AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ చిన్నికృష్ణుడిని గుర్తుపట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హీరో కమ్ డైరెక్టర్.. మొదటి సినిమాకే జాతీయ అవార్డు

తెలంగాణకు చెందిన ఈ నటుడు కమ్ డైరెక్టర్ మొదట షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ ఆరంభించాడు. ఆ తర్వాత డైరెక్టర్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే జాతీయ అవార్డు ను సొంతం చేసుకున్నాడు. ఆపై హీరోగానూ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యాడు.

Tollywood: ఈ చిన్నికృష్ణుడిని గుర్తుపట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హీరో కమ్ డైరెక్టర్.. మొదటి సినిమాకే జాతీయ అవార్డు
Tollywood Actor
Basha Shek
| Edited By: |

Updated on: Aug 18, 2025 | 11:45 AM

Share

శ్రీకృష్ణాష్టమి వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం (ఆగస్టు 16) చాలా మంది తల్లి దండ్రులు తమ బిడ్డలను కృష్ణుడిగా ముస్తాబు చేశారు. అనంతరం ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి మురిసిపోయారు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగమయ్యారు. ఈ క్రమంలోనే కృష్ణుడి వేషంలో ఉన్న ఓ టాలీవుడ్ సెలబ్రిటీ ఫొటో ఇప్పుడు నెట్టింట వైరలవుతోంది. పై ఫొటోలో ఉన్న పిల్లాడు ఇప్పుడు టాలీవుడ్ లో బాగా ఫేమస్. తెలంగాణకు చెందిన ఈ అబ్బాయి దర్శకుడిగా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా.. ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ నుంచి పట్టభద్రుడైన అతను మొదట షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ ఆరంభించాడు. దర్శకుడిగా తన ట్యాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నాడు . ఆ తర్వాత మెగా ఫోన్ పట్టుకుని టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే జాతీయ అవార్డు సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత హీరోగానూ, విలన్ గానూ, సహాయకనటుడిగానూ మెప్పించాడు. ఇలా మల్టీ ట్యాలెంటెతో దూసుకెళుతోన్న ఈ సెలబ్రిటీ మరెవరో కాదు పెళ్లి చూపులు, ఏమైంది ఈ నగరానికి సినిమాల డైరెక్టర్ తరుణ్ భాస్కర్.

ఈ మధ్యన తరుణ్ భాస్కర్ డైరెక్టర్ గా కంటే నటుడిగానే ఎక్కువగా సిల్వర్ స్క్రీన్ పై సందడి చేస్తున్నాడు. అతను దర్శకత్వం వహించిన కీడా కోలా సినిమా విడుదలై ఏడాదిన్నర కావస్తోంది. దీని తర్వాత మరే కొత్త ప్రాజెక్టును ప్రకటించలేదు. అయితే ఇటీవల హీరోగా ఓ సినిమాను అనౌన్స్ చేశాడు. ‘ఓం శాంతి శాంతి శాంతి’ మూవీతో మరోసారి కథానాయకుడిగా మన ముందుకు రానున్నాడు. ఇందులో ఇషా రెబ్బా హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళం బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ‘జయ జయ జయహే’ మూవీకి ఇది రీమేక్ అని తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి.

ఇవి కూడా చదవండి

‘ఓం శాంతి శాంతి శాంతి’ సినిమాతో తరుణ్ భాస్కర్, ఇషా రెబ్బా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అందానికి అందం.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. కీరదోస రహాస్యాలు ఇవే..
అందానికి అందం.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. కీరదోస రహాస్యాలు ఇవే..
29 బంతుల్లో ఇచ్చిపడేసిన బుడ్డోడు..
29 బంతుల్లో ఇచ్చిపడేసిన బుడ్డోడు..
దేశవ్యాప్తంగా కోట్లాది మంది పాన్ కార్డులు ఇనాక్టివ్..
దేశవ్యాప్తంగా కోట్లాది మంది పాన్ కార్డులు ఇనాక్టివ్..
ప్రభాస్ సినిమాకు 17 ఏళ్లు.. ఆసక్తికర పోస్ట్ చేసిన డైరెక్టర్ మెహర్
ప్రభాస్ సినిమాకు 17 ఏళ్లు.. ఆసక్తికర పోస్ట్ చేసిన డైరెక్టర్ మెహర్
మజ్జిగ వీరికి విషంతో సమానం.. తాగితే బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?
మజ్జిగ వీరికి విషంతో సమానం.. తాగితే బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?
నా బౌలింగ్ మార్పుల వెనుక ఓ 'మిస్టరీ మ్యాన్'..: నితీష్ కుమార్
నా బౌలింగ్ మార్పుల వెనుక ఓ 'మిస్టరీ మ్యాన్'..: నితీష్ కుమార్
మనిషికి చెడు కాలం వచ్చే ముందు కనిపించే 5 సంకేతాలు..
మనిషికి చెడు కాలం వచ్చే ముందు కనిపించే 5 సంకేతాలు..
పారడైజ్ దగ్గరకు ఆటోలో ఒంటరిగా వచ్చిన మహిళ.. అనుమానంతో చెక్ చేయగా
పారడైజ్ దగ్గరకు ఆటోలో ఒంటరిగా వచ్చిన మహిళ.. అనుమానంతో చెక్ చేయగా
రెండు రోజుల పాటు మీ సేవ సర్వీసులు బంద్.. కారణమిదే..
రెండు రోజుల పాటు మీ సేవ సర్వీసులు బంద్.. కారణమిదే..
కరివేపాకు చెట్టు పెరగటం లేదా? ఇలా చేశారంటే గుబురుగా పెరుగుతుంది..
కరివేపాకు చెట్టు పెరగటం లేదా? ఇలా చేశారంటే గుబురుగా పెరుగుతుంది..