ఆఫర్స్ కోసం ఎదురుచూస్తున్న అందాల ఈషా రెబ్బ

25 August   2026

Rajeev 

Pic credit - Instagram

తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న అందాల భామ ఈషా రెబ్బ.

హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఈషా, గ్లామర్‌తో పాటు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసింది.

మోడలింగ్‌తో కెరీర్ ప్రారంభించిన ఈషా, 2012లో విడుదలైన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' చిత్రంలో చిన్న పాత్ర ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది

 2013లో ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన 'అంతకు ముందు ఆ తరువాత' సినిమాతో కథానాయికగా మారింది.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడంతో పాటు ఈషా నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది. 

 అమి తుమి', 'అవును 2', 'దర్శకుడు', 'అరవింద సమేత వీర రాఘవ' వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది . 

ప్రస్తుతం ఈ చిన్నది మంచి ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను కవ్విస్తుంది.