ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం పరిధిలో లారీల్లో ప్రమాదకరంగా గ్రానైట్ రాళ్లను తరలిస్తున్నారు. నేలకొండపల్లి, కుసుమంచి, తిరుమలయ్యపాలెం, ఖమ్మం రూరల్, ముదిగొండ మండలాల్లో ఎలాంటి జాగ్రత్తలు లేకుండా జరుగుతున్న ఈ రవాణా వల్ల వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.