ఈ ఒక్క పండుతో బోలెడు ఆరోగ్యం.. వర్షాకాలంలో వదలకండి..!
23 June 2026
Jyothi Gadda
ప్రకృతి మనకు అందించిన ఎన్నో రకాల పండ్లలో పీచ్ పండు ఒకటి. పైన సున్నితమైన నూగు లాంటి పొరతో, లోపల తీపి, పులుపు కలయికతో ఉండే ఈ పండు శరీరానికి కావలసిన బోలెడన్ని పోషకాలు కలిగి ఉంది.
పీచ్ పండులో విటమిన్-సి, విటమిన్-ఎ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి కణాల నష్టాన్ని నివారిస్తాయి.
ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని రక్షించడంలో మరియు ఇమ్యూనిటీని బలోపేతం చేయడంలో ఇది అద్భుతంగా సహాయపడుతుంది.
మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తుంటే పీచ్ పండు ఒక ఉత్తమమైన స్నాక్ ఆప్షన్. ఇందులో నీటి శాతం, పీచు పదార్థం (Fiber) ఎక్కువగా ఉండటం వల్ల దీనిని తిన్న తర్వాత కడుపు నిండినట్లు అనిపిస్తుంది.
ఇందులో ఫ్యాట్ అస్సలు ఉండదు. కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. పీచ్ పండులో ఉండే విటమిన్-సి చర్మానికి అవసరమైన కొల్లాజెన్ (Collagen) ఉత్పత్తిని పెంచుతుంది.
ఈ పండులో ఉండే డైటరీ ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది ప్రేగుల కదలికలను సులభతరం చేసి మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ తో బాధపడేవారికి మంచి ఉపశమనం.
పీచ్ పండులో ఉండే పొటాషియం రక్తపోటును, నియంత్రణలో ఉంచి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే, ఇందులో ఉండే బీటా-కెరోటిన్ కంటి చూపును మెరుగుపరచడానికి, కంటి సమస్యలను నివారిస్తుంది.
అనేక ఆరోగ్య గుణాలు ఉన్న పీచ్ పండును సీజన్ ఉన్నప్పుడు అస్సలు వదులుకోవద్దు. అయితే, దీనిని తినే ముందు పండ్లను నీటితో శుభ్రంగా కడగడం మర్చిపోకండి. డయాబెటిస్ ఉన్నవారు పరిమితంగా తినాలి.