క్లాస్ 12 తర్వాత చదువు ఆపేయండి! సంచలనంగా వ్యాపారవేత్త కామెంట్
క్లాస్ 12 తర్వాత కాలేజ్ చదువులు పెద్దగా ఉపయోగం లేదంటూ మార్సెల్లస్ సీఐఓ ముఖర్జియా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. భారత విద్యా వ్యవస్థ బట్టీ చదువులకే పరిమితమైందని, విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించడంలో విఫలమవుతోందని ఆయన విమర్శించారు. డిగ్రీల కంటే ప్రాక్టికల్ స్కిల్స్, ఆలోచనా సామర్థ్యాలే భవిష్యత్తులో విజయానికి కీలకమని సూచించారు.
డిగ్రీలొద్దు..బిగ్రీలొద్దు.. అన్న ఓ వ్యాపారవేత్త కామెంట్ నెట్టింట సందడి చేస్తోంది. విద్యా వ్యవస్థపై ఆయన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. క్లాస్ 12 తర్వాత చదువు ఆపేయండి పెద్దగా ఉపయోగం లేదు అని మార్సెల్లస్ సీఐఓ ముఖర్జియా ఒక పాడ్‌కాస్ట్‌లో వ్యాఖ్యలు చేశారు. భారతీయ మధ్యతరగతి కాలేజ్ చదువుల విషయంలో తప్పు చేస్తోందని అభిప్రాయపడ్డారు. ఉద్యోగాల్లోకి ప్రవేశిస్తున్న యువతకు మన విద్యావ్యవస్థ ఎలాంటి విలువను అందించడం లేదని విమర్శించారు. దేశంలో అత్యధికంగా సంపాదించేవారు కేవలం 12వ తరగతిలో చదువు ఆపేసిన వారే అంటూ సెటైర్లు వేశారు. భారతదేశంలోని కంపెనీలు/యజమానులు కాలేజ్ డిగ్రీ వల్ల విద్యార్థులకు ఎలాంటి అదనపు నైపుణ్యాలు రావడం లేదనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారని ముఖర్జియా తెలిపారు. భారతదేశ విద్యా విధానం బట్టీ చదువులు, రుద్దుడుపైనే ఆధారపడుతోందని ముఖర్జియా అన్నారు. బట్టీ పట్టడం ఎగ్జామ్‌లో రాయడం తప్ప విద్యతో పిల్లలకు ఒరిగేదేమీ లేదన్నారు. ఈ విధానం వల్ల విద్యార్థులు AI, ఎలక్ట్రిక్ వాహనాలు, బయోటెక్, క్లీన్ టెక్ , అధునాతన సైన్స్ వంటి సరికొత్త సాంకేతిక ప్రపంచానికి సిద్ధం కాలేకపోతున్నారన్నారు. అసలు ఏఐ విషయాన్ని పక్కన పెడితే, కాలేజీల నుండి బయటకు వస్తున్న ప్రతి 100 మంది గ్రాడ్యుయేట్లలో కేవలం ముగ్గురు మాత్రమే వారు పాసైన సంవత్సరంలో ఉద్యోగం పొందుతున్నారని చెప్పారు. గ్రాడ్యుయేట్ల నిరుద్యోగిత రేటు 30 నుంచి 40 శాతం ఉందని, అదే చదువురాని వారిలో 3 శాతం మాత్రమే ఉందని అన్నారు. యూనివర్సిటీ వ్యవస్థ నైపుణ్యాలు పెంచే దిశగా కాకుండా బండ చదువుల ప్రక్రియగా మారిందని విమర్శించారు. ఇది స్కూలు రోజుల నుంచే మొదలవుతోందని, ప్రాథమిక స్థాయి నుంచే బట్టీ పట్టడమనే అలవాటుతో వారి మెదళ్లు మొద్దుబారిపోతున్నాయని విశ్లేషించారు. ఫలితంగా భారత్ అధునాతన రంగాలలో సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి ఇబ్బంది పడుతోందని అన్నారు. ఏ రంగంలోనూ అభివృద్ధి చెందలేకపోతున్నామంటూ ఆవేదనగా చెప్పారు. ముంబై లేబర్ మార్కెట్‌ను ఉదహరించారు. ఏసీ ఆఫీస్ ఉద్యోగం కోసం ప్రయత్నించే ఒక గ్రాడ్యుయేట్ కంటే, ఒక నిర్మాణ కార్మికుడు రెండు రెట్లు ఎక్కువ సంపాదిస్తాడనీ ఒక జేసీబీ ఆపరేటర్ అంతకంటే ఎక్కువ సంపాదిస్తున్నట్లు అన్నారు. భారతదేశం ఆధునిక ప్రపంచంతో పోటీ పడాలంటే, మన విద్యా విధానం… బట్టీ పద్ధతి నుంచి బయటపడి, “ఎలా ఆలోచించాలి” అని యువతకు నేర్పించాలని సూచించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏఐ వల్ల ఈ ముప్పు కూడా ఉందా? ఆలోచించడం మానేస్తే ప్రమాదమంటున్న నిపుణులు
ఈ డెలివరీ గర్ల్ వేరే లెవల్..? ఖుష్బూ కథకు సెల్యూట్!
కళ్లు చెదిరేలా క్యాబ్ డ్రైవర్ సంపాదన..? వైరల్ డ్రైవర్ కథ
సూరత్ మహిళ వింత దొంగతనం.. యజమాని షాక్!
ఉద్యోగులకు సీఈవో వింత గిఫ్ట్! ఒక్కొక్కరికీ రూ. 2.6 లక్షల పరుపు
క్లాస్ 12 తర్వాత చదువు ఆపేయండి! సంచలనంగా వ్యాపారవేత్త కామెంట్
ఈ డెలివరీ గర్ల్ వేరే లెవల్..? ఖుష్బూ కథకు సెల్యూట్!
కళ్లు చెదిరేలా క్యాబ్ డ్రైవర్ సంపాదన..? వైరల్ డ్రైవర్ కథ
సూరత్ మహిళ వింత దొంగతనం.. యజమాని షాక్!
ఉద్యోగులకు సీఈవో వింత గిఫ్ట్! ఒక్కొక్కరికీ రూ. 2.6 లక్షల పరుపు
ఖాళీగా ఓలా.. అయినా ఉబర్ కోసం అరగంట వెయిటింగ్!
11 ఏళ్లకే యూకే యూత్ పార్లమెంట్ సభ్యురాలిగా రికార్డ్..

