AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏఐ వల్ల ఈ ముప్పు కూడా ఉందా? ఆలోచించడం మానేస్తే ప్రమాదమంటున్న నిపుణులు

ఏఐ వల్ల ఈ ముప్పు కూడా ఉందా? ఆలోచించడం మానేస్తే ప్రమాదమంటున్న నిపుణులు

Phani CH
|

Updated on: Jun 23, 2026 | 8:24 PM

Share

ప్రతి చిన్న విషయానికీ AIపై ఆధారపడటం వల్ల మెదడు ఆలోచనా శక్తి, జ్ఞాపకశక్తిపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. న్యూరోసైంటిస్టు వివియెన్ మింగ్ ప్రకారం, స్వయంగా ఆలోచించకుండా పనులను దీర్ఘకాలం AIకు అప్పగిస్తే మెదడు చురుకుదనం తగ్గవచ్చు. ఇది వృద్ధాప్యంలో డిమెన్షియా వంటి సమస్యలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని కూడా బలహీనపరచే అవకాశం ఉందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

ఏ చిన్న సందేహం వచ్చినా AI ను ఆశ్రయిస్తున్నారు ప్రస్తుతం చాలా మంది. ఇలా ప్రతిదానికీ కృత్రిమ మేథస్సు పై ఆధారపడితే మెదడు పని తీరు తగ్గుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆలోచించడం, గుర్తు పెట్టుకోవడం వంటివి చేయకపోతే మెదడు చురుకుదనం తగ్గి డిమెన్షియా వంటి వ్యాధులు వస్తాయని అంటున్నారు. అమెరికాకు చెందిన న్యూరోసైంటిస్టు వివియెన్ మింగ్ ఈ విషయంపై హెచ్చరిక చేశారు. కృత్రిమ మేథస్సు వల్ల నేరుగా వ్యాధి రాదని, దాన్ని ఎలా వినియోగిస్తున్నామన్నదే అసలు సమస్య అన్నారు. AI కారణంతో యూజర్లు తమ ఆలోచనాశక్తిని తగ్గించేయడం ఇక్కడ ప్రమాదమని అన్నారు. క్రానిక్ సబ్‌స్టిట్యూషన్ అంటే మనం స్వయంగా ఆలోచించకుండా ఆ పనిని దీర్ఘకాలం పాటు AIకు అప్పగిస్తే కాగ్నిటివ్ రిజర్వ్‌ను పెంచుకునే, నిలబెట్టుకునే మెదడు సామర్థ్యం తగ్గే అవకాశం ఉంది. వృద్ధాప్యంలో వచ్చే డిమెన్షియాను ఎదుర్కోవడంలో మెదడు సామర్థ్యం కీలక పాత్ర పోషిస్తుంది. మానసిక చురుకుదనం తగ్గితే, మైండ్ కెపాసిటీ తగ్గుతుందని హెచ్చరించారు. రచనలు చేసిన వారిని, సంప్రదాయ పద్ధతులు ఉపయోగించిన వారిలో జ్ఞాపకశక్తి బాగుంది. వీరిని ఏఐ పై ప్రతి చిన్న విషయానికి ఆధారపడ్డ వారితో పోల్చిచూస్తే ఆశ్చర్యకరమైన ఫలితం వెలుగు చూసింది. అప్పుడే రాసిన విషయాన్నే గుర్తు పెట్టుకోవడంలో ఏఐ మీద ఆధారపడ్డవారు ఇబ్బంది పడ్డారని అధ్యయనంలో తేలింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ డెలివరీ గర్ల్‌ వేరే లెవల్‌..? ఖుష్బూ కథకు సెల్యూట్!

కళ్లు చెదిరేలా క్యాబ్‌ డ్రైవర్ సంపాదన..? వైరల్ డ్రైవర్ కథ

సూరత్ మహిళ వింత దొంగతనం.. యజమాని షాక్!

ఉద్యోగులకు సీఈవో వింత గిఫ్ట్! ఒక్కొక్కరికీ రూ. 2.6 లక్షల పరుపు

Follow Us