వారంలో ఒక కిలో బరువు తగ్గాలా.. రోజుకు ఇలా నడిస్తే చాలు..
Krishna
23 June 2026
మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకుంటే ప్రతిరోజూ కనీసం 10 నుండి 12 వేల అడుగులు నడవాలి. ఇది మీ శరీరంలో అదనంగా పేరుకుపోయిన కేలరీలను వేగంగా కరిగించడానికి సహాయపడుతుంది.
10 వేల అడుగులు
సాధారణంగా నడిచే నెమ్మది వేగం కంటే కొంచెం వేగంగా (బ్రిస్క్ వాకింగ్) నడవడం వల్ల గుండె వేగం పెరిగి, శరీరంలో కొవ్వు, కేలరీలు చాలా వేగంగా కరుగుతాయి.
బ్రిస్క్ వాకింగ్
10 వేల కంటే ఎక్కువ అడుగులు వేయడానికి సుమారు గంటన్నర సమయం పడుతుంది. దీని కోసం ఒకేసారి కాకుండా.. ఉదయం ఒక 45 నిమిషాలు, సాయంత్రం ఒక 45 నిమిషాల చొప్పున రెండు భాగాలుగా విభజించుకుని నడవడం ఉత్తమం.
రెండు భాగాలుగా
శాస్త్రీయంగా వారానికి ఒక కిలో బరువు తగ్గాలంటే, మీ శరీరం నుండి సుమారు 7700 కేలరీలను తగ్గించుకోవాలి. కాబట్టి రోజువారీ నడకతో పాటు మీరు తీసుకునే ఆహారంలో కూడా కేలరీలను తగ్గించుకోవడం చాలా ముఖ్యం.
ఓవర్‌హెడ్ స్పైన్ స్ట్రెచ్
మీరు కోరుకున్న బరువును సులభంగా సాధించాలంటే ఆహారంలో అన్నం, జంక్ ఫుడ్స్ వంటి కార్బోహైడ్రేట్ల పరిమాణాన్ని తగ్గించాలి. వీటికి బదులుగా గుడ్లు, మొలకెత్తిన గింజలు, పప్పుధాన్యాల వంటి ప్రోటీన్ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి.
ప్రోటీన్
తీపి పదార్థాలు, బేకరీ ఫుడ్స్, నూనెతో కూడిన వేపుళ్లను పూర్తిగా పక్కన పెట్టాలి. ఇవి శరీరంలో చెడు కొవ్వును పెంచి బరువు తగ్గే ప్రక్రియను నెమ్మదింపజేస్తాయి.
స్వీట్లు
బరువు తగ్గే ప్రయాణంలో శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవడం ముఖ్యం. అందుకోసం రోజుకు కనీసం 2,3 లీటర్ల నీరు తప్పనిసరిగా త్రాగాలి. నీరు ఎక్కువగా తాగడం వల్ల మెటబాలిజం మెరుగై బరువు వేగంగా తగ్గుతారు.
2-3 లీటర్ల నీరు
నడక, ఆహార నియమాలతో పాటు రోజుకు 7-8 గంటల ప్రశాంతమైన నిద్ర అవసరం. నిద్రలేమి వల్ల బరువు పెరిగే హార్మోన్లు విడుదలవుతాయి. కాబట్టి క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని పాటిస్తే వారంలో ఒక కిలో తగ్గడం చాలా సులభం.