AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peddi Mega Event: నా కూతురు ఏయ్ పెద్ది అని పిలుస్తోంది.. ఈ విజయం నా జీవితాన్నే మార్చేసింది.. రామ్ చరణ్ ఎమోషనల్..

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ బుచ్చిబాబు సన తెరకెక్కించిన ఈ మూవీ ఇప్పటికే 400 కోట్లకు పైగా రాబట్టి ఇప్పటికీ థియేటర్లలో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా మెగా ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, సుకుమార్, అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా విచ్చేశారు.

Peddi Mega Event: నా కూతురు ఏయ్ పెద్ది అని పిలుస్తోంది.. ఈ విజయం నా జీవితాన్నే మార్చేసింది.. రామ్ చరణ్ ఎమోషనల్..
Ram Charan
Rajitha Chanti
|

Updated on: Jun 23, 2026 | 10:22 PM

Share

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. ఇటీవల విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ చిత్రం విజయానందాన్ని పంచుకోవడానికి చిత్రబృందం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ‘మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్’ పేరిట ఘనంగా విజయోత్సవ సభను నిర్వహించింది. ఈ అట్టహాసమైన వేడుకకు టాలీవుడ్ దిగ్గజం, మెగాస్టార్ చిరంజీవి , ప్రముఖ దర్శకుడు సుకుమార్, డైరెక్టర్ అనిల్ రావిపూడి ముఖ్య అతిథులుగా హాజరై సందడి చేశారు. మెగాస్టార్ రాకతో శిల్పకళావేదిక ప్రాంగణం అభిమానుల కోలాహలంతో, నినాదాలతో మారుమోగిపోయింది. ఈ సందర్భంగా మాట్లాడిన రామ్ చరణ్.. పెద్ది సినిమా సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులకు చిత్రయూనిట్ కు ధన్యవాదాలు తెలిపారు. పెద్ది తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని రామ్ చరణ్ పేర్కొన్నారు. “కొన్ని విజయాలు ఆనందపరుస్తాయి, కొన్ని తృప్తినిస్తాయి. కానీ ఈ విజయం అసలు నా లైఫ్‌నే మార్చేసింది,” అని ఆయన అన్నారు. తాను నటించిన ఇంతకు ముందు సినిమాలకు వచ్చిన అభిమానం ఒకటైతే, పెద్దికి వచ్చిన స్పందన ఒక కొత్త అనుభూతిని అందించిందని, ఇది తన గుండెల్లోతులకు వెళ్లిందని వివరించారు. థియేటర్లకు వచ్చిన కొత్త ప్రేక్షకులు, చిన్న పిల్లలు, వృద్ధులు కూడా పెద్దిని ఆస్వాదిస్తున్న తీరు తనను ఎంతగానో సంతోషపరిచిందన్నారు. “మళ్ళీ ఇలాంటి అనుభూతి వస్తుందో లేదో తెలియదు,” అని ఆయన అన్నారు. ఈ చిత్రం తన వ్యక్తిగత జీవితంపై చూపిన ప్రభావాన్ని తన కుమార్తె క్లీం కారా ఉదాహరణతో పంచుకున్నారు. “రామ్ చరణ్ ని మర్చిపోయి మీరు పెద్దిని గుర్తుపెట్టుకుంటారేమో భయమేస్తుంది. నా బుడ్డది క్లీంకార.. పెద్ది రిలీజ్ అయ్యేవరకు నానా నానా అనేది, ఇప్పుడు ఏయ్ పెద్ది అంటుంది. ఏయ్ అలా పిలవకే నాన్నని అంటే ఏయ్ పెద్ది నానా అంటుంది,” అని నవ్వుతూ చెప్పారు. తన పేరు, నానా అనే పిలుపు మర్చిపోయి పెద్దిని గుర్తుపెట్టుకునేలా చేసిన దర్శకుడు బుచ్చి బాబు సానకు రామ్ చరణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

దర్శకుడు బుచ్చి బాబు సానను తనకు పరిచయం చేసిన సుకుమార్‌కు రామ్ చరణ్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. సుకుమార్‌ను తన మోస్ట్ ఫేవరెట్ హ్యూమన్ బీయింగ్, మోస్ట్ ఫేవరెట్ పర్సన్, అలాగే తనకు పెద్ద అన్నయ్య లాంటి వ్యక్తి అని అన్నారు.. తన నిర్మాత వెంకట సతీష్ కిలారుకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తొలి సినిమా నిర్మాతలా కాకుండా, ఎన్నో సినిమాలు నిర్మించినంత అనుభవంతో బలమైన స్తంభంలా నిలిచారని ప్రశంసించారు. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు నాలుగు సినిమాలకు పనిచేశారని, పెద్దిని అత్యద్భుతంగా తెరకెక్కించారని కొనియాడారు. కుస్తీ షాట్స్, ఢిల్లీ ఎపిసోడ్ తనకు ఇష్టమని, ఆయన సినిమాటోగ్రఫీ ఒక మాస్టర్‌పీస్ అని అన్నారు. సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ గారికి పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టాలని కోరుతూ, సెకండ్ హాఫ్‌కు ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రాణం పోసిందని, జనాల్లోకి తీసుకెళ్లిందని ప్రశంసించారు. అలాగే ఎడిటర్ నవీన్ నూలి, లిరిసిస్ట్, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, లైటింగ్, ఆర్ట్ డిపార్ట్‌మెంట్లకు (అవినాష్ కొల్ల) ధన్యవాదాలు తెలిపారు. అవినాష్ కొల్ల పెద్ది ప్రపంచాన్ని అద్భుతంగా సృష్టించారని అన్నారు..

తెలుగు ప్రజలు ఎవరినీ అంత ఈజీగా ఇష్టపడరని, ఒక్కసారి ఇష్టపడితే చనిపోయే వరకు గుర్తుపెట్టుకుంటారని, ప్రేమిస్తూ ఉంటారని ఠాగూర్ సినిమాలోని డైలాగ్‌ను రామ్ చరణ్ గుర్తు చేసుకున్నారు. పెద్ది తమ సినిమా కాదని, నిజమైన ప్రేక్షక దేవుళ్ల సినిమా అని అన్నారు.. సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ, రివ్యూలు ఇచ్చిన ప్రతి రివ్యూయర్‌కు సెల్యూట్ చేశారు. ఒక మంచి సినిమా అంటే నటీనటులు, దర్శకులు, రివ్యూయర్స్, అభిమానులకు మించి వెళ్తుందని, పెద్దితో ప్రేక్షకులు అదే నిరూపించారని పేర్కొన్నారు. అలాగే రెండు రాష్ట్రాల మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతూ, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ (డిప్యూటీ సీఎం), దుర్గేశ్ లకు ధన్యవాదాలు తెలిపారు. జాన్వీ కపూర్, హలో హలో పాట పాడిన శృతి హాసన్, సహ నిర్మాత ఈషాన్, ఇతర నటీనటులకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సినిమా కథ విన్నప్పుడు తాను పెద్ద ఎక్స్‌పెరిమెంట్ చేస్తానని అనుకోలేదని, కమర్షియల్ సినిమాగానే చేశానని, ఇప్పుడే అది ఎక్స్‌పెరిమెంట్ అని తెలిసిందని సుకుమార్‌ను ఉద్దేశించి అన్నారు.

ఎక్కువమంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరో.. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్.. కానీ తెలుగులో అట్టర్ ప్లాప్.. కారణం ఇదే..

Follow Us