తులు శుభవార్త వినే అవకాశం ఉంది. ఉద్యోగస్తుల ఆదాయం పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగస్తులు తమ కెరీర్‌లో ముందుకు సాగడానికి ఒక సువర్ణావకాశాన్ని పొందుతారు.

మిథున రాశి: ఈ జన్మాష్టమి నాడు వీరి రాశిచక్రం లగ్నములో గురు, శుక్రుల కలయిక ఏర్పడుతోంది. ఇది వీరికి సమాజంలో గౌరవాన్ని కీర్తి ప్రతిష్టలను అందిస్తుంది. వీరి ప్రభావాన్ని పెంచుతుంది. వీరి నిర్వహణ నైపుణ్యాలు ప్రయోజనం చేకూరుస్తాయి. కెరీర్‌లో వృద్ధికి అవకాశాలు లభిస్తాయి. పూర్వీకుల ఆస్తి నుంచి లాభం , ఆర్థిక ప్రయత్నాలలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయం పెట్టుబడికి చాలా శుభప్రదంగా నిరూపించబడవచ్చు.

సింహ రాశి: జన్మాష్టమి రోజున సూర్యుడు తన సొంత రాశిలో సంచరించనున్నాడు. ఇది వీరికి గౌరవం , సామాజిక ప్రతిష్టను పెంచే సమయం అవుతుంది. వీరి వైవాహిక జీవితంలో ఆనందాన్ని పొందుతారు. అవివాహితులకు వివాహ అవకాశాలు ఉంటాయి. ఉద్యోగస్థులకు ఆఫీసులో ప్రాభవం పెరుగుతుంది. సానుకూల మార్పులు కలుగుతాయి.

ధనుస్సు రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తుల జాతక కుండలిలోని ఏడవ ఇంట్లో గజలక్ష్మి రాజ్యయోగం ఏర్పడటం వల్ల సామాజిక ప్రభావం పెరుగుతుంది. భౌతిక సౌకర్యాలు పెరుగుతాయి. చాలా కాలంగా ఎదురుచూస్తున్న కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంది. కెరీర్‌లో కొత్త అవకాశాలను పొందుతారు. ఈ సమయం వీరికి ఆర్ధిక పురోగతికి మార్గం తెరుస్తుంది.




