AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ డెలివరీ గర్ల్‌ వేరే లెవల్‌..? ఖుష్బూ కథకు సెల్యూట్!

ఈ డెలివరీ గర్ల్‌ వేరే లెవల్‌..? ఖుష్బూ కథకు సెల్యూట్!

Phani CH
|

Updated on: Jun 23, 2026 | 8:21 PM

Share

ముంబైలో స్విగ్గీ డెలివరీ పార్ట్నర్‌గా పనిచేస్తున్న ఖుష్బూ, యూపీ పోలీస్ ఉద్యోగమే తన అసలైన లక్ష్యమని చెబుతోంది. పగలు పని చేస్తూ, రాత్రిళ్లు పరీక్షలకు సిద్ధమవుతున్న ఆమె కథ సోషల్ మీడియాలో వైరల్ అయింది. స్విగ్గీ సీఈవో రోహిత్ కపూర్ ఆమె పట్టుదలను ప్రశంసిస్తూ ల్యాప్‌టాప్ బహుమతిగా అందించగా, నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

పగలంతా ముంబయి నగరంలో ఫుడ్ డెలివరీ గర్ల్ గా పని చేస్తూ.. రాత్రిపూట పుస్తకాలతో కుస్తీ పడుతోంది ఖష్బూ. తన గ్రామానికి వెళ్తే ఎలాగైనా సరే పోలీస్ యూనిఫామ్ లోనే తిరిగి వెళ్లాలనే సంకల్పంతో కష్టపడుతోంది. స్విగ్గీ ఫుడ్ మార్కెట్‌ప్లేస్ సీఈవో రోహిత్ కపూర్ తాజాగా వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. డెలివరీ పార్ట్‌నర్ల జీవిత విశేషాలు, వారి ఆశయాలను పంచుకునే “చాయ్ బిస్కూట్” సిరీస్‌లో భాగంగా రోహిత్ కపూర్ షేర్ చేసిన వీడియో వైరల్‌గా మారి స్ఫూర్తినిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌కు చెందిన ఖుష్బూ ప్రస్తుతం ముంబైలో స్విగ్గీ డెలివరీ పార్ట్నర్‌గా పని చేస్తోంది. రోహిత్ కపూర్ తో జరిగిన సంభాషణలో ఖుష్బూ తన జీవితానికి సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఈ ఫుడ్ డెలివరీ ఉద్యోగం తన జీవిత లక్ష్యం కాదని యూపీ పోలీస్ ఉద్యోగాన్ని సాధించడం తన లక్ష్యం అని చెప్పుకొచ్చింది. తన ఇంట్లో ఐదుగురు తోబుట్టువులలో తాను ఒకదాన్నని కనీసం తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా ఒంటరిగా ఘాజీపూర్ గ్రామం నుంచి ముంబయికి వచ్చానని ఇక్కడ స్విగ్గీలో పనిచేస్తూనే, మరోవైపు పోలీస్ పరీక్షల ప్రిపరేషన్‌కు కావాల్సిన ఖర్చులను తనే సమకూర్చుకుంటున్నానని తెలిపింది. ఏదో ఒకరోజు తను పోలీస్ యూనిఫామ్ వేసుకుని తన ఊరికి తిరిగి వెళ్లి, తల్లిదండ్రులు, గ్రామం గర్వపడేలా చేయాలనేదే తన కల అంది. దీనిపై సీఈవో రోహిత్ కపూర్ స్పందిస్తూ.. చాలా మంది తమ గ్రామాలు వదిలి ముంబయికి వస్తే మళ్లీ వెనక్కి వెళ్లకూడదని అనుకుంటారు. కానీ ఖుష్బూ మాత్రం తన గ్రామానికి తిరిగి వెళ్లాలనే ముంబయి వచ్చిందని అది కూడా ఓ పోలీస్ ఆఫీసర్‌గా అని ప్రశంసించారు. ఇల్లు వదిలి వచ్చే ధైర్యం అందరికీ ఉంటుంది. కానీ ఎందుకు వచ్చామో అనే క్లారిటీ ఉండటం చాలా అరుదు అని రాసుకొచ్చారు. పరీక్షల ప్రిపరేషన్ కోసం ల్యాప్‌టాప్ అందించారు. వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ఖుష్బూ పట్టుదలకు ప్రశంసలు కురిపిస్తున్నారు. పరీక్షల ప్రిపరేషన్ కోసం ల్యాప్‌టాప్ ఇవ్వడం సరే స్టడీ మెటీరియల్ కూడా ఇవ్వాలంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. మొత్తంగా ఖుష్బూ పట్టుదలకు సర్వత్రా ప్రశంసలు అందుతోంది. ఆమె అనుకున్నది సాధించాలని ఆశిద్దాం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కళ్లు చెదిరేలా క్యాబ్‌ డ్రైవర్ సంపాదన..? వైరల్ డ్రైవర్ కథ

సూరత్ మహిళ వింత దొంగతనం.. యజమాని షాక్!

ఉద్యోగులకు సీఈవో వింత గిఫ్ట్! ఒక్కొక్కరికీ రూ. 2.6 లక్షల పరుపు

Follow Us